హోమ్ / ఆరోగ్యం / పారిశుధ్యం మరియు పరిశుభ్రత / ఇంటి వాతావరణం ఆరోగ్యకరంగా ఉంచుకుందాం.
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఇంటి వాతావరణం ఆరోగ్యకరంగా ఉంచుకుందాం.

వంటచెరకు, బొగ్గు మొదలైన ఇంధనాలను చాలా ఇండ్లలో వంటకోసం వినియోగిస్తున్నారు. వంటచేసే ప్రదేశం, గది ఇరుకుగా ఉండటం లేక గాలి బయటకు వెళ్ళే అవకాశం లేకపోవటం వల్ల పొగ ఒక చోటే ఉండిపోతుంది. ఇది కంటికి, ఊపిరితిత్తులకు ఎంతో ప్రమాదకరం.

లక్ష్యం

  1. ఆరోగ్యంపై ఇండ్లలోని గాలికాలుష్యం ప్రభావం గురించి తెలుసుకుందాం.
  2. ఈ సమస్యలను పరిష్కరించే పద్ధతులను గుర్తిద్దాం.

నేపథ్యం

వంటచెరకు, బొగ్గు మొదలైన ఇంధనాలను చాలా ఇండ్లలో వంటకోసం వినియోగిస్తున్నారు. వంటచేసే ప్రదేశం, గది ఇరుకుగా ఉండటం లేక గాలి బయటకు వెళ్ళే అవకాశం లేకపోవటం వల్ల పొగ ఒక చోటే ఉండిపోతుంది. ఇది కంటికి, ఊపిరితిత్తులకు ఎంతో ప్రమాదకరం.

పద్ధతి

1.మీ పరిసరాల్లోని ఇండ్లు, టీస్టాల్, ఆహార పదార్ధాలు అమ్మే తోపుడు బండ్లు గురించి కింది అంశాలపై సర్వే నిర్వహించండి.

ఎ) వంటకు ఏ రకమైన ఇంధనం వాడుతున్నారు?

బి) ఎవరైనా పొగరాని పొయ్యిలను వాడుతున్నారా?

సి) అక్కడి నివాసితులను, వినియోగదారులను కలిసి వారు ఏదైనా అసౌకర్యానికి గురవుతున్నారా తెలుసుకోండి. వారిలో ఎంతమంది దగ్గు, జలుబు, ఆస్థమా, ఇతర వ్యాధులతో బాధపతున్నారో తెలుసుకోండి.

2. మీ ఊరిలో ఎవరివైనా ఐదు ఇళ్లను పరిశీలించండి. అక్కడి వాతావరణం ఏలా ఉంది? ఆరోగ్యకరంగా

ఉంచడానికి వారికి మీరిచ్చే సూచనలేమిటి?

ముగింపు

మనం ఉన్న పరిసరాలు మన ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఇంటిలో, కార్యాలయాలలో ఈగలు, దోమలు, ఎలుకలు, బొద్దింకల వంటివి లేకుండా చూసుకోవాలి. ఇల్లు ధారాళంగా గాలి, వెలుతురు వచ్చేదిగా ఉండాలి. అందువల్ల కరెంటు వృథాను అరికట్టవచ్చు. పెరటిలో రకరకాల మొక్కలను పెంచినట్లయితే వాడిన నీరు మొక్కలకు మళ్ళించి మురికి నీరుగా మారకుండా కాపాడవచ్చు. సాధారణంగా మనం ఇంటిలో చెత్తనంతా ఊడ్చి వీధిలో పోస్తాం. వాటి వెంబడే మలమూత్ర విసర్జన చేస్తాం. ఇల్లు శుభ్రంగా ఉండడమంటే వీధి కూడా శుభ్రంగా ఉండడమని అర్థం. మొక్కలు లేకుండా ఇల్లు ఉండదు అని అనిపించేలా మీ వీధి ఉండాలంటే మీ వీధి వారంతా కలిసి వీధిని చక్కని పార్ములా ఎలా తీర్చి దిద్దవచ్చునో  ప్రయత్నించండి. పరిశుభ్రంగా ఉండే ప్రదేశాన్ని చూస్తూ ఎవరూ చెత్తవేయడానికి ఇష్టపడరుకదా!

మీ పరిశోధన ఆధారంగా నివేదిక రూపొందించండి.

తదుపరి చర్యలు

  1. మీ పరిసరాలలో సరైన గాలి, వెలుతురు వచ్చేలా ఇంటి నిర్మాణం ఉండాలని, పొగరాని పొయ్యిలను వాడాలని ప్రచారం చేయండి.
  2. మన ఇంటిలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలంటే కుటుంబసభ్యులందరూ బాధ్యతగా ఉండాలనుకున్నప్పుడు నీవు ఏఏ బాధ్యతలు నిర్వహించాలనుకుంటావు ?
  3. మొక్కలు, నీరు ఇవి రెండు ఇంటి పరిసరాలను ఆరోగ్య కరంగా మారుస్తాయి అంటారు కదా ఈ రెండింటి నిర్వహణ కోసం మీరు ఏమి చేస్తారు?

ఆధారము: http://apscert.gov.in/

2.90410958904
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు