హోమ్ / ఆరోగ్యం / పారిశుధ్యం మరియు పరిశుభ్రత / మనం టీకాలు ఎందుకు వేయించుకోవాలి?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మనం టీకాలు ఎందుకు వేయించుకోవాలి?

ఏ ఏ వ్యాధులకు టీకాలు వేస్తారో కనుగొందాం.మరియు టీకాలు వేయించుకోవాల్సిన అవసరాన్ని ప్రాముఖ్యతను ప్రజలకు తెలియచేద్దాం.

లక్ష్యం

  1. ఏ ఏ వ్యాధులకు టీకాలు వేస్తారో కనుగొందాం.
  2. టీకాలు వేయించుకోవాల్సిన అవసరాన్ని ప్రాముఖ్యతను ప్రజలకు తెలియచేద్దాం.

నేపథ్యం

గొంతువాపు, కోరింతదగ్గు, ధనుర్వాతం, కలరా, హెపటైటిస్, పోలియో మొదలైన వ్యాధుల నుండి రక్షణ పొందడానికి మనం టీకాలు వేయించుకుంటాం. పోలియో వ్యాధికి తప్పక టీకాలు, తీసుకోవలసిన అవసరాన్ని నేడు చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మశూచి మాదిరిగానే పోలియోనుకూడా పూర్తిగా రూపుమాపడానికి అంతర్జాతీయంగా ప్రయత్నం జరుగుతున్నది. ప్రజలలో అవగాహన లోపం, వివక్షతలవల్ల మన దేశంలో ఇంకా పోలియోవ్యాధి బాధితులు కనబడుతున్నారు. కాబట్టి టీకాలు వేయించుకోవలసిన అవసరం గురించి ప్రజలలో అవగాహన, సృహ కల్గించడం చాలా ముఖ్యం..

పద్ధతి

  1. ఏ ఏ వ్యాధులకు టీకాలు వేయించుకుంటారో కనుగొనండి.
  2. మీ పరిసరాలలో నివసిస్తున్న 20 కుటుంబాలను ఇంటర్వ్యూ చేయండి. (వీరిలో పనిమనుషులు, చిరు వ్యాపారస్తులు, దర్జీవారు, క్షురకులు మొదలైన రకరకాల వృత్తుల వారు ఉండేలా చూసుకోండి.

ఈ కింది విషయాలను కనుగొనండి.

ఎ) వీరికి టీకాల రకాలు, వాటి ప్రాముఖ్యతను గురించి తెలుసో లేదో విచారించండి?

బి) టీకాలను ఉచితంగా ఎక్కడ ఇస్తారు?

సి) వారి పిల్లలకు టీకాలు  ఏ ఏ వ్యాధులకు ఇప్పించారు?

డి) టీకాలు తీసుకోకపోతే దానికి గల కారణాలేమిటి?

ముగింపు

రోగాలు రాకుండా పిల్లలకు టీకాలు వేయించడం తప్పకుండా చేయాల్సినపని ఇందుకోసం మన వంతు బాధ్యతగా మన చుట్టుపక్కల ఇళ్ళలో టీకాల వయసున్నపిల్లలందరికీ ఆ సదుపాయం అందించడానికి తల్లిదండ్రులకు తెలియజేయవచ్చు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోడానికి చేయాల్సిన పనుల గురించి, ఆహారం తినే ముందు శుభ్రంగా చేతులు కడుక్కోడం గురించి, కాచి చల్లార్చిన నీరు తాగడాన్ని అలవాటు చేయడం గురించి నినాదాలు, కరపత్రాలు రూపొందించి ప్రజలకు అవగాహన కలిగించేందుకు కృషిచేద్దాం.

తదుపరి చర్యలు

  • మీ పరిసరాలలో నివసిస్తున్న ప్రజలలో, టీకాలకు సబంధించి అవగాహనను కల్లించండి.
  • పిల్లలందరికీ, సకాలంలో టీకాలు ఇప్పించే విధంగా తల్లిదండ్రులను ప్రోత్సహించండి.

ఆధారము: apscert

3.02
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు