హోమ్ / ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం / మొలకలు చేసే మేలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మొలకలు చేసే మేలు

మొలకలు ఆరోగ్యానికి చేసే మేలు క్రమంలో పెసలూ, బఠాణీలూ, సెనగ మొలకల్లో ఉండే పోషకాల గురించి తెలుసుకుందాం.

పెసలు

ఈ మొలకల్లో విటమిన్‌ సి, కె అధికంగా లభిస్తాయి. విటమిన్‌ సి జుట్టు ఎదుగుదలకు బాగా ఉపకరిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను దూరం చేసే గుణం వీటి సొంతం. పెసర పొట్టులో ఫొలేట్‌ అధికంగా ఉంటుంది. గర్భిణులకూ, గర్భస్థ శిశువుకు ఇదెంతో మేలు చేస్తుంది. గర్భిణులు ఇంట్లోనే మొలకెత్తించుకుని తీసుకోవడం మంచిది. పెసర మొలకల్ని సాధ్యమైనంత వరకూ ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవాలి. అలాని అతిగా మాత్రం తినకూడదు. గ్యాస్‌ సమస్య ఎదురుకావొచ్చు. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో ఇన్‌ఫెక్షన్లూ, బ్యాక్టీరియా దూరమవుతాయి.

బఠాణీలు

వీటిలో మేలు చేసే కార్బోహైడ్రేట్లుంటాయి. వ్యాయామానికి ముందు వీటిని తీసుకుంటే ఎంతో శక్తి అందుతుంది. ఈ మొలకల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఉదయం పూట వీటిని తినడం వల్ల ఎక్కువ సమయం వరకూ ఆకలి దరిచేరదు. కొన్ని తీసుకుంటేనే పొట్ట త్వరగా నిండిన భావన కలుగుతుంది. అలానే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. చెడు కొవ్వు నిల్వలు తగ్గిపోతాయి. అంతేకాదు బఠాణీ మొలకల్లో కొవ్వులూ, కొలొరీలూ చాలా తక్కువ. బరువు తగ్గాలనుకున్నవాళ్లు తీసుకున్నా ఇబ్బంది ఉండదు. వీటిలోని పోషకాలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి.

సెనగలు

ఈ మొలకల్లో మేలురకం కార్బోహైడ్రేట్లు ఎక్కువ. విటమిన్‌ బి6 పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకున్న వారికి సెనగ మొలకలు చక్కని ఆహారం. ఈ మొలకల్లో కొలెస్ట్రాల్‌ ఉండదు. చర్మ సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి. రకరకాల అలర్జీలతో బాధపడేవారు వీటిని తింటే ఉపశమనం పొందుతారు. మధుమేహం ఉన్నవారు తీసుకుంటే చక్కెర అదుపులో ఉంటుంది. సలాడ్‌, చాట్‌, సూప్‌.. ఇలా ఏదో ఒక రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

ఆధారము: ఈనాడు

3.06106870229
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు