హోమ్ / ఆరోగ్యం / పారిశుధ్యం మరియు పరిశుభ్రత / చెత్తను సేకరించే వారి దుస్థితి
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

చెత్తను సేకరించే వారి దుస్థితి

చెత్త సేకరించే వారి ఆరోగ్యం పట్ల అవగాహనను కలిగింయుండడం.

లక్ష్యం

చెత్త సేకరించే వారి ఆరోగ్యం పట్ల అవగాహనను కలిగింయుండడం.

నేపథ్యం

గ్రామీణ, పట్టణ ప్రాంత పర్యావరణ సమస్యలలో ముఖ్యమైనది. చెత్తను విచక్షణారహితంగా వేయడం. ఇండ్లు, పాఠశాలలు, అంగళ్ళలో తయారైన వ్యర్థ పదార్ధాలు లేదా చెత్తను కుండీల ద్వారా సేకరించి పురపాలక సంఘాలు సంబంధిత చెత్త నిలువ చేసే ప్రదేశాలలోకి చేరుస్తాయి. చెత్త నిలువ చేసే ప్రదేశాలు చెత్తతో పూర్తిగా నిండిపోయి ఈగలు, దోమలు, బొద్దింకలు బాగా పెరిగి వ్యాధులను వ్యాప్తి చేస్తుంటాయి. చెత్తను సేకరించే వారు చెత్తకుండీల దగ్గర సేకరిస్తున్న సమయంలో రకరకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. తరచుగా వారు విరిగిపోయిన గాజుపెంకులు లేక విస్పోటక పదార్థాల వల్ల గాయాలబారిన పడుతూ ఉంటారు.

పద్ధతి

1. రహదారులు పక్కన చెత్తను సేకరించేవారిని ఇంటర్వ్యూ చేయండి.

2. కింది అంశాలపై సర్వే నిర్వహించి కింది విషయాలను తెలుసుకోండి.

ఎ) పేరు, వయస్సు

బి) ప్రతి రోజు ఎంత దూరం తిరిగి చెత్త సేకరిస్తారు.

సి) రోజులో చెత్త సేకరించడానికి ఎంత సమయం వెచ్చిస్తారు.

డి) ఎన్ని రకాల చెత్తను సేకరిస్తారు?

ఇ) చెత్త సేకరించే సమయంలో చేతికి కాళ్ళకు

సాక్స్ వేసుకోవటం, మాస్క్లు పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారా?

ఎఫ్) చెత్త సేకరించే సమయంలో ఎదుర్కొనే సమస్యలు ఏమిటి?

జి) సేకరించిన చెత్తను ఏం చేస్తారు?

హెచ్) ఏదైనా సమస్యలు / అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారా?

ఐ) అనారోగ్యానికి గురైనప్పుడు వైద్యుడి దగ్గరకి వెళతారా? వెళ్ళకపోతే కారణాలు తెలుసుకోండి?

ముగింపు

చెత్త పేరుకు పోకుండా మన పరిసరాలను చెత్త సేకరించేవారు నిత్యం శుభ్రం చేసూ ఉంటారు కదా! వారు కొంతకాలం చెత్త శుభ్రం చేయకపోతే ఏమవుతుందో ఆలోచించండి. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేవారు, చెత్తను సేకరించేవారు తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి మనకు సేవ చేస్తారు. వీరికి మనవంతు సాయం చేయడం మన కర్తవ్యం. వారికి అవసరమైన సాక్సులు, గేజులు అందించడంతోబాటు వారు సేకరించే విధంగా అంటే తడి, పొడి, రీసైకిల్ చేయడానికి వీలైనవి, ఇతరాలు విభజించి ఉంచితే వారికి అనువుగా ఉంటుంది.

మీ అధ్యయనం ఆధారంగా చెత్తను సేకరించే వారు ఏ ఏ వ్యర్ధాలను సేకరిస్తున్నారు, వారి ఆరోగ్యపరిస్థితిపై ఒక నివేదిక రూపొందించండి.

తదుపరి చర్యలు

  • స్థానిక అంగళ్ళలో సరైన విధంగా చెత్తను తొలగించేలా చర్యలు మొదలుపెట్టడానికి సూచనలు చేయండి.
  • చెత్త సేకరించే వారికి మీరు వాడని బూట్లు, సాక్స్లు, మాస్క్లు మొదలైనవి అందజేసి సహాయం చేయండి.
  • చెత్త సేకరించే వారు సమాజానికి చేస్తున్న సేవను మీరు ఏలా గౌరవిస్తారు.? వారిపట్ల మీ భావాలను వ్యక్తం చేయడానికి ఏఏ పనులు చేస్తారు.
  • అన్ని వృత్తులు, పనులు ప్రధానమైనవే విలువైనవే అని మీరు అంగీకరిస్తారా? ఎందుకు?

ఆధారము: http://apscert.gov.in/

2.96052631579
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు