অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

రాగి వంటకాలు

రాగి వంటకాలు

అల్పాహారం

రాగి ఇడ్లీ


కావలసిన పదార్థాలు
రాగి పిండి - 2 కప్పులు 
ఇడ్లీ రవ్వ - 1 కప్పు 
మినప పప్పు - 1/2 కప్పు 
మెంతులు - 2 టీ స్పూన్ 
ఉప్పు – తగినంత
విధానం: మినప పప్పును నాలుగైదు గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి ఉప్పు, రాగి పిండి, ఇడ్లీ రవ్వ కలిపి ఒక రాత్రి పులియబెట్టాలి. పిండిని మామూలు  కన్నా ఎక్కువ పలుచగా కలిపి ఇడ్లీ చేయవచ్చు. ఇవి బియ్యపు రవ్వ ఇడ్లీలాగే రుచిగా ఉంటుంది.

 

రాగి ఉప్మా



కావలసిన పదార్థాలు
రాగి పిండి - 1 కప్పు 
ఉల్లిపాయలు - 1  
ఆవాలు- 1/4 టీస్పూన్
మినప పప్పు - 1/4 టీస్పూన్  
శనగపప్పు -  1/2 టీస్పూన్
కారం - 2 టీ స్పూన్ 
కరివేపాకు - ఒక రెమ్మ 
ఉప్పు - తగినంత  
నూనె - 3 టీస్పూన్
విధానం: రాగి పిండిని ముందుగా ఒక ప్లేట్ లో వేసి దానికి 3 టీ స్పూన్ నీరు చేర్చి కొంచం ఉప్పు  వేసి బాగా కలపాలి. అది బాగా ముద్దగా అయ్యాక కుక్కరులో పెట్టి ఉడికించాలి. తర్వాత  దానిని మళ్ళీ గది ఉష్ణోగ్రతకు తీసుకురావాలి.  బాణలిలో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు, ఆవాలు, కరివేపాకు వేసి తాలింపు వేసుకొని అందులో ఉడకబెట్టిన రాగిపిండిని వేసి చివరగా తగినంత కారం వేస్తే సరిపోతుంది.

 

రాగి జావ



కావలసిన పదార్థాలు
రాగి పిండి  1/4 కప్పు 
ఉప్పు - తగినంత
నీరు - 1 కప్పు
మజ్జిగ - తగినంత 
నూనె
ఆవాలు
కరివేపాకు
కొత్తిమీర
పచ్చిమిరపకాయలు
విధానం: రాగి పిండిలో నీరు వేసి కలుపుకోవాలి. దీనిని పొయ్యి మీద పెట్టి రాగి జావలా అయ్యే వరకు వేడి చేయాలి. తర్వాత దించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో కడాయిలో నూనె కరివేపాకు ఆవాలు తాళింపు వేసుకోవాలి. దాన్ని కూడా పొయ్యి మీద నుంచి దించి చల్లార్చిన తర్వాత కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, రాగి జావ వేసి కలుపుకోవాలి.

 

రాగి దోసె



కావలసిన పదార్థాలు
ఉప్పుడు బియ్యం - 1 కప్పు
మినప పప్పు - 1/2 కప్పు
సగ్గుబియ్యం - 1/4 కప్పు 
రాగి పిండి - 1 కప్పు
మెంతులు - 1/4 టీ స్పూన్
ఉప్పు- తగినంత
నూనె – తగినంత
విధానం: ఉప్పుడుబియ్యం, సగ్గుబియ్యం కలిపి 4-5 గంటల వరకు నానబెట్టాలి. మినప పప్పు, మెంతులు కలిపి 3-4 గంటలు నానబెట్టాలి. నానబెట్టిన ఉప్పుడుబియ్యం, సగ్గుబియ్యం ను మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న మినప పప్పు, మెంతుల్ని కూడా మెత్తగా రుబ్బుకుని ఆ పిండిని ఒక గిన్నెలో వేసుకొని, దానిలోనే రాగి పిండి వేసి బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసి కలిపి మూత పెట్టాలి. పిండిని పులియబెట్టి, దోసెలు వేసుకొని కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.

 

రాగి సేమియా పాయసం



కావలసిన పదార్థాలు
రాగి వర్మిసెల్లి - 1 కప్పు
నీరు - 1 కప్పు
పాలు - 1/4 కప్పు 
చక్కెర - 1/2 కప్పు
కొబ్బరి పొడి - 2 టీ స్పూన్ 
జీడీపప్పు మరియు సుల్తానాలు
నెయ్యి - 2 టీ స్పూన్ 
యాలకుల పొడి - 1/2 టీ స్పూన్
విధానం: ఒక గిన్నె తీసుకొని జీడిపప్పు, సుల్తానాలను వేయించి  పక్కన పెట్టుకోవాలి.  వేరొక గిన్నె తీసుకొని అందులో రాగి వర్మిసెల్లి వేయించి  తర్వాత దానికి నీరు చేర్చి ఉడకబెట్టాలి. ఉడుకుతూ ఉండగా పాలు, చక్కెర, కొబ్బరి పొడి యాలకుల పొడి,  వేసి బాగా ఉడకనివ్వాలి. జీడిపప్పు, సుల్తానాలను కూడా వేసి దించుకోవాలి.

 

భోజనము

రాగి కిచిడి



కావలసిన పదార్థాలు
రాగి వర్మిసెల్లి : 200 గ్రా.
పెసలు - 50 గ్రా.
ఉల్లిపాయ - 1
టమాటో - 1
పచ్చిమిర్చి - 1
కొత్తిమీర 
ఆవాలు 
పసుపు
నూనె 
కరివేపాకు: 2 రెబ్బలు
ఉప్పు -  తగినంత
విధానం: పెసర్లలో కొద్దిగా పసుపుని వేసి ఉడకబెట్టాలి. తరిగిన టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, కొత్తిమీర, పసుపు, కరివేపాకు, నూనెలో వేసి తాళింపు చేసుకొని రాగి వర్మిసెల్లి కూడా కలిపి తగిన చిక్కదనం వచ్చేంతవరకు ఉడకబెట్టాలి.

 

రాగి సంకటి



కావలసిన పదార్థాలు
బియ్యం - 1 కప్పు
రాగి పిండి - 1/2 కప్పు
ఉప్పు తగినంత
విధానం: మందపాటి గిన్నెలో బియ్యం, నీరు 1:3 నిష్పత్తిలో వేసి కొంచెం ఉప్పు కలిపి ఉడకబెట్టాలి. ఉడుకుతూ ఉన్నప్పుడు నీటితో కలిపిన రాగి పిండిని వేసి, కలియబెట్టుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి.

 

రాగి ఓట్స్ బ్రెడ్



కావలసిన పదార్థాలు
మైదాపిండి - 1 కప్పు  
ఓట్ మీల్ - 1కప్పు
రాగిపిండి - 1 కప్పు 
ఈస్ట్ - 1 కప్పు
చక్కెర - 1 టీ స్పూన్
ఉప్పు - 1 టీ స్పూన్
ఆలివ్ నూనె - 3 టీ స్పూన్
వేడినీరు - 1 కప్పు
విధానం: ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో మైదాపిండి, ఓట్స్ మీల్, రాగిపిండి, చెక్కర, ఉప్పు ఈస్ట్ అన్ని వేసి ఒక మిశ్రమంలా కలిపి దానికి చిన్న, చిన్నగా వేడినీటిని జత చేసి పిండిలా చేసి పక్కన బెట్టి, ఒక టవల్ లేదా ఒక పెద్ద గిన్నెతో ఆ పిండిని మూసి ఉంచాలి. కొన్ని నిమిషాల తర్వాత ఆ పిండి ఉన్న దానికి రెట్టింపు అవుతుంది. ఈలోపు ఒక బ్రెడ్ ట్రే తీసుకొని దానికి కొంచెం ఆలివ్ ఆయిల్ రాసి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు రెట్టింపైన పిండిని ఆ ట్రేలో వేసి 350 డీగ్రీ వద్ద ఓవెన్ లో 35 నిమిషాలు ఉంచాలి. తీసి చల్లార్చి ముక్కలుగా చేసుకొని తినవచ్చు.

 

రాగి అంబలి



కావలసిన పదార్థాలు
రాగులు - 2 టీ స్పూన్
నీరు - 1 కప్పు
మజ్జిగ - 1/2 కప్పు 
ఉప్పు – తగినంత
విధానం: రాగి పిండికి 1/4 కప్పు నీరు కలిపి ఉడకబెట్టాలి. మిగిలిన 3/4 కప్పు నీటిలో ఉప్పు కలిపి కొంచెం సేపు ఆగిన తర్వాత కలిపి రాగి అంబలిలా అయ్యే వరకు వేడి చేసి దించి పక్కకు పెట్టుకోవాలి. చల్లార్చిన తర్వాత మజ్జిగ కలిపి తీసుకోవచ్చు.

 

స్నాక్స్

రాగితో తీపి బిస్కెట్లు



కావలసిన పదార్థాలు
రాగి పిండి - 1/2 కప్పు
మైదా పిండి - 1/2 కప్పు
చక్కెర పౌడర్ – 1/2 కప్పు
చల్లని వెన్న - 100 గ్రా. 
బేకింగ్ పౌడర్ - 1 టీ స్పూన్
వేనీలా ఎసెన్స్ - 1/2 టీ స్పూన్
పాలు - 2 టీ స్పూన్
విధానం: బిస్కెట్ ట్రే కి గ్రీస్ చేసి ప్రక్కన పెట్టుకోవాలి. ఓవెన్ ను  180 డీగ్రీల వద్ద 15 నిమిషాల ముందు ఆన్ చేసి ఉంచుకోవాలి. రాగి పిండిని కూడా వేయించి ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రాగి పిండిని, మైదా పిండిని, బేకింగ్ పౌడర్ ను జల్లెడ పట్టుకోవాలి. ఈ జల్లెడ పట్టుకున్న పిండిని, వెన్న చక్కెర కలిపి బాగా గిలకొట్టిన మిశ్రమానికి చేర్చి రొట్టె పిండిలా చేసుకోవాలి. బిస్కెట్ కట్టర్ తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా గ్రీస్ చేసుకొని పెట్టుకున్న ట్రేలో అమర్చుకొని 180 డీగ్రీల వద్ద 15 - 20 నిమిషాలు బేకింగ్ చేసుకోవాలి.

 

రాగితో స్పాంజ్ కేక్



కావలసిన పదార్థాలు
మైదా పిండి - 1/2 కప్పు
రాగి పిండి - 1/2 కప్పు
వెన్న - 1/4 కప్పు
చక్కెర - 3/4 కప్పు
గ్రుడ్లు - 2
వెనీలా ఎసెన్స్ - 1/4 టీ స్పూన్
బేకింగ్ పౌడర్ - 1 టీ స్పూన్
బేకింగ్ సోడా - 1/4 టీ స్పూన్
విధానం: ముందుగానే  ఓవెన్ ను 350 డీగ్రీల వద్ద ఆన్ చేసుకోవాలి. వెన్న, చక్కెర, పగలకొట్టిన గుడ్డు వేసి బాగా గిలకొట్టి ఒక మిశ్రమంలా చేసుకోవాలి. మైదా పిండి, రాగి పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాను ఆ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. అప్పుడు గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ ట్రేలో ఈ మిశ్రమాన్ని వేసి 40-45 నిమిషాలు బేక్ చేసుకోవాలి.

 

రాగి మురుకులు



కావలసిన పదార్థాలు
రాగి పిండి -1 కప్పు
బియ్యం పిండి  - 1 కప్పు 
శనగ పప్పు - 1/2 కప్పు 
వెన్న/నెయ్యి - 3 టీ స్పూన్
నువ్వులు - 1 టీ స్పూన్ 
కారం - 1 టీ స్పూన్
ఇంగువ - 1/4 టీ స్పూన్
ఉప్పు - తగినంత 
నూనె – వేయించు కోవడానికి
విధానం: శనగ పప్పును  అరకప్పు తీసుకొని మిక్సీలో వేసి పిండి చేసుకోవాలి. ఒక పెద్ద గిన్నె తీసుకొని రాగిపిండి, బియ్యం పిండి, శనగ పప్పు పౌడర్, వెన్న, నువ్వులు, కారం, ఇంగువ, ఉప్పు వీటి అన్నింటిని వేసి బాగా కలుపుకోవాలి. తగినంత  నీరు వేసి ఆ పిండిని కొంచెం వదులుగా చేసుకొని మురుకులు చేసే గొట్టంలో పిండిని వేసి మురుకులు వత్తి కాగిన నూనె లో వేయించాలి. మురుకులను దోరగ రెండు వైపుల కాలే అంతవరకు ఉంచి తీసేయాలి.

 

రాగి కుక్కిస్



కావలసిన పదార్థాలు
రాగి పిండి - 1 1/4 కప్పులు 
మైదా - 1 1/4 కప్పులు
చెక్కర - 1 కప్పు 
ఉప్పులేని వెన్న - 3/4 కప్పు
కరిగిన నెయ్యి - 1/4 కప్పు
బేకింగ్ పౌడర్ - 1/4 టీ స్పూన్ 
బేకింగ్ సోడా - 1/4 టీ స్పూన్
యాలకుల పొడి - 1/2 టీ స్పూన్ 
వెనీలా ఎసెన్స్ - 1/4 టీ స్పూన్
విధానం: రాగి పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కలిపి జెల్లడ పట్టుకోవాలి. ఎసెన్స్ ను, నెయ్యిని, వెన్నను బాగా కలపాలి. ఒవెన్ ను 170 డీగ్రీల వద్ద ముందుగానే ఆన్ చేసి పెట్టుకొని ఒక ట్రే తీసుకొని దానికి గ్రీస్ చేసుకోవాలి. తర్వాత రాగి పిండిని నెయ్యి, వెన్న, ఎసెన్స్ పిండి లాగా కలుపుకొని ఆ పిండి ముద్దగా చేసుకొని ట్రేలో పెట్టి ఒవెన్లో 20 నిమిషాలు బేక్ చేసుకోవాలి.

 

రాగి హల్వా



కావలసిన పదార్థాలు
రాగి పిండి - 35 గ్రా.
బెల్లం : 20 గ్రా.
వేరుశనగ - 25 గ్రా.
పండిన బొప్పాయ కాయ : 15 గ్రా.
నీరు - 50 మీ.లీ
విధానం: వేరుశనగలను వేయించి పై పొట్టు తీసి మెత్తగా నూరుకోవాలి. రాగిపిండిని కూడా వేయించుకోవాలి. బెల్లంలో నీరు కలిపి ఉడకబెట్టి ఒక సిరప్ లాగా చేసుకోవాలి. వేయించిన రాగిపిండిని, వేరుశనగ పిండిని, బొప్పాయ కాయ గుజ్జు ఆ సిరప్ లో వేసి కొంచెం సేపు ఉడకబెట్టి దించి వడ్డించుకోవాలి.

 

రాగి మఫిన్లు



కావలసిన పదార్థాలు
రాగి పిండి - 1 కప్పు 
చక్కెర - 1 కప్పు
బేకింగ్ పౌడర్ - 1 టీ స్పూన్ 
బేకింగ్ సోడా - 1/2 టీ స్పూన్
యోగార్ట్ - 1/2 కప్పు 
నూనె - 1/2 కప్పు
పాలు - 1/4 కప్పు
చాకొలేట్ - 1/2 కప్పు
విధానం: రాగి పిండి, చక్కెర, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాను ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి. దానికి యోగార్ట్ ను జత చేయాలి. తర్వాత నూనె, పాలు వేసి బాగా కలపాలి. తర్వాత చాకోలేట్ చిప్స్ ను వేసి మళ్ళీ కలపాలి. కేక్ టిన్ లో ఈ మిశ్రమాన్ని వేసి 180 డీగ్రీల వద్ద 15-20 నిమిషాలు బేక్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత వడ్డించుకోవచ్చు.

 

రాగి పిండితో ఓట్స్ లడ్డు



కావలసిన పదార్థాలు
రాగిపిండి  - 1 1/4 కప్పు 
ఓట్స్ - 1కప్పు
నెయ్యి - 2 టీ స్పూన్
చక్కెర - 2 టీ స్పూన్ 
తేనె – కొంచెం
విధానం: ఓట్స్ ఎండబెట్టి, 5 నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నె తీసుకొని కొంచెం నెయ్యి వేసి రాగి పిండి వేయించుకోవాలి. వేయించిన ఓట్స్ ను పౌడర్ లా చేసుకోవాలి. రాగి పిండిని ఓట్స్ పౌడర్ ను చక్కెర పౌడర్ ను ఒక గిన్నె లో వేసి బాగా కలుపుకొని తేనెతో వాటిని బాల్స్ లా గుండ్రంగా లడ్డూల్లా చేసుకోవాలి.

 

రాగి పకోడి



కావలసిన పదార్థాలు
రాగి పిండి - 2 కప్పులు 
బియ్యం పిండి - 1 కప్పు 
ఉల్లిపాయ - 1 
పచ్చిమిరపకాయలు - 4 
అల్లం - చిన్నముక్క
వేరుశనగ - 2 టీ స్పూన్
ఉప్పు - తగినంత
కరివేపాకు -  రెండు రెమ్మలు
నూనె -  డీప్ ఫ్రి చేసుకోవడానికి
విధానం: ముందుగా ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలను తరిగి పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో రాగి పిండి, బియ్యం పిండి, తరిగిన ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలను, కరివేపాకును బాగా కలుపుకోవాలి. 2 టీ స్పూన్ ల నూనె వేడి చేసి ఈ పిండిలో వేసి స్పూన్ తో బాగా కలపాలి. తగినంత నీరు కలిపి వదులుగా పిండిని పకోడీలు వేసుకునే విధంగా కలుపుకోవాలి. తర్వాత నూనె ను బాగా కాగ బెట్టి అందులో ఈ పిండితో పకోడీలాగా వేసి బాగా ఫ్రై  అయ్యాక దించుకోవాలి.

 

రాగి కేక్



కావలసిన పదార్థాలు
గ్రుడ్లు - 3
రాగిపిండి - 3 టీ స్పూన్
మైదా - 1 కప్పు
చక్కెర - 1 కప్పు
వెన్న - 120 గ్రా.
బేకింగ్ పౌడర్ - 1.5 టీ స్పూన్
నిమ్మరసం - 1 టీ స్పూన్ 
వెనీలాఎసెన్స్ -  1/2 టీ స్పూన్ 
ఉప్పు - తగినంత
విధానం: రాగిపిండిని, మైదా పిండిని, బేకింగ్ పౌడర్ ను జల్లెడ పట్టుకోవాలి. గ్రుడ్డులోని పసుపు సొనను వేరు చేసి బాగా గిలకొట్టాలి. ఒక గిన్నె తీసుకొని వెన్న, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. దానికి బీట్ చేసి పెట్టుకున్న గ్రుడ్డు సొనను చేర్చి, ఉప్పు, నిమ్మరసం, ఎసెన్స్ కూడా కలపాలి. ఈ మిశ్రమానికి రాగిపిండిని, మైదా పిండిని బేకింగ్ పౌడర్ ను వేసి బాగా కలిపి మిశ్రమంలా  చేసుకోవాలి. తర్వాత ఒక ట్రేలో వేసి 325 డీగ్రీల వద్ద 30-45 నిమిషాలు బేక్ చేసుకోవాలి.

 

రాగి లడ్డు



కావలసిన పదార్థాలు
రాగి పిండి - 50 గ్రా 
బెల్లం : 50 గ్రా
వేరుశనగలు -15 గ్రా
నూనె - 5 మీ.లీ
విధానం: రాగి పిండిని 20 నిమిషాల పాటు కుక్కర్ లో ఉడకబెట్టాలి. వేరుశనగలను వేయించి పై పొట్టు తీసి గ్రైండ్ చేసుకోవాలి. బెల్లాన్ని తీగ పాకం వచ్చేలా చేసుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన రాగి పిండిని, వేరుశనగ పిండిని, నూనె కలిపి బెల్లం పాకంలో వేసి లడ్డులాగా చేసుకోవాలి.

 

రాగి పెసలు మిక్స్



కావలసిన పదార్థాలు
రాగి - 65 గ్రా 
పెసలు - 30 గ్రా 
వేరుశనగలు - 15 గ్రా
విధానం: రాగిని, పెసలును, వేరుశనగలను వేరు వేరుగా వేయించుకొని, వేరు వేరుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మూడు పౌడర్ లను ఒక మిశ్రమంలా కలుపుకొని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

 

రాగి అడాయ్



కావలసిన పదార్థాలు
రాగి పిండి - 1 కప్పు
బెల్లం - 1/2 కప్పు
కొబ్బరిపొడి - 1/2 కప్పు
యాలకుల పొడి - 1/2 టీ స్పూన్ 
సుల్తానాలు - గుప్పెడు 
నెయ్యి - 4 నుండి 5 టీ స్పూన్

 

విధానం: బెల్లం తీసుకొని ఒక గిన్నెలో వేసి నీరు కలిపి పాకం వచ్చే వరకు వేడి చేయాలి. తర్వాత ఆ పాకంలో రాగి పిండి వేసి బాగా కలపాలి. కొంచెం సేపటి తర్వాత దానికి కొబ్బరి పొడి, యాలకుల పొడి, సుల్తానాలు వేసి కలపాలి. లడ్డూల్లా చుట్టుకొని గుండ్రని ఆకారంలో వత్తుకొని కొంచెం నూనె వేసి పెనంపై కాల్చుకోవాలి.

రాగి బూరెలు



కావలసిన పదార్థాలు
రాగిపిండి - 1/2 కప్పు 
డాల్డా - 1 టీ స్పూన్ 
నూనె - డీప్ ఫ్రై చేసుకోవడానికి 
నువ్వులు - 1/2 కప్పు
కొబ్బరిపొడి - 1కప్పు
బెల్లం - 1 కప్పు
విధానం: 1/2 కప్పు నువ్వులు తీసుకుని వేయించుకోవాలి. 1 కప్పు బెల్లంలో కొంచెం నీరు వేసి మరిగించాలి. బెల్లం పాకానికి ఒక కప్పు కొబ్బరిపొడి, 1 కప్పు డాల్డా వేసి ఉడకబెట్టాలి. ఇప్పుడు నువ్వులు, రాగిపిండిని ఒక మిశ్రమంలా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో పైన చేసినది కలిపి బూరెల్లా చేసుకొని నూనెలో వేయించుకోవాలి.

ఆధారం:

కుమారి ఐ. ప్రసన్న, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్. 2012/010.

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate