పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఇంట్లో తయారయ్యే చెత్త

జీవవిచ్చిత్తి అయ్యే పదార్థాలు, విచ్చిత్తి కాని పదార్థాల మధ్య తేడాలు గుర్తిద్దాం. 2. గృహసంబంధ వ్యర్థాలను సరైన రీతిలో (విచ్చిత్తి చేయగల లేదా చేయలేని పదార్థాలను) వేరుచేయాల్సిన అవసరాన్ని అర్ధంచేసుకుందాం.

లక్ష్యం

 1. జీవవిచ్చిత్తి అయ్యే పదార్థాలు, విచ్చిత్తి కాని పదార్థాల మధ్య తేడాలు గుర్తిద్దాం.
 2. గృహసంబంధ వ్యర్థాలను సరైన రీతిలో (విచ్చిత్తి చేయగల లేదా చేయలేని పదార్థాలను) వేరుచేయాల్సిన అవసరాన్ని అర్ధంచేసుకుందాం.

నేపథ్యం

వివిధ జీవప్రక్రియల ద్వారా విచ్చిన్నమయ్యే పదార్థాలను జీవవిచ్చిత్తి అయ్యే పదార్థాలు అంటారు. అదే క్రమంలో విచ్చిన్నం కాలేని పదార్ధాలను జీవ విచ్చిన్నం కాని పదార్దాలు అంటారు. జీవవిచ్చిన్నం కాని పదార్ధాలు జడపదార్ధాలుగా ఎక్కువ కాలం పర్యావరణంలో ఉండిపోతాయి. అభివృద్ధి వేగం కారణంగా పెద్ద పరిమాణంలో జీవ విచ్చిత్తి కాని పదార్ధాల ఉత్పత్తి క్రమంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో వివిధ పౌరసంస్థలు, పురపాలక సంఘాలు ఇప్పటికే జీవ విచ్చిత్తి కానివి, అయ్యే వస్తువులు, పదార్థాలను వేరుపరిచే కార్యక్రమం ప్రారంభించాయి. అలా మొదట్లోనే  వాటిని సురక్షితంగా వేరుచేయటం ద్వారా సులభంగా వీటిని తొలగించడానికి అవకాశం ఉంది. ఇంట్లో వీటిని వేరుచేయటం అనేది సాధారణంగా అలవాటు ఉండదు. ఈ వ్యర్ధాలు విషతుల్యాలుగా మారి నేలను, నీటి వనరులను కలుషితం చేసాయి. ఇటువంటి చెత్త ఎంత పరిమాణంలో తయారవుతుందో ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ ఇవి పర్యావరణంపై చూపే ప్రతికూల ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయలేం.

పద్ధతి

 1. మీ ఇంట్లోని చెత్త పదార్థాలను సేకరించి జాబితా తయారుచేయండి. వంటగదిలో తయారయ్యే వ్యర్థపదారాలు, పాడైపోయిన ఆహారం, మందు సీసాలు, మందు పట్టీలు, కాయకూరల తొక్కలు, ఉపయోగించిన టీపొడి, పాలపాకెట్లు, ఖాళీ అట్టపెట్టెలు, చెత్తకాగితాలు, ఖాళీ మందు సీసాలు, మందు పట్టీలు, సీసా మూతలు, చినిగిన గుడ్డలు, తెగిన చెప్పలువంటివి.
 2. ఒక బకెట్ లేదా చిన్న గుంటను తొవ్వి అందులో సేకరించిన వస్తువులను వేసి కనీసం 15 సెం.మీ. మందం మట్టితో పూడ్చండి.
 3. తడి ఆరకుండా 15 రోజులపాటు వస్తువులను అలాగే వుంచి పరిశీలించండి. .
 4. బకెట్ లేదా గుంతలో ఉంచిన వస్తువులలో ఎటువంటి మార్పు లేని వస్తువులను గుర్తించండి.
 5. బకెట్ లేదా గుంతలో ఉంచిన వస్తువులలో ఆకృతి, స్థితి మారిన వస్తువులను గుర్తించండి.

ముగింపు

ఇంటిలో ప్రధానంగా చెత్త ఎక్కువగా ఎక్కడ ఉత్పత్తి అవుతుందో గుర్తించాలి. వంటిల్ల చెత్త ఉత్పత్తికి ప్రధాన కేంద్రం. పెరటి తోటలో రాలిన ఆకులు, రాసిపారేసిన కాగితాలు, పెన్నులు, షాంపు కవర్లు, పాలిథిన్ సంచులు ఇలా ఎంతో చెత్త రోజూ ఉత్పత్తి అవుతుంది. ఈ చెత్తను చెత్తబుట్టల్లో వేయడం ఒక మంచి అలవాటు. అయితే తడి చెత్తను పొడిచెత్తను వేరువేరుగా చేసి వేయడం మనం నేర్పాల్సిన పద్ధతి. దీనివల్ల రీసైకిల్ చేయడానికి చెత్తను సులభంగా వేరు చేయగలుగుతాం.

చెత్తను సృష్టించడమంటే పర్యావరణానికి హానిచేయడమే. కాబట్టి వీలైనంత తక్కువ చెత్త వచ్చేలా మన అలవాట్లు మార్చుకోవాలి. వాడిపారేసే వస్తువుల స్థానంలో స్టీలు పాత్రలు వాడాలి. మిగులు చెత్తను కంపోస్ట్ ఎరువు తయారీకీ, బయోగ్యాస్ ఉత్పత్తికి వాడడం అవసరం. లేకపోతే ఈ చెత్త మరుగు నీటితో కలిసి కుళ్ళిపోయి పరిసరాలను దుర్గంధం చేస్తుంది. మీ ఇంట్లో చెత్త ఉత్పత్తి కాకుండా తగ్గించడానికి ఏ ఏ చర్యలు పాటించవచ్చో ఆలోచించండి.

మీ అధ్యయనం ఆధారంగా నివేదిక రూపొందించండి.

తదుపరి చర్యలు

 1. మీ ఇంట్లో తయారయ్యే చెత్త వినియోగించి ఇంటి తోటకు కావలసిన ఎరువును తయారుచేయండి.
 2. అంతర్జాలం ఉపయోగించి పర్యావరణంలో వివిధ పదార్థాలు ఎంతకాలం జీవ విచ్చిత్తి కాకుండా ఉంటాయో తెలుసుకోండి.
 3. ఇటీవలి కాలంలో వస్తున్న విచ్చిత్తి చెందే ప్లాస్టిక్తో తయారైన వస్తువులను గుర్తించండి. వాటి వల్ల పర్యావరణానికి ఏదైనా ప్రమాదం ఉందా అనేది గుర్తించండి.
 4. మీ పరిసరాలలో జీవ విచ్చిత్తి అయ్యేవి, కానివి వేరు చేయడానికి వేరు వేరు చెత్తకుండీలను ఏర్పాటుచేశారేమో తెలుసుకోండి. లేనియెడల సంబంధిత అధికారులను కలిసి వాటిని ఏర్పాటుచేయాలని సూచించండి.
 5. మీ ఇంటిలో, పాఠశాలలో చెత్త ఉత్పత్తి అయ్యే సంధర్భాలు ఏమిటి? వాటిని తగ్గించడానికి మీరు ఏమి చేయాలనుకుంటున్నారు?

 

ఆధారము: http://apscert.gov.in/

3.03614457831
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు