অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ప్రసవానంతర ఆరోగ్యం

ప్రసవానంతర ఆరోగ్యం

నార్మల్ డెలివరీ తర్వాత సాధారణ సమస్యలు

గర్భం అనేది ఎవరికైనా జీవితంలో గొప్ప మార్పు వచ్చే సమయంగా ఉంటుంది. మీరు ఒక కొత్త జీవితం కొరకు సిద్ధం కావటానికి మీరు మానసిక మరియు శారీరక మార్పులకు గురికావలసి ఉంటుంది. గర్భం తొమ్మిది మాసాలు ఉంటుంది. మీరు బాగా తిని మీరు బాగా నిద్రపోయి,మీరు ఒక తల్లిగా మిమ్మల్ని మీరే ఊహించుకోవటానికి ప్రయత్నించండి. మీ సాధారణ డెలివరీ ఎంత హార్డ్ అన్నది అనవసరం. మీ వెచ్చదనం కొద్దిగా ఉంచేందుకు ఒకసారి నొప్పి మరియు ఇబ్బందులు మీ జ్ఞాపకాలతో అదృశ్యమవుతాయి. కానీ,కొన్నిసార్లు,సాధారణ డెలివరీ ఉపద్రవాలు మరియు సమస్యలను తెచ్చిపెడుతుంది. చాలా జాగ్రత్తగా మీ సాధారణ డెలివరీ తర్వాత ప్రసూతి కాలంను నిర్వహించడం ముఖ్యం. యోని డెలివరీలో సొంత ప్రయోజనాలు మరియు నష్టాలు ఉన్నాయి. క్రింద సాధారణ డెలివరీ తర్వాత కొన్ని సాధారణ ఉపద్రవాలు జాబితా ఉంది. కానీ వీటిని మిమ్మల్ని భయపెట్టేందుకు మరియు పీడకలలు రావటానికి చెప్పట్లేదు. యోని పుండ్లు పడడం సాధారణ డెలివరీ సమయంలో యోని కణజాలం ముక్కలు లేదా చర్మ గాయము జరిగే అవకాశం ఉంది. కొంత సమయం వరకు ఈ ప్రాంతంలో చాలా పుండ్లు మరియు సుకుమారముగా తయారవును. గాయం తొలగించి శుభ్రంగా ఉంచాలి. ఇది నార్మల్ డెలివరీ తర్వాత ఉపద్రవాల విభాగంలోకి వస్తుంది.

ఇన్ఫెక్షన్:

నార్మల్ డెలివరీ తర్వాత వచ్చే సాధారణ సమస్యల్లో ఇన్ఫెక్షన్ ఒకటి. ప్రసవ సమయంలో యోనిలో చర్మపు గాయాలు లేదా టియర్స్ అనేవి ఇన్ఫెక్షన్ కు దారితీస్తాయి. సాధారణంగా ఈ ఇన్ఫెక్షన్ ను యాంటీబయాటిక్స్ తో చికిత్స చేస్తారు. హేమరేజ్ హేమరేజ్ లేదా భారీ రక్త నష్టం ఇప్పటికీ సాధారణ డెలివరీ తర్వాత ముఖ్య ఉపద్రవాలలో ఒకటి. సరిగ్గా రక్తం ఆగకపోతే,టియర్ లోపల సేకరించిన రక్తం యోనిలో రక్తపు గడ్డ నిర్మాణంనకు దారితీయవచ్చు. మళ్ళీ కుట్లు వేయుట ఈ యోని టియర్ నుండి ఉపద్రవం ఉంటుంది. సాధారణ డెలివరీ సమయంలో టియర్ ఏ రక్తపు గడ్డ నిర్మాణ పరిస్థితి అయిన సంక్లిష్టం చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో, చీలిక రక్తం తొలగించి మళ్లీ తిరిగి ప్రారంభమవుతుంది. గర్భాశయ వ్యాధి సాధారణ డెలివరీ తర్వాత వచ్చే సాధారణ సమస్యల్లో ఒకటి.ప్రసూతి సమయంలో గర్భాశయం దెబ్బతినుట మరియు బలహీనపడవచ్చు. ఇది సరిపోని గర్భాశయ పరిస్థితికి దారితీస్తుంది.ఇది భవిష్యత్తు గర్భాలకు ఒక సమస్యగా మారుతుంది. మూత్రవిసర్జన సమస్యలు సాధారణ డెలివరీ తర్వాత ఉన్నటువంటి ఈ రకమైన సమస్యను సొంతంగా పరిష్కరించుకోవచ్చు. డెలివరీ తర్వాత మూత్రవిసర్జన కొంచెం కష్టం అవుతుంది. మూత్ర ద్వారం టెండర్ మూలాధారపు ప్రాంతంలో కుట్టడం వలన మరియు అలాగే మూత్రాశయం చుట్టూ కణజాలం వాపు లేదా గాయాల జరుగుతుంది. మూత్ర నియంత్రణ లేకపోవుట నార్మల్ డెలివరీ తర్వాత వచ్చే సమస్యలలో మూత్ర నియంత్రణ లేకపోవుట ఒకటి. ప్రేగు కదలికలను నియంత్రించటంలో అసమర్థతను సూచిస్తుంది. ఇది సాధారణంగా సుదీర్ఘ ప్రసూతి మహిళలలో కనబడుతుంది. బిడ్డకు చిక్కులు సాధారణ డెలివరీ తర్వాత ప్రసూతి సమయంలో పిండం యొక్క స్థానం కారణంగా సమస్యలు వస్తాయి. సాధారణంగా బేబీ తల క్రింది భంగిమలో ఉండాలి. పిండం ఏ ఇతర స్థానంలో కనిపించిన సమస్యలు ఉద్భవిస్తాయి. యాంత్రిక పిండమునకు గాయం సాధారణ డెలివరీ తర్వాత పిండమునకు సంబంధించిన భౌతికమైన గాయం జరిగే అవకాశం ఉంది. శిశువు పెద్దదిగా ఉంటే ప్రమాద కారకాలు ఎక్కువగా ఉంటాయి. తల్లి ఊబకాయంగా ఉన్నా ఈ విధంగా జరుగుతుంది. ఈ సమస్యలను దీర్ఘకాలిక హాని లేకుండా పరిష్కరించవచ్చు.

ఆధారము: తెలుగు బోల్డ్ స్కై

శిశువుకు పాలుపట్టించడానికి సులభ చిట్కాలు

శిశువుకు తల్లి పాల ప్రాముక్యత,  చిట్కాలు - వీడియో


శిశువుకు తల్లి పాల ప్రాముక్యత, చిట్కాలు - ఈ వీడియొ లో చుడండి

చాలామంది తల్లులు, శిశువు మరియు తల్లి మధ్యన చనుపాల సంబంధం సహజంగా మరియు సులభంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. చాలామంది తల్లులు, శిశువు మరియు తల్లి మధ్యన చనుపాల సంబంధం సహజంగా మరియు సులభంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. సహజంగా అనే పదానికి వివరంగా చెప్పాలంటే బిడ్డకి చనుబాలివ్వడం, అంటే బిడ్డ తల్లి రొమ్మును గట్టిగా లాగి చప్పరించటం మరియు అయితే ఈ ప్రక్రియ బిడ్డ చేత చేయించటం అంత సులభమేమి కాదు. ఏమీ లేదు. ప్రతి తల్లికి, ఈ అందమైన అనుభవం, బిడ్డకి చనుపాలు అలవాటు చేయడానికి కొన్నిచిట్కాలు అవసరం.

1. శిశువు సహజంగా చప్పరించటం ముఖ్యం. రొమ్మును బలవంతంగా పైగా శిశువు నోటిలో ఉంచటం వంటి పధ్ధతి ఒక చెడు చప్పరింతకు దారితీయటం వలన నొప్పి మరియు ఒక ఇబ్బందికి, బిడ్డ ఆకలి తీరక ఏడుపుకు దారితీస్తుంది. ప్రకృతిపరంగా సహజంగానే ఎటువంటి సహాయం అవసరం లేకుండానే బిడ్డ చనుబాలుకు అలవాటుపడతాడు., బిడ్డ మొట్టమొదటి చనుబాలు కొరకు వేసే గుటక గురించి కొద్దిగా గందరగోళంగా ఉండవచ్చు; ఎందుకంటే శిశువు మొట్టమొదటిగా తల్లిరొమ్ము చూదాటం లేదా వాసన పీల్చటం వంటి కారణాలు కావొచ్చు.శిశువు తన తలను ముందుకు వెనుకకు జరుపుతూ ఉంటే, వారి తలను స్థిరంగా ఉంచి, వారికి చనుపాలు ఇవ్వండి.

2. వివిధ రకాల భంగిమలను ఎంచుకోండి. చనుబాలు ఇచ్చే స్థితులు సాధారణంగా నాలుగు రకాలు ఉంటాయి. ఊయల పట్టు, పరివర్తన పట్టు, బలమైన పట్టు మరియు ప్రక్క పట్టు: ఊయల పట్టు అంటే ఎటువైపు చనుపాలు అందివ్వాలని అనుకుంటే అటువైపు బిడ్డను చేతిలో ఉంచుకోవటం, పరివర్తన పట్టు అంటే బిడ్డను ఒడిలో ఉంచుకుని, చనుపాలు అందించే వైపు బిడ్డ తలక్రిందుగా చేయి ఉంచటం, బలమైన పట్టు అంటే బిడ్డ శరీరం తల్లితోపాటు సమాంతరంగా కాకుండా, వ్యతిరేకంగా ఉండటం, ప్రక్క పట్టు అంటే తల్లి ప్రక్కకు తిరిగి ఉన్నప్పుడు బిడ్డను కూడా తల్లివైపుకు ప్రక్కకు ఉంచి చనుపాలు త్రాగించటం.

3. శిశువుకు ఏదైనా సహాయంతో మద్దతు ఇవ్వండి. తల్లి ఒకే భంగిమలో 10 లేదా 20 నిమిషాలు శిశువును పట్టుకొని పాలివ్వలటం వలన ఆమె చేతి కండరాలకు చాలా బాధ కలుగుతుంది. తల్లి, శిశువుకి చనుబాలు అందిస్తున్నప్పుడు తన చేతికి బదులుగా ఒక దిండు సహాయం తీసుకోవటం మంచిది. దీనికొరకు ప్రత్యేకదిండ్లు చాలానే ఉన్నాయి, కానీ ఒక సంస్థ బెడ్ దిండు చాలా బాగా పనిచేస్తున్నది.

4. తల్లి రొమ్ము ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. శిశువు చనుపాలు త్రాగిన తర్వాత, రొమ్మును శుభ్రపరచుకోండి. ఈవిధంగా చేయటం వలన బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది మరియు రొమ్ము పాలనాళాలు అంటువ్యాధులకు గురికాకుండా నివారించవచ్చు.

5. వేడి అంటే ఇన్ఫెక్షన్ అని అర్ధము. చనుపాలు ఇస్తున్నప్పుడు బాధగా ఉంటే, ఒక రకమైన లేతరంగు ఉత్సర్గము రొమ్ము నుండి కారుతుంటే మరియు రొమ్ము కణజాలం సాధారణవేడి కంటే ఎక్కువ వేడిగా అనిపిస్తే, అది రొమ్ములో ఇన్ఫెక్షన్ అయి ఉండవొచ్చు. వెంటనే డాక్టరును సంప్రదించి ఆ ఇన్ఫెక్షన్ పోయే వరకు చనుపాలు బిడ్డకి ఇవ్వకూడదు.

6. తల్లిచనుపాలను త్రాగించటం మొట్టమొదట కష్టమైనా అది ఒక సహజ ప్రక్రియ. చనుపాలు పట్టించే సమయంలో బిడ్డ తల్లికి దగ్గరగా హత్తుకుని ఉండి తల్లి శరీరవెచ్చదనాన్ని పొందుతుంది. అలా కాకుండా తల్లి తన బిడ్డను దగ్గరగా తీసుకున్నప్పుడు ఏమైనా సమస్యలు ఉంటే, తల్లి బట్టలు వాదులు చేసుకోవటం మరియు ఇద్దరి దగ్గరితనానికి ఎక్కువ సమయం వెచ్చించటం మంచిది.

ఆధారము: తెలుగు బోల్డ్ స్కై

గర్భిణీ స్త్రీలకు వచ్చే తలనొప్పికి ప్రధాన కారణాలు..నివారణ.!

శరీరంలో నొప్పులు మురియు అలసటకు గురిచేసేది గర్భధారణ సమయం. తలనొప్పి అనేది గర్భాధారణ సమయంలో వచ్చే అతి సాధారణమైన నొప్పి. గర్భధారణ సమయంలో తలనొప్పితో చాలా ఇబ్బంది పడవల్సి వస్తుంది. గర్భధారణ సమయంలో వచ్చే తల, మొడనొప్పి అంత తీవ్రమైనవి కాకపోవచ్చు. అయితే ఇవి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా పనిచేసే(ఉద్యోగస్తులు)అయితే, అటువంటి వారిలో వచ్చే తలనొప్పి ఖచ్చితంగా సమస్యాత్మకంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో వచ్చే తలనొప్పి నివారణ కోసం మాత్రలు తీసుకోవడం మంచిది కాదు. అయితే గర్భధారణ సమయంలో వచ్చే తలనొప్పికి కారణాలు తెలుసుకుంటే, మీరు తప్పకుండా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. గర్బధారణ సమయంలో వచ్చే తలనొప్పులకు కొన్ని ముఖ్య కారణాలు క్రింది ఇవ్వబడ్డాయి..వాటిని పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే ప్రెగ్నెన్సీ హెడ్ ఏక్ నుండి ఉపశనమం పొందవచ్చు. మరి గర్భధారణ సమయంలో తలనొప్పి రావడానికి గల కొన్ని ప్రధాన కారణాలు....

ఒత్తిడితో కలిగే తలనొప్పి: ఎప్పుడైతే మీరు ఒత్తిడితో ఉంటారో..అప్పుడు మీకు తలనొప్పికి గురిఅవుతారు. గర్భధారణ సమయంలో ముఖ్యంగా మొదటి మూడు నెలలో మీ శరీరం మనస్సు చాలా ఒత్తిడితో కూడి ఉంటుంది. మొదటి మూడు నెలలు అసౌకర్యంగా ఎప్పుడూ అలసట, వికారం మరియు గర్భధారణకు మీ శరీరాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి శరీరంలో అనేక మార్పులు చేటు చేసుకోవడం వల్ల ఒత్తిడి, టెన్షన్ హెడ్ ఏక్ వంటివి వస్తాయి. అయితే టెన్షన్ హెడ్ ఏక్ ను తగ్గించుకోవడానికి వేరే మార్గం లేదు. అందుకోసం రిలాక్స్ టెక్నిక్స్(మెడిటేషన్ మరియు యోగా) పాటిస్తే చాలా వరకూ తలనొప్పిని తగ్గించుకోవచ్చు.

హార్మోనల్ హెడ్ ఏక్: గర్భధారణ సమయంలో శరీరంలోని అనేక హార్మోలను మార్పుల వల్ల కొన్ని సమయాల్లో తలనొప్పిక కారణం అవుతుంది. ఈ హార్మోనల్ హెడ్డేక్ నుండి ఉపశమనం పొందడానికి ఫ్రెష్ ఎయిర్ ను పీల్చడం కానీ లేదా మనస్సును ఆహ్లాదపరిచే మూడ్ బూస్టింగ్ ఫుడ్ అంటే చాక్లెట్ వంటివి తినడం వల్ల చాలా వరకూ ఉపశమనం పొందవచ్చు.

బ్లడ్ షుగర్ స్థాయిలు: ఎప్పుడైతే ప్రెగ్నెంట్ గా ఉంటారు, అటువంటి సమయంలో మీరు కొంచెం కూడా కష్టమైన పనులు చేయకున్నా కూడా మీ శరీరానికి రెగ్యులర్ డోస్ ఎనర్జీ చాలా అవసరం. మద్యహ్న సమయంలో వచ్చే తలనొప్పి కారణం? బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిపోవడమే. అటువంటి సమయంలో ఏదైనా ఒక ఎనర్జీ డ్రింక్ ను తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమం చేస్తుంది.

ఉపసంహరణ లక్షణాలు: మీరు పొగత్రాగేవారైనా లేదా కెఫిన్ కు పూర్తిగా బానిస అయినా..అప్పుడు మీరు గర్భధారణ సమయంలో వచ్చే తలనొప్పితో పోరాడవల్సిందే. మీ డాక్టర్ మీకు పొగత్రాగడం మానేయమని లేదా కెఫిన్ తగ్గించమని సలహా ఇస్తారు. మీ తలనొప్పికి ఈ ఉత్ప్రేరకాలు మానివేయడం వల్ల బహుశా మీ తలనొప్పిని నివారించుకోవచ్చు.

శబ్ధం వల్ల వచ్చే తలనొప్పి: గర్భధారణ సమయంలో మీరు మరింత సున్నితంగా మారడం వల్ల పెద్ద శబ్ధాలు, ఎక్కువ మాట్లాడటం మరియు ట్రాఫిక్ వల్ల తలనొప్పికి కారణం కావచ్చు. తలనొప్పి నివారించుకోవడానికి ఏకైక మార్గం. మిమ్మల్ని మీరు నిశ్శబ్దంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఆఫీసులో ఉన్నట్లైతే, కాలీగా ఉన్న మీ ఆఫీస్ కాన్ఫరెన్స్ రూమ్ మీరు రిలాక్స్ పొందడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఒక వేళ మీరు ఇంట్లో ఉంటే కనుక మీరు మీ ఇంట్లో టెలివిజన్ ను స్విచ్ ఆఫ్ చేయండి. అలాగే లైట్లు కూడా ఆఫ్ చేసి కొద్ది సమయం రిలాక్స్ అవ్వండి . ఇవే గర్భధారణ సమయంలో మిమ్మల్ని బాధించే కొన్ని ప్రధానమైన తలనొప్పులు..కాబట్టి గర్భధారణ సమయంలో తలనొప్పి ఎందు వల్ల వస్తుందో కనిపెట్టిం అందుకు అనుకూలంగా మిమ్మల్ని మీరు మార్చుకోవడం చాలా ముఖ్యం.

ఆధారము: తెలుగు బోల్డ్ స్కై

మొదటి మూడు నెలల్లో గర్భస్రావం(అబార్షన్)నివారించే చిట్కాలు...

మహిళలకు గర్భం ధరించడం ప్రకృతి ప్రసాధించిన ఓ వరం. అందువల్లే ఆ గర్భం మిస్ కరేజ్ (గర్భస్రావం)కాకుండా కాపాడుకునే బాధ్యత మనలో ఉంది. దాంతో అది ఒక శాపంగా మారకుండా ఉంటుంది. ఈ రోజుల్లో మన ఉరుకుల పరుగుల జీవితంలో, మానసిక ఒత్తిడి గర్భస్రావానికి (అబార్షన్ )కు ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. మరీ ముఖ్యంగా గతంలోలాగా స్త్రీలు గర్భం ధరించిన తర్వాత ఇంటి పట్టున ఉండటం చాలా అరుదైపోయింది. మానసిక, శారీరక విశ్రాంతి పొందడం ఖరువైంది. గర్భం ధరించిన తర్వాత బయటకు వెళ్ళడం వల్ల అనేక ప్రమాదాలను తెచ్చిపెట్టుకొంటున్నారు. గర్భస్రావాలు ఎక్కువగా మొదటి త్రైమాసికం(మొదటి మూడు నెల)ల్లో జరగడం సర్వ సాధారణం. అందుకు కారణం మొదటి మూడు నెలల్లో గర్భంలో పిండం ఎదుగుదల లోపించడం. మానసి ఒత్తిడి, పౌష్టికాహారలోపం, హార్మోనుల అసమతుల్యత. కారణం ఏదైనా కావచ్చు.మొదటి మూడు నెలల్లో గర్భస్రావాన్ని నిరోధించడానికి ప్రయత్నించాలి. అందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటి మూడు నెల్లో గర్భస్రావం జరగకుండా ఉండేందుకు తీసుకోవల్సి అతి సులభ చిట్కాలు చూడండి..

1. చీజ్ తినకూడదు: గర్భం ధరించిన మొదటి మూడునెలల్లో తెల్లని చీజ్(జున్ను)తీసుకోవడం చాలా ప్రమాధకరం. మొదటి మూడు నెలల్లో ఈ ఆహారానికి దూరంగా ఉండాలి. ఇది గర్భిణీలకు ఒక తీవ్రమైన విషాహార కారణంగా తక్షణమే గర్భస్రావానికి దారితీస్తుంది. కాబట్టి గర్భస్రావాలు తప్పించడానికి వైట్ జున్ను తినకపోవడమే మంచిది.

2. రఫ్ ట్రావెలింగ్(దూర ప్రయాణాలు): గర్భం ధరించిన తర్వాత ప్రయాణం చేయాల్సి వస్తే చాలా సురక్షితమైన ప్రయాణం చేయాలి. ప్రత్యేకంగా మొదిటి త్త్రెమాసికంలో పిండం అవరోధాలను ఎదుర్కొనేంత బలంగా ఉండదు కాబట్టి చాలా దూర ప్రయాణాలు, మరియు రోడ్లు ఎగుదిగుడు ఉన్న ప్రదేశాల్లో ప్రయాణం చేయడం సురక్షితం కాదు. అలాంటి ప్రయాణాలను సాధ్యమైనంత వరకూ నివారించండి. ఇంకా ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించడం కూడా ప్రమాధకరమే.

3. నిల్వ ఆహారాలు: ఏదైనా నిల్వ చేసిన ఆహారాలను ఈ మొదటి త్రైమాసికం(గర్భం ధరించిన మూడునెలల్లో)లో తీసుకోవడం వల్ల గర్భస్రావానికి కారణం కావచ్చు. ఉదా: నిల్వ చేసిన మాంసం, కార్టూన్ జ్యూసులు మొదలగునవి. కాబట్టి గర్భం సేఫ్ గా ఉండాలంటే తాజాగా వండిన ఆహారాలు, తాజా పండ్ల రసాలకు ప్రాధాన్యత ఇవ్వండి.

4. కెఫిన్ అధికంగా ఉండే డ్రింక్స్: మొదిటి టైమిస్టర్(మొదటి మూడు నెలల్లో)కొన్ని సార్లు మీరు గర్భం ధరించారన్న విషయం కూడా మీరు తెలుసుకోలేరు. అటువంటి సమయంలో కెఫిన్ అధికంగా ఉండే కెఫిన్ డ్రింక్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గర్భస్రావం జరిగే ప్రమాధం ఎక్కువ. కాబట్టి కాఫీ తీసుకోవడాన్ని మానుకొని గర్భస్రావాన్ని అరికట్టండి.

5. స్ట్రెస్ హార్మోన్స్(ఒత్తిడికి గురి అయ్యే హార్మోన్స్): గర్భం ధరించిన మొదటి మూడు నెలల్లో శరీరంలో అనేక మార్పులకు చోటు చేసుకుంటుంది. ఎప్పుడైతే మీరు ఒత్తిడికి గురి అవుతారో, అప్పుడు శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది ఈ స్ట్రెస్ హార్మోన్స్ మీ గర్భాశయాన్ని సంకోచాలకు దారితీసి పిండం స్థానభ్రంశము చెందుటను ప్రారంభిస్తుంది. కాబట్టి, చాలా వరకూ మీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. మొదటి త్రైమాసికంలో (మొదటి మూడు నెలల్లో)గర్భస్రావాలు నివారించడానికి ఇవి చక్కటి మార్గాలు.

ఆధారము: తెలుగు బోల్డ్ స్కై

ప్రసవం తర్వాత మసాజ్ వల్ల మహిళ పొందే ప్రయోజనాలు...

మర్దనా లేక మసాజ్ ద్వారా శరీరానికి ఉపశమనం కలుగుతుంది. ఎంతో శక్తిని, ఉత్తేజాన్నితిరిగి మన శరీరం పొందుతుంది. శారీరకంగా, మానసికంగా అలసట చెందిన శరీరానికి ఉల్లాసాన్నిచ్చే ప్రక్రియ మసాజ్‌. ప్రతిరోజు పని ఒత్తిడి మూలంగా టెన్షన్‌కు గురైన వారు హారుుగా సేదతీరేందుకు నేడు మసాజ్‌ సెంటర్లను ఆశ్రరుుస్తున్నారు. శరీరంలోని కండరాలకు ఉత్తేజాన్నిచ్చే మసాజ్‌ అన్ని వయసుల వారికి మంచిదే. వివిధ రకాల మసాజ్‌లతో శరీరంలోని పలు రకాల రుగ్మతలను నిర్మూలించవచ్చని వైద్య, ఆరోగ్య నిపుణులు సైతం పేర్కొంటున్నారు. ప్రసవం తర్వాత తల్లి తన ఆరోగ్యం చూసుకోవటానికి సమయం వుండదు. ఆమెకు రాత్రి, పగలు బిడ్డ ధ్యాసే అధికంగా వుంటుంది. అదే సమయంలో ఆమె శారీరక నొప్పులున్నాయని తెలుపుతుంది. ప్రసవం తర్వాత మహిళలు కొద్దిపాటి బరువు పెరుగుతారు. తమ పూర్వపు శరీర రూపం పొందాలనేది వారి ధ్యేయంగా వుంటుంది. అందుకుగాను వారు ఏం చేయాలి? వారు ప్రసవం తర్వాత మసాజ్ చేయించుకోవాలి. దీన్నే పోస్ట్ నేటల్ మసాజ్ అంటారు. పోస్ట్ నేటల్ మసాజ్ వల్ల సౌందర్య, శరీర నొప్పులు మాత్రమే కాదు, ఇతర ప్రయోజనాలు కూడా చూడండి...

విశ్రాంతి: కాన్పు తర్వాత మహిళలకు ఒత్తిడి వుంటుంది. తన బిడ్డకు అధిక సమయం కేటాయించడంతో కొత్త తల్లి శారీరకంగా, మానసికంగా అలసిపోతుంది. కనుక, అలసిన శరీరానికి మసాజ్ చాలా అవసరం.

శారీరక నొప్పులు: కాళ్ళలో, తొడలలో, చేతులు, మెడ, వీపు వంటివి కాన్పు తర్వాత నొప్పులు పెడతాయి. మసాజ్ చేస్తే వీటినుండి విముక్తి పొందవచ్చు. మసాజ్ రాత్రివేళ చేస్తే మంచిది. నిద్రించేముందు కొద్ది నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. లేదా భర్త సహాయం తీసుకుని మసాజ్ చేయించుకోవాలి. నొప్పిలేని నిద్ర పడుతుంది.

స్ట్రెచ్ మార్కులు: ప్రసవానంతరం పొట్టపై వచ్చే స్ట్రెచ్ మార్కులు మసాజ్ తో తగ్గుతాయి. మంచి నూనెలు వాడి మసాజ్ చేయించాలి. చర్మం - చర్మంపై అప్పటివరకు వున్న మృతకణాలు మసాజ్ తో తొలగిపోతాయి.

బరువు తగ్గుట: కాన్పు ముందరి శరీర రూపం పొందాలంటే, పొట్ట తగ్గాలంటే, శరీర కొవ్వు కరగాలంటే మసాజ్ తప్ప మరోమార్గం లేదు.

పాలు ఉత్పత్తి: ఆమెలోని పాలగ్రంధులు అధిక ఉత్పత్తి చేయాలంటే మసాజ్ సహకరిస్తుంది. స్తనాలు మసాజ్ చేస్తే పాలు అధికమవటమే కాక, రొమ్ములు వేలాడకుండా వుంటాయి. అంతవరకు అడ్డగించబడిన పాలగ్రంధులకు రక్తప్రసరణ బాగా జరిగి ఉత్పత్తి అధికమవుతుంది.

కండరాలు బిగువు: కాన్పు సమయంలో ఆమె కండరాలు వదులవుతాయి. కాన్పు తర్వాత చేసే మసాజ్ కు కండరాలు మరోమారు ఫిట్ నెస్ సంతరించుకుంటాయి.

రక్త సరఫరా: శరీర మసాజ్ శరీరమంతా రక్తప్రసరణ వుండేలా చేస్తుంది. నొప్పి దూరమవటమే కాక, అది ఆక్సిజన్ అధికంచేసి రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. మహిళలకు పోస్ట్ నేటల్ మసాజ్ వల్ల ఈ ప్రయోజనాలు చేకూరుతాయి. డెలివరీ తర్వాత శరీరానికి కొంత విశ్రాంతి కావాలి. ఆ విశ్రాంతి మసాజ్ తర్వాతి దశలో దొరుకుతుంది. మసాజ్ చేసేటపుడు గోరు వెచ్చటి నూనెలు ఉపయోగించండి. ఈ మసాజ్ ఇంటివద్దే చేసుకొనవచ్చు.

ఆధారము: తెలుగు బోల్డ్ స్కై

గర్భిణీ స్త్రీల కొరకు కొన్ని దీపావళి జాగ్రత్తలు..చిట్కాలు

దీపావళి పండుగ మన హిందూ సాంప్రదాయంలో చాలా ముఖ్యమైన అతి పెద్దగ పండుగ, జాతి, మతం, కలం, పెద్దా, చిన్న అన్న బేధం లేకుండా ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకొనేది ఈ పండుగ. ప్రతి ఒక్కరూ ఈ పండుగను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా ఈ పండుగ రోజున లక్ష్మీ మరియు గణేషున్ని పూజిస్తారు. కుటుంబ సభ్యులు మొత్తం సంతోషంగా గడపడానికి ఇది ఒక ఉత్తమమైన రోజు. అయితే, గర్భిణీ స్త్రీలు మాత్రం, ఈ పండుగ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు రిస్కీ కూడా... గర్భిణీ స్త్రీలకు ఒక ఎకో సేఫ్ దివాళీ ఒక ఉత్తమ చిట్కా. మరీ ముఖ్యంగా, ఈ పండుగ రోజున గర్భిణీ స్త్రీ ఖచ్చితంగా ఇంట్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి, ఈ దీపావళి సందర్భంగా గర్భిణీ స్త్రీల కోసం కొన్ని ఉత్తమ చిట్కాలను బోల్డ్ స్కై టీమ్ మీకు అంధిస్తోంది.

1. సౌకర్యవంతంగా ఉండాలి : ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ధరించే దుస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సింథటిక్ లేదా ఫ్యాబ్రిక్ వంటి దుస్తులకు దూరంగా ఉండాలి. కాటన్ వస్త్రాలను ధరించాలి . దాంతో వారు సురక్షితంగా ఉండవచ్చు. అంత త్వరగా నిప్పు అంటుకోవడానికి అవకాశం ఉండదు. హెవీ గా దుస్తులను ధరించడం వల్ల అసౌకర్యంగా ఉండటంతో పాటు రిస్కీ కూడా..

2. క్రాకర్స్ ను అవాయిడ్ చేయాలి: ప్రతి సంవత్సరంలాగే, ఈ సవంత్సరం కూడా మీకు క్రాకర్స్ కాల్చాలిని ఇష్టం ఉంటుంది. కానీ, మీరు గర్భిణీగా ఉన్నప్పుడు ఇటువంటి వాటికి దూరంగా ఉండటం ఉత్తమం. ఇవి చాలా ప్రమాదకరమైనవి, ముఖ్యంగా వీటితో వచ్చే పొగ మరియు కాలుష్యంలె కార్బన్ డైయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ వంటివి చాలా కాబోయే తల్లులకు మరియు కడుపులోని బిడ్డకు కూడా చాలా హానికరం. పొగ వల్ల శ్వాస సంబంధిత సమస్యలు కూడా మొదలవుతాయి.

3. ఆహారం: పండుగ వేళల్లో పనులతో బిజీగా ఉండిపోయే, సరైన టైమ్ కు తినకుండా, ఆహారనియమాలు పాటించరు. మీపనులు చక్కబెట్టుకుంటూనే మద్య మద్యలో ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం మర్చిపోకండి. మీ ఆరోగ్యం విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకండి . సరైన ఆహారంను తీసుకుంటా అధికంగా స్పైసీ మరియు ఆయిల్ ఫుడ్స్ ను నివారించండి . దీపావళి అంటేనే స్వీట్స్. స్వీట్స్ ఎక్కువగా తయారుచేస్తుంటారు. కాబట్టి గర్భిణీ స్త్రీలు స్వీట్స్ కు దూరంగా ఉండండి. దీపావళి సమయంలో ఈ చిట్కాలను పాటించడం చాలా ముఖ్యమైన చిట్కా. అలా కాకుండా స్వీట్స్ అధికంగా తినడం వల్ల గ్యాస్ట్రేషనల్ డయాబెటిస్ కు గురికావల్సి వస్తుంది.

4. మరికొన్ని ముఖ్యమైన చిట్కాలు: ఇంటిపనుల్లో నిమగ్నం అయినప్పుడు గర్భిణీ స్త్రీలకు మరిన్ని జాగ్రత్తలు అవసరం. ఎత్తులు ఎక్కడం, రసాయనాలతో బాత్ రూమ్ లు, సామాన్లను కడగడం వంటివి చేయకూడదు. పనులు చేసేటప్పుడు చాలా వరకూ చిన్ని చిన్న ప్రమాదాలు ఎదుర్కొంటుంటారు మహిళలు. ముఖ్యంగా ముందుకు వెనుకకు వంగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఆధారము: తెలుగు బోల్డ్ స్కై

గర్భిణీ మెటర్నిటీ బ్యాగ్ చెక్ లిస్ట్ లో ఉండాల్సిన 12

సాధారణంగా కొంతమంది గర్భిణీ స్త్రీలు హాస్పిటల్ కు వెళ్ళేటప్పుడు కంగారులో ఏదో ఒకటి మర్చిపోతుంటారు. అటువంటంటి వారు, హాస్పిటల్ కు వెళ్ళడానికి బయలుదేరే ముందుగా హాస్పిటల్ మెటర్నిటి బ్యాగ్ మీ వద్ద సిద్దంగా ఉంచుకోవాలి . ముఖ్యంగా వెటర్నిటీ బ్యాగ్ లో ట్రెండీ మరియు ఫ్యాషనబుల్ వస్తువుల మద్య అవసరం అయినవి వాటి మద్య ఉండిపోవటం వల్ల సమయానికి చేతికి దొకక, ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా వెటర్నటీ బ్యాగ్ లో మీకు అవసరం అయినవి మాత్రమే చాలా తక్కువగా ఉంచుకోవాలి. మీకోసం మీ మెటర్నిటీ బ్యాగ్ చెక్ లిస్ట్ లో ఉండాల్సిన కొన్ని వస్తువుల లిస్ట్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. మీరు హాస్పిటల్ కు వెళ్ళినప్పుడు మీ బ్యాగ్ లో ఉండాల్సిన అవసరం అయిన వస్తువులు:

1. మీ మెడికల్ ఫైల్స్ మరియు రికార్డ్స్: వీటిని ఏమాత్రం మిస్ చేయడానికి లేదు, మీరు మీ లాస్ట్ యాంటినంటల్ చెక్ నుండి తిరిగి ఇంటికి రాగానే, వాటిని తిరిగి క్లీన్ గా మీ మెటర్నిటి బ్యాగ్ లో పెట్టుకోవాలి .

2. డ్రెస్సింగ్ గౌన్లు లేదా నైటీస్: మీకు వదులుగా మరియు సౌకర్యవంతంగా లైట్ వెయిట్ ఉన్న దుస్తులను మీ వెటర్నిటి బ్యాగ్ లో సర్దుకోవాలి . హాస్పిటల్లో ఒకటి మాత్రమే అందిస్తారు. కానీ మనం అదనంగా ముందు జాగ్రత్తగా ఒకటి దగ్గర ఉంచుకోవడం మంచిది. డెలివరీ టైమ్ లో ఒకటి రెండు జతలు దుస్తులు అదనంగా మీ వద్ద ఉండటం మంచిది.

3. ప్లిప్-ప్లాప్స్: తేలికగా మరియు చదునుగా ఉన్నవి ఎంపిక చేసుకోండి . ఇవి లోపలికి బయటకు తీయడానికి సులభంగా ఉంటుంది.

4. ఒక జత సాక్సులు: మీరు నమ్ముతారో లేదో తెలియదుకానీ, నొప్పులు ప్రారంభమవుతానే మీ పాదాలు చల్లబడిపోతాయి. మరియు వాతావరణంను బట్టి కూడా కాళ్ళు చల్లబడవచ్చు . వెటర్నిటి రూమ్ లో వాటిని కాళ్ళు తొడగమని మీ పాట్నర్ ను లేదా హాస్పిటల్ ఆఫీస్ స్టాఫ్ ను తొడగమని చెప్పండి. ఏదైనా అసౌకర్యానికి గురైనప్పుడు వాటిని తియ్యడానికి కూడా ఒకరి సహాయం తీసుకోండి .

5. లోషన్స్ మరియు లిప్ బామ్స్: తరచూ మీ చర్మం పొడిబారుతుంటుంటుంది. అందుకు మాయిశ్చరైజర్ మరియు లిప్ బామ్స్ సహాయపడుతాయి. వాటిని కలిగి ఉండటం అలాగే డెలివరీ అయిన తర్వాత కూడా వాటిని ఉపయోగించడం మంచిది.

6. నర్సింగ్ గౌన్లు: మీరు ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తే నర్సింగ్ గౌన్స్ చాలా సహాయపడుతాయి. ఇవి శిశువుకు పాలు పట్టడానికి సౌకర్యవంతంగా ఉంటాయి.

7. సౌకర్యవంతమైన లోదుస్తులు: మీకు సౌకర్యవంతంగా ఉండే కాటన్ లోదుస్తులను ఎంపిక చేసుకోండి. ముందుగానే కొన్ని స్టాక్ పెట్టుకోండి . ముఖ్యంగా మీరు వేసుకొనేదానికి కంటే కొంచెం పెద్ద సైజును ఎంపిక చేసుకోండి . ఒక వేళ సిజేరియన్ జరిగితే ఇటువంటి పెద్ద సైజ్ లోదుస్తులు మీ గాయాల మీద రాసుకోకుండా సౌకర్యవంతంగా ఉంటాయి.

8. నర్సింగ్ బ్రాలు మరియు పాడ్స్: నర్సింగ్ బ్రాల వల్ల వక్షజాలను సురక్షితంగా కాపాడుకోవడంతో పాటు, పాలు పట్టడానికి అనువుగా ఉంటాయి. అంతే కాదు ఎటువంటి మిల్క్ లీకేజ్ ఉన్నా నివారించవచ్చు.

9. డైపర్స్: సాధ్యం అయితే ఒక పెద్ద డైపర్ ప్యాకెట్ తీసుకోండి . ఎందుకంటే కొత్తగా పుట్టే మీ బేబీకి తరచూ వాటిని మారుస్తుండాలి. రాత్రి, పగులు రెండు సార్లు డైపర్లు మారుస్తుండాలి. అందుకు కాటన్ నాపీలను ఎంపిక చేసుకోండి.

10. సాక్సులు మరియు బూటీస్: చిన్నగా కలర్ ఫుల్ గా ఉండే , పూర్తిగా కాటన్ తో తయారుచేసిన సాక్సులు మరియు బూటిస్ ను ఎంపిక చేసుకోండి.

11. క్యాప్స్: క్యాప్స్ అప్పుడే పుట్టిన శిశువుకు ఎటువంటి ఇన్ఫెక్షన్, కలగకుండా వెచ్చగా ఉండేందుకు ఈ క్యాప్స్ సహాయపడుతాయి. బేబీ తలను, చెవులను పూర్తిగా కవర్ చేసే విధంగా క్యాప్ లను మీవద్ద ఉంచుకోండి. ఇది శిశువును వెచ్చగా మరియు సౌకర్యవంతంగా ఉంచుతుంది.

12. బేబీ బ్లాంకెట్: అప్పుడే పుట్టిన మీ శిశువుకు వెచ్చదనం కలగడానికి నూల్ లేదా కాటన్ బ్లాంకెట్ చాలా అవసరం.

ఆధారము: తెలుగు బోల్డ్ స్కై

గర్భిణీ స్త్రీకి అసౌకర్యం కలిగించే 7 సాధారణ సమస్యలు... నివారణ

గర్భాధారణ అనేది తల్లిదండ్రులకు ఇద్దరికీ ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా గర్భిణీకి. స్త్రీ గర్భం ధరిస్తే చాలా ఆనందం చెంది తన భావోద్వేగాలు చెప్పలేనంతగా ఉంటాయి. స్త్రీ గర్భం దాల్చడంతో శారీరకంగా చాలా మార్పులు సంతరించుకొంటాయి. ఫిజికల్ గా మార్పు చెందే ఈ మార్పులు చాలా సాధారణంగానే ఉంటాయి. గర్భిణీగా ఉన్నప్పుడు శరీరంలో ఎటువంటి మార్పులు ఏర్పడుతాయి అందరికీ తెలిసిన విషయమే. పొట్టలో బేబీ పెరిగే కొద్దిగా పొట్ట ముందుకు పెరుగుతూ ఉంటుంది. కొన్ని కారణాలుగా ఎమోషనల్ కు గురిఅవుతుంటారు. ఉదయం పూటా ఎక్కువ అలసట చెంది వేవిళ్ళు చేసుకోవడం ఇవన్నీ గర్భిణీలో సాధారణంగా కనిపించే మార్పులు. అయితే ఇవన్నీ కామన్ గా వచ్చే మార్పులు. మరి గర్భిణీగా ఉన్నప్పుడు ఈ మార్పులతోనే కాకుండా మరొకొన్ని ఇతర మార్పులు గర్భిణీ స్త్రీని ఇబ్బంది పెట్టి అసౌంకర్యానికి గురిచేస్తాయి. అలాంటివి చాలా సాధారణమైటువంటి.. ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ అనుభవం కలిగినటువంటి కొన్ని ప్రెగ్నెన్సీ ప్రాబ్లెమ్స్ ను మీరు తెలుసుకోవడానికి...కొన్ని

1. గ్యాస్ తో ఇబ్బంది పడటం: గర్భిణీగా ఉన్నప్పుడు ఎక్సెస్ గ్యాస్ తో ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. గర్భిణీగా ఉన్నప్పుడు హార్మోన్ లలో మార్పుల వల్ల జీర్ణవ్యవస్థ మందగించి తిన్న ఆహారం త్వరగా అరగనివ్వకుండా చేస్తుంది. దాంతో గర్భిణీ స్త్రీ చాలా ఇబ్బందికరంగా ఫీలవ్వడమే కాకుండా చాలా సార్లు కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఈ సమస్యను నిర్మూలించడానికి కొన్ని ఆహార నియమాలు పాటించాలి మరియు రెగ్యులర్ గా వ్యాయమం చేస్తే ఫలితం ఉంటుంది. ప్రతి రోజూ చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. దాంతో గ్యాస్ట్రిక్ ప్రాబ్లెం నుండి బయట పడవచ్చు. మంచి ఆహారం తరచూ తీసుకోవాలి. ముఖ్యంగా గ్యాస్ ను ఉత్పత్తి చేసే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఉదా..కార్బొనేటెడ్ డ్రిక్స్, బీన్స్, కాలీఫ్లవర్, డ్రైఫ్రూట్స్, డైరీ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలి.

2. అసంకల్పిత మూత్రవిసర్జన: ప్రెగ్నెసీ సమస్యల్లో ఇది కూడా ఒకటి. తరచూ మూత్ర విసర్జనకు పోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి గట్టిగా నవ్వినప్పుడు కానీ లేదా దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ యూరిన్ లీక్ అయ్యి గర్భిణీ అసౌకర్యానికి గురిచేస్తుంది. యూరినరీ లీకేజ్ ప్రాబ్లెం కొద్దిగా ఉంటే పర్వాలేదు ఎక్కువగా ఉన్నప్పుడు అందుకు తగ్గ కేర్ తీసుకోవాలి. లోపల ధరించే ప్యాటీలు మందగా ఉన్న కాటన్ తో తయారు చేసినవైత సౌకర్యంగాను సురక్షితంగాను ఉంటాయి.

3. దుర్వాసన కలిగిఉండటం లేదా ఫీల్ అవ్వడం:గర్భిణీగా ఉన్నప్పుడు వాసన పీల్చడం చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటప్పుడ కొన్ని వాసనలు చూడగానే ఇష్టం లేక చాలా ఇబ్బందిగా ఫీలవ్వల్సి ఉంటుంది. మరికొంత మందికి బాడీ ఫెర్ఫ్యూమ్స్ అస్సలు ఇష్టం ఉండదు. మరికొందరిక పౌల్టీ ఫామ్ ఫుడ్స్, సీ ఫుడ్స్ అస్సలు ఇష్టపడరు. ఒక్కొ సందర్భంలో యోని స్రావాల నుండి కూడా దుర్వాసన పట్టని వారు డాక్టర్ కు చూపించి యాంటీ ఫంగల్ మెడిసిన్ ను తీసుకోవాల్సి ఉంటుంది.

4. హెయిర్ గ్రోత్: గర్భిణీగా ఉన్నప్పుడు అవాంచిత రోవాలు ఇబ్బంది పెడుతాయి. కొన్ని హార్మోనులలోని మార్పుల వల్ల అవాంచిత ప్రదేశాలు ముఖం, బ్రెస్ట్, ఉదరం ముందు బాగం వెనక భాగాల్లో కూడా హెయిర్ గ్రోత్ ఉంటుంది. అయితే డాక్టర్ లు లేజర్ ట్రీట్ మెంట్ తో గర్భాధారణ సమయం చర్మ ఇన్ఫెక్షన్ కు గురిఅవుతుందని చెబుతుంటారు. కాబట్టి అందుకు మంచి మార్గం వాక్సింగ్ లేదా ట్వీజింగ్ చేసుకోవచ్చు.

5. మెటిమలు మచ్చలు: గర్భాధరణ జరిగిన మూడవ నెలలో కొన్ని అదనపు హార్మోన్ల కారణంగా బ్లాక్ హెడ్స్, మొటిమలుచ చర్మంలో ఇన్ఫెక్షన్, మొటిమలు, జిడ్డు చర్మం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అందుకు డాక్టర్ సలహా మేరకు మొటిమలను మెడికేటెడ్ ఫేష్ వాష్ లను ఉపయోగించి దూరం చేసుకోవచ్చు.

6. హెమరాయిడ్స్: గర్భిణీ స్త్రీలు హెమరాయిడ్స తో ఇబ్బంది పడాల్సి వస్తుంది. హెమరాయిడ్స్ ను సరైన ఆహారం తీసుకోవడం వల్ల తగ్గించవచ్చు. ఆహారంలో ముఖ్యంగా ఫైబర్ కంటెంటె ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి.

7. సంబంధభాందవ్యాల సమస్యలు: గర్భం దాల్చిన స్త్రీలలో శారీరకంగా చాలా మార్పులు చోటు చేసుకుంటుంది. బరువు పెరుగుతుంది. దాంతో కొన్ని సార్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పుడు మీ జీవిత భాగస్వామికి తెలిజేసి. మీరు సౌకర్యంగా ఉన్నప్పుడు సన్నిహితంగా ఉండండి. ఇవన్నీ గర్భం దాల్చిన ప్రతి స్త్రీ ఏదో ఒక సందర్భంలో అనుభం కలిగి ఉంటుంది. కాబట్టి జీవన శైలి మార్చుకోవడం.. ఆహారపు అవాట్ల మార్పులతో వీటిని నుండి బయటపడవచ్చు...

- రాసిన వారు : లక్ష్మి పేరుమల్ల

ఆధారము: తెలుగు బోల్డ్ స్కై

మీ శిశువుకు పాలు లేవా! బొప్పాయి తినండి

బొప్పాయి కాయను కూరగా చేసి తినిపిస్తే తల్లుల్లో స్తన్యము వృద్ధి చెందుతుంది. పిల్లల పోషణకు ఇతర జంతువుల పాలకన్నా తల్లి పాలే మిన్న. పాలు ఎక్కువ పోషక అంశాలతో కూడి అందరికి హితమైన సంపూర్ణ ఆహారం. నిమ్మపండు చర్మ రోగములను తగ్గించును. ఆహారంలో రాత్రిపూట పెరుగు సేవించుట నిషిద్ధం. గర్భిణీ స్త్రీలు బొప్పాయి కాయను తినరాదు.

బొప్పాయి

బొప్పాయి : బొప్పాయి పైత్య దోషాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని కలిగిస్తుంది. స్తన్యవృద్ధిని చేస్తుంది. బొప్పాయి కాయను కూరగా చేసి తినిపిస్తే తల్లుల్లో స్తన్యము వృద్ధి చెందుతుంది. హృదయానికి మంచిది. ఋతుస్రావాన్ని కలిగిస్తుంది, కాబట్టి గర్భిణీ స్త్రీలు ఈ ఫలాన్ని కూడా తినరాదు.

నిమ్మపండు

నిమ్మపండు : ఆకలి పుట్టించును, కడుపు నొప్పి తగ్గించును, అరుచిని పోగొట్టును, గర్భిణులకు కలుగు వాంతులను తగ్గించును, ఉత్సాహమును కలిగించును. ఇందు ఉన్న విటమిన్ సి వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగును. నిమ్మపండు జలుబును తగ్గించును, చర్మ రోగములను తగ్గించును, జ్వరములలో కలుగు అరుచి, వికారములను తగ్గించును.

నేరేడు

నేరేడు : గ్రాహిగుణము కలిగి ఉండును. మలబంధము చేయును. వగరు రుచి కలిగి ఉండును. జీర్ణకారి. మధుమేహం తగ్గించును. రక్త దోషములను పోగొడుతుంది.

సీతాఫలం

సీతాఫలం : చలువ చేస్తుంది. బలం కలిగిస్తుంది. రక్తస్రావం అరికడుతుంది. మూత్ర రోగాలను తగ్గించును. ఎక్కువగా వాడినచో అతిమూత్రవ్యాధి కలుగును. విరేచనకారి. ఋతుస్రావాన్ని కలిగిస్తుంది, కాబట్టి గర్భిణీ స్త్రీలు ఈ ఫలాన్ని తినరాదు.

జామపండు

జామపండు : జామ కఫవృద్ధి , వాతవృద్ధి చేస్తుంది. బలం కలిగించును. శుక్రవ్రుద్ధిని కలిగించును. ముదురు జామపండ్లు అజీర్ణం కలిగించును.

ఈ విధంగా ఆయా ఋతువులలో లభించే ఫలాలను సేవించుట వలన ఆయా ఋతువులలో వచ్చు రోగములను అరికట్టవచ్చును.

పాలు

పాలు : పాలు వివిధ జంతువుల నుండి స్తన్యముగా లభించును. పిల్లల పోషణకు ఇతర జంతువుల పాలకన్నా తల్లి పాలే మిన్న. తల్లి పాలు అన్ని పోషక విలువలు కలిగి అమృతంతో సమానమైనది. ఆవు పాలు, మేక పాలు మనుష్యులకు మంచిది. గేదె పాలు అత్యంత మందముగా ఉండును. పాలు ఎక్కువ పోషక అంశాలతో కూడి అందరికి హితమైన సంపూర్ణ ఆహారం.

పెరుగు

పెరుగు : ఆవు పెరుగు శ్రేష్ఠం. బలకరం. ఆకలిని, జీర్ణశక్తిని పెంచును. పుష్టిని కలిగించును. గేదె పెరుగు కఫాన్ని కలిగించి, జలుబు, దగ్గులకు కారణమవుతుంది. తేలికగా జీర్ణం కాదు. రక్త దోషాన్ని కలిగిస్తుంది. ఆహారంలో రాత్రిపూట పెరుగు సేవించుట నిషిద్ధం. పెరుగు అనేక వ్యాధులందు నిషిద్ధమయినది. పెరుగును మజ్జిగగా చేసి వాడవలయును.

ఆధారము: లోకహితం.నెట్

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate