పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వాన నీటిని దాచుకుందాం

నీటి ప్రాముఖ్యతను అర్థం చేసుకుందాం.మరియు వర్షపు నీటిని కాపాడుకునే విధానాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలలో పాల్గొందాం.

లక్ష్యం

1. నీటి ప్రాముఖ్యతను అర్థం చేసుకుందాం.

2. వర్షపు నీటిని కాపాడుకునే విధానాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలలో పాల్గొందాం.

నేపథ్యం

నీరు లేకపోతే జీవం లేదు. వర్షం, మంచు ఇవి రెండూ స్వచ్ఛమైన నీటికి ప్రధాన వనరులు. నదులు, సరస్సులు, భూగర్భజలాలు, ఇతర నీటి వనరులన్నీ పై రెండు ప్రధాన వనరుల ద్వారానే నీటిని పొందుతాయి. అయితే ఇదే  సందర్భంలో అధికభాగం నీరు వృథా అవుతోంది. జనాభా పెరుగుదల , అభివృద్ధి వల్ల నీటి వినియోగం పెరగటంవల్ల నీటి వనరుల కొరత ఏర్పడుతున్నది. అందువల్ల నీటిని విచక్షణాయుతంగా ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ప్రతి నీటి చుక్క అమూల్యమైంది. పెరుగుతున్న నీటి అవసరాలను తీర్చటానికి వర్షపు నీటి సంరక్షణ పద్ధతి చాలా ముఖ్యమైనది.

పద్ధతి

1. దేశంలో వివిధ ప్రాంతాలలో వర్షపు నీటి సంరక్షణ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో వారాపత్రికలు, మాసపత్రికలు, అంతర్జాలం మొదలైన వాటి నుండి తెలుసుకోండి.

2. మన రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న నీటి సంరక్షణ పద్ధతులు తెలుసుకోండి.

3. నీటి సంరక్షణా పద్ధతులను పాటిస్తున్న పాటించని రెండు ప్రాంతాలను పరిశీలించండి. గృహా అవసరాలకు నీటి లభ్యత, వినియోగం వివరాలను పోల్చండి.

ముగింపు

నీరు లేకుండా మనం రోజువారీ పనులు ఏవీ నిర్వహించుకోలేం కదా! చాలా మంది నీరు ఉచితంగా లభిస్తోంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా వాడేస్తుంటారు. బాధ్యతలేనట్లుగా ప్రవర్తింస్తుంటారు. నీరు ఎంతో విలువైనదని మనమందరం తెలుసుకున్నాం కాబట్టి నీటిని పొదుపుగా వాడడం అలవాటు చేసుకుంటే నీటి వనరులను కాపాడుకున్నట్లే. ఇవి చాలా చిన్న పనులే అయినప్పటికీ చాలా పెద్ద ఫలితాలనిస్తాయి.

వాననీరు వృథాగా పోకుండా ఇంకా ఏమేమి చేయవచ్చో ఆలోచిద్దాం.

  1. ఆ డాబామీద పడే వర్షపునీరు గొట్టాల గుండా వీధిలోకి, కాలువలలోకి పోకుండా ఇంటిలో మొక్కలకు వెళ్ళేలా ఏర్పాటు చేసుకుందాం.
  2. మన ఇంటిలో, వీధిలో, పాఠశాలలో ఇంకుడుగుంత ఏర్పాటుచేసుకుందాం. ఆ వాన నీటిని పట్టి డబ్బాలలో నిల్వచేసి ఇంటి అవసరాలకు వాడుకుందాం.
  3. ఇంటిలో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ఇలా చేస్తే కరెంటును కూడా కాపాడుకోగలుగుతాం కదా! ఇంకా మనం ఏమేమి చేయగలమో చూద్దాం! ఆ నీరు తాగేటప్పుడు గ్లాసును ఎత్తిపట్టి తాగే అలవాటు చేసుకుందాం! దీనివల్ల గ్లాసు కడగడానికి మరొక గ్లాసు నీటిని వృథా చేయవలసిన అవసరం ఉండదు.
  4. కాళ్ళుచేతులు కడుక్కునేటప్పుడు మొక్కల పాదుల్లో కడుక్కుంటే నీరు మొక్కలకు ఉపయోగపడుతుంది. తి తక్కువ గాఢతగల సబ్బును వాడి బట్టలు ఉతికితే ఆ నీటిని మొక్కలకు పెట్టవచ్చు.
  5. ఏ రకమైన సబ్బు ఉపయోగించినప్పటికీ ఆ నీటిని కొంతసేపు బకెట్లో ఉంచితే తేరుకుంటాయి. వాటిని టాయిలెట్లకు వాడుకోవచ్చు. అ స్నానాలకు వాడిన నీటిని కూడా వృథాగా డ్రైనేజీలలోకి వదలకుండా మొక్కలకు పెట్టాలి. ఆ మీరు సేకరించిన సమాచారం ఆధారంగా నివేదికను రూపొందించండి.

తదుపరి చర్యలు

1. మీ తులనాత్మక అధ్యయనం ఆధారంగా మీ ప్రాంతానికి అనువైన సంరక్షణా పద్ధతులను సూచించండి.

2. మీ పాఠశాల, ఇల్ల, సమీప ప్రాంతాలలో నీటి సంరక్షణ పద్ధతులను పాటించేలా చేయండి.

3. వాన నీటిని మనం ఎందుకు దాచుకోవాలి? లేకపోతే ఏమి జరుగుతుంది? మీరైతే ఏమి చేయాలనుకుంటున్నారు. మీ ప్రణాళికలేమిటి?

 

ఆధారము: http://apscert.gov.in/

3.05555555556
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు