పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

చుట్టూ నీరు అయినా దాహం

మానవ జీవనానికి ఋతుపవనాలకు గల సంబంధాన్ని అవగాహన చేసుకుందాం.

లక్ష్యం

మానవ జీవనానికి ఋతుపవనాలకు గల సంబంధాన్ని అవగాహన చేసుకుందాం.

నేపథ్యం

మానవ మనుగడకు నీరు అత్యవసరం. నీటి వనరులు క్రమంగా కనుమరుగు కావటం జీవజాలానికి  పెనుముప్ప. ప్రపంచ వ్యాప్తంగా నీటి వనరుల సంరక్షణ ప్రాధాన్యత పై చర్చ జరుగుతున్నది. అటవీ ప్రాంతాలలో మానవ కార్యకలాపాలు పెరగటం, వూళిక సదుపాయాల ప్రభావం వల్ల సమతుల్యం దెబ్బ తినటంతోపాటు వరాలు కువరటంలోనూ క్రమం తప్పింది. కొన్ని ప్రాంతాల్లో వరాకాలంలో అధిక వర్నపాతం వల్ల ప్రజల సాధారణ జీవనం స్తంభించడంతోపాటు, పశువులు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 2006 సంవత్సరంలో థార్ ఎడారిలో అసాధారణ వర్షం కురవడం వలన పెద్ద మొత్తంలో ప్రాణ, ఆస్టి నష్టాలు జరిగాయి.

పద్ధతి

  1. మీ పెద్దవారిని గాని, వాతావరణ శాఖ కార్యాలయాన్ని గాని సంప్రదించి గత పది సంవత్సరాలలో కురిసిన వర్షపాత వివరాలను సేకరించండి.
  2. గతంలో ఎప్పుడైనా వరదలు, కరువు సంభవించాయేమో కనుక్కోండి.
  3. వాటి ప్రభావం ప్రజల జీవితాలపై ఎలా వుంటుందో కనుక్కోండి.
  4. ఒక సంవత్సరంలో అధిక, అల్ప వర్నాలు కురవడానికి గల కారణాలను విశ్లేషించండి.

ముగింపు

కరువులు, వరదలు మొదలైనవన్నీ మానవ తప్పిదాల వల్ల కలుగుతున్నాయి. కాలువలు, చెరువులు, ఆక్రమణలకు గురికావడం వల్ల, నదీ ప్రవాహలు దారిమళ్ళి వరదలకు కారణమవుతున్నాయి. విచక్షణా రహితంగా చెట్లు నరికి వేయడం, వర్షపునీటిని నేలలోకి ఇంకేలా చేయడానికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల వరాలు తగ్గి కరువుకాటకాలు ఎక్కువవుతున్నాయి. మనకున్న పాలన వ్యవస్థల మధ్య సమన్వయలోపాలు పర్యావరణానికి తీవ్రవిఘాతం కలిగిస్తున్నాయి. ఒకవైపు చెట్లు పెంచుతాం మరోవైపు కరెంటు తీగలకు అడొస్తున్నాయని వాటిని నరికివేస్తాం. రోడ్లు విస్తరించాల్సి వస్తోందని ఎన్నో ఏళ్ళనాటి వృక్షాలను కూలగొట్టి వాటి బదులుగా గన్నేరు మొక్కలో, కాగితాలపూల మొక్కలనో పెంచి సరిపెట్టుకుంటాం. ఈ మధ్యకాలంలో పెద్దపెద్ద వృక్షాలను సైతం వేళ్ళతో పెకలించి మరొకచోట నాటే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం వల్ల ప్రస్తుతం చెట్లను రక్షించుకోగలుగుతున్నాం. కానీ ఇది ఇంకా ప్రాచుర్యంలోకి రావలసిన అవసరం ఉంది. అన్నిరకాల పర్యావరణ సమస్యలకు ఏకైక పరిష్కారం చెట్లను పెంచడమే.

మీ అధ్యయనం ఆధారంగా చిత్రాలను పొందుపరుసూ నివేదిక రాయండి.

తదుపరి చర్యలు

  1. పట్టణాలు, నగరాలలో వరదలకు కారణాలు గుర్తించి వాటిని నివారించడానికి సూచనలు చేయండి.
  2. నదులు, కాలువలు అందుబాటులో ఉన్నప్పటికీ తాగడానికి నీరు లేకపోవడానికి కారణాలు ఏమిటని మీరు భావిస్తున్నారు.

 

ఆధారము: http://apscert.gov.in/

 

3.08219178082
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు