హోమ్ / ఆరోగ్యం / పారిశుధ్యం మరియు పరిశుభ్రత / మన పరిసరాలలో మార్పులు వాటి ప్రభావాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మన పరిసరాలలో మార్పులు వాటి ప్రభావాలు

మార్పు అతి సహజమైనది. ప్రతి అంశంలోనూ కాలంతోపాటు మార్పును గమనించవచ్చు.నిత్యం మన పరిసరాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటుంటాయి.

లక్ష్యం

మన పరిసరాల్లోవచ్చే భౌతిక మార్పులను, వాటి ప్రభావాలను అధ్యయనం చేద్దాం.

నేపథ్యం

మార్పు అతి సహజమైనది. ప్రతి అంశంలోనూ కాలంతోపాటు మార్పును గమనించవచ్చు.నిత్యం మన పరిసరాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటుంటాయి.

పద్ధతి

  1. గత 5సంవత్సరాలలో మీ పరిసరాల్లో లేదా ఊరిలో ఏమేమి మార్పులు వచ్చాయో పరిశీలించండి. ముఖ్యంగా కింది అంశాలు పరిగణనలోనికి తీసుకోండి. కొత్తగా నిర్మిస్తున్న ఇళ్ళు, బిల్డింగులలో నూతన పోకడలు, రోడ్ల వెడల్పు, చెరువు, వ్యవసాయ భూమిలో తగ్గుదల, నీరు, విద్యుత్ , వాహనాలు సౌకర్యాలలో వస్తున్న మార్పులు, విరామ కాలాన్ని వినియోగించుకోడంలో వసున్న మార్పులు, పిల్లల -- పెద్దల ఆటల్లోని మార్పులు, వృత్తుల్లోని మార్పులు, వేషధారణలోని మార్పులు, చదువులో ఉద్యోగ అవకాశాల్లో, సమాచార మార్పిడిలో, వాతావరణం, చెట్ల మొదలైనవి.
  2. మీ తాతయ్య, నానమ్మలు, తల్లిదండ్రులు లేదా ఎవరైనా పెద్దవారిని కలిసి ఇప్పుడు మీరు గమనిస్తున్న మార్పులు, అంశాలు ఆ కాలంలో ఎలా ఉండేవో అడిగి తెలుసుకొని నమోదుచేయండి.
  3. గతకొన్ని సంవత్సరాలుగా చోటుచేసుకుంటున్న మార్పులు, నీటి అందుబాటు, ఆటస్థలాలు, విద్యుత్తు, ఇంధనం, పశుగ్రాసం, పరిశుభ్రత, రవాణా, సమాచార ప్రసారం, పళ్ళు, కూరగాయలు, పంటల ఉత్పత్తి, ఇతర అంశాలపై ఎలాంటి ప్రభావం చూపాయో కనుక్కోండి.
  4. స్థానిక వారాపత్రికల నుండి పరిసరాలలోని మార్పులు,ప్రజల జీవనానికి సంబంధించిన ఆర్థికల్స్, ఫోటోలు, వార్తలు సేకరించండి.

ముగింపు

ఆధునికంగా వస్తున్న మార్పులేవీ పర్యావరణ హితంకావు. రేడియోస్థానంలో టి.వి., కంప్యూటర్, ల్యాండ్ ఫోన్ స్థానంలో మొబైల్, మట్టిరోడ్డు బదులు వచ్చిన సిమెంటు రోడ్డు ఇవన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా పర్యావరణంమీద తద్వారా మన ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. అభివృద్ధి అవసరమే అయినప్పటికి అది పర్యావరణ హితంగా ఉండాలి. గంటల తరబడి కంప్యూటర్లతో పనిచేయడం వల్ల అవి విడుదల చేసే రేడియేషన్ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇలాంటి ఉపకరణాల వాడకం వల్ల తగినంత జాగ్రత్త అవసరం.

మీ పరిశీలించిన, సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి చిత్రాలను ఉపయోగించి ఒక నివేదిక తయారుచేసి ప్రదర్శించండి.

తదుపరి చర్యలు

  1. మీ పరిసరాలలో వస్తున్న మార్పులను గురించి తెలుపుతూ ఒక చార్జును తయారుచేసి పాఠశాల బులెటన్ బోర్డులో ప్రదర్శించండి.
  2. మీ ప్రాంతంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో కనుక్కోండి.
  3. ఇంటి ఆవరణ మట్టినేల లేకుండా మొత్తాన్నీ సిమెంటు చేయడం, గోడ నుండి గోడ వరకు దారి వెడల్పు మొత్తం సిమెంటు రోడ్డు వేయడం మంచిదేనా! దీని వల్ల కలిగే ఫలితాలేమిటి?

ఆధారము: http://apscert.gov.in/

2.97849462366
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు