హోమ్ / ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం / మేలు చేసే పచ్చి మామిడి!
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మేలు చేసే పచ్చి మామిడి!

పచ్చిమామిడికాయలు విరివిగా దొరికే కాలమిది. ఇందులో ఎన్నో పోషకాలున్నాయి. ఆరోగ్యానికీ ఇదెంతో మేలు చేస్తుంది. ఎలాగంటే..

  • పచ్చికాయల్లో చక్కెరశాతం సమస్య లేదు. ఇందులో కెలొరీల కరిగించే పదార్థాలూ సమృద్ధిగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు పచ్చిమామిడిని పచ్చడి గానూ, కూరల్లో నూ చేర్చి తీసుకోవచ్చు.
  • ఎసిడిటీ వల్ల ఛాతీలో మంటతో కూడిన నొప్పి వస్తుంది. అలాంటప్పుడు పచ్చిమామిడికాయ ముక్కని సన్నగా తరిగి బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే సమస్య ఉండదు.
  • గర్భిణులకు వాంతులూ, వికారం వల్ల అసౌకర్యంగా ఉంటుంది. వారు పచ్చిమామిడి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. చాలామందికి మధ్యాహ్నంవేళ భోజనం చేశాక కొందరికి బద్దకంగా అనిపిస్తుంది. అలాంటి వారు పచ్చిమామిడిని ఏదో ఒక రూపంలో తీసుకుంటే చురుగ్గా ఉంటారు.
  • పచ్చిమామిడి తినడంవల్ల వూపిరితిత్తులు శుభ్రపడతాయి. పుల్లటి మామిడి ముక్కల్లో వూపిరితిత్తుల్లోని బ్యాక్టీరియాను దూరం చేసే గుణం ఉంటుంది. చెమట కాయలు కూడా తొలగిపోతాయి. శరీరంలో వేడీ దూరమవుతుంది.
  • ఇందులో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచడంతోపాటూ కొత్త రక్తకణాల నిర్మాణానికి దోహదం చేస్తుంది. ఈ కాలంలో చెమటపట్టడం వల్ల లవణాలను ఎక్కువగా కోల్పోతారు. పచ్చిమామిడి కాయ రసంలో కాస్త తేనె చేర్చి తీసుకుంటే.. ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
  • చిగుళ్ల ఇన్‌ఫెక్షన్లు, రక్తం కారడం, పన్ను నొప్పి వంటివి దూరం కావాలంటే మామిడి ముక్కను నమలాలి. దాంతో బ్యాక్టీరియా, క్రిములూ నశిస్తాయి. దంతాలూ శుభ్రపడతాయి. పళ్ల మీద ఎనామిల్‌ కూడా దృఢంగా ఉంటుంది. నోటి దుర్వాసనలూ దూరమవుతాయి.

ఆధారము: ఈనాడు

2.94957983193
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు