హోమ్ / ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం / హెల్దీ ఆయిల్‌ రైస్‌ బ్రాన్‌
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

హెల్దీ ఆయిల్‌ రైస్‌ బ్రాన్‌

హై టెంపరేచర్‌ను తట్టుకునే గుణం ఉండటంతో డీప్‌ ఫ్రైలకు అనువైన నూనెగా రైస్‌బ్రాన్‌కు పేరొచ్చింది.

వంటనూనె అనగానే ఈమధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘రైస్‌ బ్రాన్‌’. హై టెంపరేచర్‌ను తట్టుకునే గుణం ఉండటంతో డీప్‌ ఫ్రైలకు అనువైన నూనెగా రైస్‌బ్రాన్‌కు పేరొచ్చింది. దీనితో వెజిటబుల్‌ ఘీ కూడా తయారుచేస్తారు. ఇన్ని ఉపయోగాలున్న రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ను వంట నూనెగా ఉపయోగిస్తే చేకూరే లాభాలు, ఉపయోగించే పద్ధతులు.. ఇవే!

న్యూట్రిషనల్‌ ప్రాపర్టీస్‌

రైస్‌బ్రాన్‌ - 100గ్రా, కెలోరీలు - 800గ్రా, శాచురేటెడ్‌ ఫ్యాట్‌ - 20గ్రా, పాలీశాచురేటెడ్‌ ఫ్యాట్‌ - 35గ్రా, మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్‌ - 39గ్రా, కొలెస్ట్రాల్‌, సోడియం - 0శాతం, కార్బొహైడ్రేట్స్‌, విటమిన్లు, మినరల్స్‌ - 0శాతం

రైస్‌ బ్రాన్‌ అంటే?

బియ్యం పొట్టు నుంచి ఈ నూనెను తీస్తారు కాబట్టి దీనికి రైస్‌ బ్రాన్‌ అని పేరు. 232 డిగ్రీల వరకూ వేడిని తట్టుకోగలదు. అందుకే దీనిని స్టిర్‌ ఫ్రై, డీప్‌ ఫ్రైకి ఉపయోగిస్తారు. బంగ్లాదేశ్‌, ఇండియా, జపాన్‌, చైనాతో పాటు కొన్ని ఆసియా దేశాల్లో ఈ నూనెను విరివిగా ఉపయోగిస్తారు.

ఆరోగ్యపరమైన లాభాలు

రైస్‌బ్రాన్‌ నూనె ఇంత త్వరగా ప్రాచుర్యం పొందటానికి కారణం ఈ నూనెలో ఆరోగ్యపరమైన పోషకాలుండటమే! ఈ నూనె వాడటం వల్ల కొన్ని వ్యాధులు, అనారోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి.

మెనోపాజ్‌కు చేరువైన మహిళలు ఒంట్లో వేడి ఆవిర్లతో బాధపడుతూ ఉంటారు. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే వంటల్లో రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ వాడాలి. ఈ నూనెను వాడిన 90ు మంది మహిళలు మెనోపాజ్‌ లక్షణాల నుంచి ఉపశమనం పొందినట్టు పరిశోధనల్లో తేలింది.

 • రైస్‌బ్రాన్‌ కొలెస్ట్రాల్‌ లెవెల్‌ను తగ్గిస్తుంది. మొత్తం కొలెస్ట్రాల్‌ లెవెల్‌ను 42శాతం, ఎల్‌డిఎల్‌ కొలెస్ట్రాల్‌ లెవెల్‌ను 62శాతం తగ్గించినట్టు జంతువుల మీద జరిపిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
 • కణ విచ్ఛిత్తిని నియంత్రించే టోకోఫిరాల్స్‌, టోకోట్రైనాల్స్‌ ఈ నూనెలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ నూనె వాడితే క్యాన్సర్‌ దరి చేరదు.
 • దీన్లోని ఆరిజనాల్‌ అనే కాంపౌండ్‌ రక్తంలో కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ను అదుపులో ఉంచటం ద్వారా రక్తం గడ్డకుండా నియంత్రిస్తుంది. ఫలితంగా హృద్రోగ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
 • దీన్లోని స్వ్కాలీన్‌ అనే కాంపౌండ్‌ న్యాచురల్‌ మాయిశ్చరైజర్‌లా పనిచేసి చర్మంమీద ముడతలు ఏర్పడకుండా రక్షణ కల్పిస్తుంది. అలాగే సన్‌ డ్యామేజీ నుంచి చర్మాన్ని కాపాడుతుంది.
 • దీన్లోని అత్యధిక యాంటీఆక్సిడెంట్‌ కంటెంట్‌ శరీరానికి ఫ్రీర్యాడికల్స్‌తో పోరాడే శక్తినివ్వటం ద్వారా రోగనిరోధకశక్తిని బలపరుస్తుంది. అలాగే ఈ నూనెలోని విటమిన్‌ఇ ఎండోక్రైన్‌ గ్రంథుల పనితీరును నియంత్రించి హార్మోను స్రావాల్ని క్రమబద్ధం చేస్తుంది.

వంటల్లో ఇలా ఉపయోగించాలి

 • చిప్స్‌, బజ్జీలు, పకోడీలాంటి డీప్‌ ఫ్రైలకు ఉపయోగించొచ్చు.
 • కూరగాయలను ఉపయోగించి చేసే స్టిర్‌ ఫ్రైలకు ఈ నూనే అనువైనది.
 • బార్బిక్యూ, బేకింగ్‌, రోస్టింగ్‌లకు కూడా ఈ నూనెను ఉపయోగించొచ్చు.
 • నూనె వాసన, రంగు మారితే నూనెను పారేయటం మంచిది.
 • ఈ నూనెను సూర్యరశ్మి తగలకుండా షెల్ఫ్‌లో నిల్వ చేయాలి.

 

ఆధారము: ఆంధ్రజ్యోతి

3.04958677686
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు