హోమ్ / ఆరోగ్యం / పారిశుధ్యం మరియు పరిశుభ్రత / ప్రకృతిని పవిత్రంగా చూద్దాం.
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ప్రకృతిని పవిత్రంగా చూద్దాం.

ప్రకృతిని,పవిత్ర ప్రదేశాలను పవిత్రంగా చూడడం మన బాధ్యత అని తెలుసుకుందాం.

లక్ష్యం

ప్రకృతిని,పవిత్ర ప్రదేశాలను పవిత్రంగా చూడడం మన బాధ్యత అని తెలుసుకుందాం.

పద్ధతి

మనలో చాలామందికి దేవుడి మీద నమ్మకం ఉంటుంది. మతాన్ని బల్లీ మనం గుడికిగానీ, చర్చికిగానీ, మసీదుకుగానీ వెళ్తుంటాం. మనం మతాన్ని బట్టి పండుగలు చేసుకుంటాం. మనకు కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఆయా ప్రదేశాలను మనం చాలా పవిత్రమైనవిగా భావిస్తాం. దాదాపు అన్ని మతాలు ప్రకృతిని పవిత్రంగా చూడాలని చెబుతాయి. చెరువులు, అడవులు, రాళ్లు, పక్షులు, జంతువులు ఇలా దేనికీ హాని చేయకూడదని కూడా చెప్తాయి. అయితే ఈ పవిత్ర స్థలాలు కూడా ప్లాస్టిక్ కవర్లకు, చెత్తకు దూరంగా లేవు. అపరిశుభ్రంగా మారిపోతున్నాయి. మనం ఆహారం తిన్న తర్వాత పడేసే పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కవర్లు ఎక్కడపడితే అక్కడ పడేస్తుంటాం. దీనివల్ల పరిసరాలు దుర్గంధంతో నిండి పోతాయి. 89 ప్రాంతాల్లో నివసించే వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. పవిత్ర ప్రదేశాలకు వెళ్ళినపుడు మనం ఏమేమి చేయాలో, ఏమేమి చేయకూడదో జాబితా రాయండి.

ముగింపు

మనం ప్రసాదం తిన్న తర్వాత ఆకు దొప్పల్ని పేపర్లని ఎక్కడపడితే అక్క పడేయకూడదు. చెత్త కుండీల్లోనే వేయాలి. ఇట్లా వేయకపోతే మనం పారేసిన చెత్త నీళ్ళలో కలిసిపోయి నీళ్ళను కూడా కలుషితం చేస్తుంది. ఇది అక్కడ ఉన్న వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. తరువాత అక్కడికి చేరే మనలాంటివాళ్ళ ఆరోగ్యం కూడా పాడవుతుంది. మనం పేపర్లను, కవర్లను, చెత్తా చెదారాన్ని నీళ్ళలో వేయదు. ఈ చెత్త నీళ్ళ ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. నీళ్ళను కలుషితం చేస్తుంది. ఇదంతా తెలిసినా కూడా మనం చెత్తను నీళ్ళలోనే వేస్తాం. మనది కాదు అన్నచోటే మనం చెత్తను పడేస్తాం. మన స్థలాన్ని మాత్రం శుభ్రంగా ఉంచుకుంటాం. ఇప్పటి నుండి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్రాంతంలో ఎక్కడపడితే అక్కడ చెత్త వదలకూడదు. ఎక్కడపడితే అక్కడ చెత్తను వదిలితే భవిష్యత్తులో దర్శనీయ స్థలాలు ఉండవు. మురికి కూపాలే మిగులుతాయి.

హైదరాబాదులోని మూసినదికి, కర్నూలులోని తుంగభద్ర, రాజమండ్రిలోని గోదావరి, విజయవాడలోని కృష్ణా నదులకు ఇదే జరిగింది. మనం ఆ పవిత్ర స్థలాల్లో చెత్తను వేయకపోతే అవి పవిత్రంగానే ఉండేవి. ఇట్లా నదుల ఒడ్డున ఉన్న పవిత్ర స్థలాలు పాడవుతున్నాయి. వీటిని పవిత్రంగా ఉంచుకోడం మన బాధ్యత.

ఆధారము: http://apscert.gov.in/

2.95180722892
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు