ఈ కింది ఇవ్వ బడిన విషయాలు ద్వారా మీరు పోర్టల్ ను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి వినియోగపడతాయి.
ఈ పోర్టల్ లోని విభాగములు
ఈ పోర్టల్ లో ఆరు మఖ్య మైన విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. అవి వ్యవసాయసమీక్ష పట్టికను చూడటానికి, ఆరోగ్య, విద్య, ఇ –పరిపాలన, సామాజిక సంక్షేమం మరియు శక్తి వనరులు. ప్రతి విభాగానికి సంబంధించిన క్లుప్తమైన సమాచారాన్ని అందిస్తుంది.
విభాగం
వ్యవసాయం
ఈ వ్యవసాయ విభాగం వ్యవసాయ ఋణాలు, పథకాలు మరియు ప్రణాళికలు, , ఉత్పత్తి పరమైన సాంకేతిక పరిజ్ఞానం, పశుపోషణ, చేపల ఉత్పత్తి, వాతావరణం మరియు బజారు సమాచారం, ఉత్తమ విధానాలు, పనిచేస్తున్న, మూసివేసిన వ్యవసాయ సహకార సంస్థల మరియు వివిధ వ్యవసాయ సంస్థల వివరాలను తెలియజేస్తుంది.
ఆరోగ్యము
ఆరోగ్య విభాగం మహిళలు మరియు శిశు ఆరోగ్యంతో పాటు పారిశుద్ధ్యం, సాధారణ వ్యాధులు, పథకాలు మరియు విధానములు , ప్రథమ చికిత్స మరియు మానసిక ఆరోగ్యం వంటి అనేక ఇతర విషయాల పైన దృష్టి పెడుతుంది.
విద్య
ఈ విద్యా విభాగం పిల్లలు, ఉపాధ్యాయులకు, బాలల హక్కులు మరియు నాణ్యమైన విద్య లోని అనేక అంశాలను కలుపుకొని కావలసిన అభ్యసన వనరులను అందిస్తుంది.
ఇ – పాలన
ఈ ఇ – పాలన విభాగం ఆన్ లైన్ పౌరసేవలు, రాష్ట్రం ప్రత్యేకంగా అందిస్తున్న ఇ – పరిపాలన సేవలు , మొబైల్ పాలన, సమాచార హక్కు మొదలైన వాటి సమాచారాన్ని ఒకేచోట అందజేస్తుంది.
సామాజిక సంక్షేమం
ఈ సామాజిక సంక్షేమ విభాగం మహిళా, శిశు అభివృద్ధి, షెఢ్యూల్ కులాలు మరియు తెగల సంక్షేమం, అల్పసంఖ్యాక వర్గాల, వికలాంగుల, వృద్ధుల సంక్షేమం, పేదరిక నిర్మూలన మరియు విపత్తు నిర్వహణలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది.
శక్తి వనరులు
ఈ శక్తి వనరుల విభాగం సాంకేతికత, ఉత్తమ విధానాలను, పథకాలు మరియు విధానములు, ఇంధన పరిరక్షణ, మెరుగైన ఇంధన వినియోగం, శక్తి ఉత్పత్తి, పునరుత్పాదక శక్తి వనరులకు సంబంధించిన వివిధ సంస్థల సమాచారాన్ని అందిస్తుంది.
అన్ లైన్ సేవలు
ఈ - వ్యాపార్
ఈ అన్ లైన్ కొనుగోలుదారుల-అమ్మకందారుల వేదిక మీ ఉత్పత్తులకు మరియు సేవలకు మంచి మార్కెట్ ను సంపాదించుకునే అవకాశాన్ని కలుగజేస్తుంది. మీరు వ్యవసాయం, పశుసంపద, హస్తకళాకృతులు, యంత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు మొదలగు ఏ ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్నైనా సరే ప్రదర్శించండి. అంతేకాకుండా, అద్దె మరియు సంప్రదింపు (కన్సల్టెన్సీ) సేవలకు సంబంధించిన సమాచారాన్ని కూడా మీరు పొందవచ్చు.
ఒక నిపుణుని అడగండి
ఎంచుకొనబడిన విషయాలపై ఈ ఆన్ లైన్ వేదిక నిపుణులిచ్చే పరిష్కారాలను చూపిస్తుంది. వారి స్వంత భాషలోనే వాడకందారులు వారి సందేహాలను నివేదించుకోవచ్చు (పోస్ట్ చేయవచ్చు). అలాగే, ఇ-మెయిల్ ద్వారా వారి సందేహాలకు నిపుణులిచ్చే పరిష్కారాలను పొందవచ్చు.
జనరల్ నాలెడ్జ్ క్విజ్
ఈ క్విజ్ (ఆన్ లైన్ ప్రశ్నలు-జవాబుల పోటీ) పాఠశాలలో చదివే పిల్లలు వారి సాధారణ పరిజ్ఞానాన్ని పరీక్షించుకునేలా ప్రోత్సహించడానికి, అలాగే వారి సమర్ధతను మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికీ ఉద్దేశింపబడింది. ఈ క్విజ్ కార్యక్రమంలో 3 నుండి 10వ తరగతి వరకూ చదువుకునే పిల్లలు పాల్గొనవచ్చు.
రికాలర్
ఎస్.ఎమ్.ఎస్. లేక ఇ-మెయిల్ ద్వారా ఈ వెబ్ ఆధారిత సేవ నమోదుచేసుకున్న వాడకందారులకు ప్రధానమైన ఆర్దిక కార్యకలాపాలను గుర్తు చేస్తూ, ప్రజలు తమ ఆర్ధిక కార్యకలాపాలను మరింత సమర్ధవంతమైన విధంగా నిర్వహించుకునేందుకు తోడ్పడుతుంది.
వి.ఎల్.ఇ. కార్నర్
దేశవ్యాప్తంగా ఉండే ఉమ్మడి సేవా కేంద్రాల(కామన్ సర్వీస్ సెంటర్స్)ను నిర్వహించే గ్రామ స్ధాయి ప4రిశ్రామివేత్తలకు ఉపయోగకరమైన సాధన సామగ్రిని ఈ వేదిక సమకూరుస్తుంది. అలాగే, గ్రా.స్ధా.పా. లకు వారి అనుభవాలను పంచుకోవడానికి కూడా అవకాశాన్ని కలుగజేస్తుంది.
ఇ-లెర్నింగ్ కోర్సులు
మహిళలు, పిల్లలు, యువత మరియు, గ్రామీణ పట్టణ మరియు గిరిజన ప్రాంతాల్లో ఇతర అన్ నిమ్న మరియు అసహాయ స్ధితిలో ఉన్నవారు కోసం విజ్ఞానం మరియు నైపుణ్యాల నిర్మించడానికి, సి-డాక్ భారతీయ భాషల్లో ఇ లెర్నింగ్ వేదిక అనుకూలీకరించిన ఉంది.
మొబైల్ ఆధారిత మాతృత్వ ఆరోగ్య అవగాహన- మధర్
గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు , ఒకటిన్నర సంవత్సరం లోపు పిల్లలకు ఆరోగ్య జాగ్రత్తలు సలహాలు అందిస్తుంది.నమోదు చేసుకున్నలబ్దిదారులకు వారి మొబైల్ ఫోన్ ద్వారా వారి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా పాటించ వలిసిన సలహాలను తెలియచేయడం జరుగుతుంది
ఇ-లెర్నింగ్ కోర్సులు
నేర్చుకోవడానికి ఉపయోగపడే వనరులు
మహిళలు, పిల్లలు, యువత మరియు, గ్రామీణ పట్టణ మరియు గిరిజన ప్రాంతాల్లో ఇతర అన్ నిమ్న మరియు అసహాయ స్ధితిలో ఉన్నవారు కోసం విజ్ఞానం మరియు నైపుణ్యాల నిర్మించడానికి, సి-డాక్ భారతీయ భాషల్లో ఇ లెర్నింగ్ వేదిక అనుకూలీకరించిన ఉంది.
శిశు సంరక్షక్
యు ని సెఫ్ పరిశోధన తయారుచేసిన ఈ అధ్యయన పదార్థం గర్భం, పుట్టిన దశ, బాల్యంలో, బాల్యంలో మరియు పిల్లలు వెళుతున్న పాఠశాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు సమాచారాన్ని అందిస్తుంది.
ఐ.టి.లో ప్రాధమిక అంశాలు విజ్ఞాన కేంద్రాల ఆపరేటర్ల కోసం శిక్షణా మాన్యువల్
ఐటి ప్రాధమిక అంశాలు పైన పుస్తకములు కొరకు ఈ పుస్తకము లో క్లుప్తంగా సమాచారము ఇవ్వటం జరిగినది.
హార్డ్ వేర్ ట్రబుల్ షూటింగ్ (ప్రాధమిక ఇబ్బందులను తొలగించడం) కోసం శిక్షణా మాన్యువల్
ఈ మాన్యువల్ లో హార్డ్ వేర్ ప్రాధమిక ఇబ్బందులను తొలగించడం గురించి క్లుప్తంగా సమాచారము ఇవ్వటం జరిగినది.
మల్టీ మీడియా (బహుళ మాధ్యమాల) ఉత్పత్తులు
పోషకాహారం, ఆరోగ్యం
భారతీయ వైద్య పరిశోధనా సంస్ధ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్- ఐ.సి.ఎమ్.ఆర్) క్రింద పనిచేస్తూ ఉండే ఒక ప్రముఖ పరిశోధనా సంస్ధ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (జాతీయ పోషకాహార సంస్ధ) వారి సహకారంతో ఈ సమగ్ర బహు-భాషల సి.డి. రూపొందించబడింది. ఈ సి.డి.లోని సమాచారాన్ని నాలుగు కీలకమైన శీర్షికలుగా పేర్కొనడం జరిగింది. అవిః మీ ఆహరాన్ని గురించి తెలుసుకోండి; పోషకాహారాల అవసరాలు, అవి లభించే పదార్ధాలు; ఆహారం-వ్యాధులు మరియు ఆహార భధ్రత అనేవి. సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు, పారా మెడికల్ సిబ్బందికి (వైద్యులకు సహాయపడడంలో శిక్షణపొందిన వారికి), విద్యార్ధులకు, గృహిణులకు ఇంకా తాము తీసుకుంటున్న ఆహారాన్ని గురించి, అలాగే ఆరోగ్యవంతమైన జీవనశైలిని కొనసాగించడంలో దాని పాత్రను గురించి తెలుసుకోవాలనే కుతూహలం గలవారికి ఇది ఉపకరిస్తుంది.
ఔషధీయ, సుగంధభరిత మరియు రంగుల అద్దకానికి ఉపయోగపడే పంటల ఉత్పత్తి
వాణిజ్యపరంగా ప్రాధాన్యం గల 54 ఔషధ పంటలు, సుగంధభరిత పంటలు మరియు రంగులు అద్దడానికి ఉపయోగపడే పంటల ఉత్పత్తిని గురించి, ఉత్పత్తులను గురించి మరియు మార్కెటింగ్ విధానంపై కూడా సమగ్ర సమాచారంతో స్ధానిక భాషలలో ఈ సి.డి.లో ప్రశ్నలు, జవాబుల రూపంలో పొందుపరచబడింది. ఈ ఉత్పత్తి హిందీ, తెలుగు, తమిళం, ఇంగ్లీషు భాషలలో .
కాలువ చివర భూములలో వరిసాగులో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించుకోవడానికి మార్గదర్శకాలు
తమిళనాడు లోని మధురైకి చెందిన సి.సి.డి. సంస్ధతో కలసి, బహుళ భాషలలో ఈ సి.డి. ని ఆవిష్కరించడం జరిగింది. విపత్తుల ప్రభావాన్ని తగ్గించడం అనే మౌలికమైన, ప్రధానావసరాన్ని గుర్తించి, ఇటునంటి సమస్యను అధిగమించడానికి అనుసరించవలసిన 4 సూత్రాల వ్యూహాన్ని గురించి ఈ సి.డి. విశదీకరిస్తుంది. తమిళ నాడులోని కావేరి డెల్టా (మైదాన ప్రాంతం) లో, సునామీ భాధిత రైతుల సహభాగస్వామ్యంతో, నాలుగు సంవత్సరాలకు పైగా నిర్వహించబడిన ప్రయోగఫలితంగా, ఈ సి.డి. రూపుదిద్దుకుంది. ఈ వ్యూహాలను అమలుచేయడంలో ఉపకరించే విధానాలను, పధ్దతులను గురించిన సంగ్రహ సమాచారాన్ని కూడా ఈ సి.డి. అందిస్తుంది. ఈ బహు భాషా (మల్టీ మీడియా) సి..డి. స్వయంగా నేర్చుకొనగలిగే సాధనంగా ఉపయోగపడటమే కాక, క్షేత్రస్ధాయి అభివృధ్ది కార్యకర్తలకు, పరిశోధకులకు మరియు విస్తరణను చేపట్టే అధికారులకు కూడా ఒక శిక్షణా కరదీపికగా కూడా ఉపకరిస్తుంది.ఈ సి.డి లభ్యమయ్యే భాషలు తమిళం మరియు ఇంగ్లీషు
సుస్ధిరమైన వ్యవసాయం
పంటపొలాలలో తీసిన అనేక వీడియో చిత్రాలతో, మరెన్నో ఫోటోలతో స్పష్టమైన విషయ వివరణకు మరింతగా తోడ్పడుతూ, సుస్ధిర వ్యవసాయోత్పత్తికి అనుసరించవలసిన పధ్దతులను గురించిన సమాచారాన్ని ఈ సి.డి. సవివరంగా అందిస్తుంది. రైతులకు, స్వఛ్చంద సేవా సంస్ధలకు (ఎన్.జి.ఓ) ఈ సి.డి. ఎంతగానో ఉపకరిస్తుంది. హైదరాబాద్ కు చెందిన సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ మరియు సెర్ప్ (ఎస్.ఇ.ఆర్.పి) సంస్దలు ఈ సమాచారాన్ని సమకూర్చాయి.
శోధన సౌకర్యాన్ని ఉపయోగించడడం
శోధన కార్యాచరణ
ఈ శోధన కార్యాచరణ వినియోగదారులకు కావలసిన విషయానికి త్వరగా చేరుకోవడానికి సహాయపడుతుంది. ఇది పోర్టల్ లోని ప్రతి ఒక్క అంశానికి అందుబాటులో ఉంది. ఈ సౌకర్యం పోర్టల్ లోని అంశాలకు మాత్రమే ఉపయోగపడుతుంది. అంతర్జాలాన్ని శోధన చేయడానికి సహాయపడదు.
ఈ పోర్టల్ లోని కార్యాచరణ వినియోగదారులను కింది వాటిని ఉపయోగించి శోధించడానికి అనుమతిస్తుంది:
ప్రత్యేకమైన అక్షరాలు లేదా పదం / వాక్యభాగం .
పదాలు పదబంధాల మధ్య ఖాళీలు
పదాలతో కూడిన కారకాలు (మరియు, లేదా వంటివి) .
ప్రత్యక్ష శోధన
ప్రత్యక్ష శోధన కార్యాచరణ పోర్టల్ లో శోధన శక్తిని మెరుగుపరుస్తుంది. శోధన గడిలో అక్షరాలు టైప్ చేస్తున్నప్పుడు మొత్తం శోధన సులభతరం చేయబడి శోధన దృశ్య గడిలో సరిపడిన వాటన్నింటిని సమర్పిస్తుంది. ఈ ప్రత్యక్ష శోధన, శోధనను చాలా వేగంగా మరియు మరింత సమర్థవంతంగా విషయాన్ని కనుగొనేలా చేస్తుంది
పోర్టల్ ను ఉపయోగించుకోవడం
ఈ పోర్టల్ లో ఉన్నా అది సమాచారం, చిత్రాలు, ఫైళ్లు మరియు ఏ ఇతర డేటా అయినా విషయ నిపుణులు ద్వారా స్వచ్ఛందంగా అందజేయబడినది. ఈ పోర్టల్ 4 భిన్న రకాల వినియోగదారులకు ఉపకరిస్తుంది:
సాధారణ సభ్యులు
నమోదు సభ్యులు
విషయ రచన భాగస్వామి
విషయ రచన సమీక్షకుడు
ఈ క్రింది విభాగాలలో ప్రతి రకం వినియోగదారు యొక్క అధికారాలను సంక్షిప్తంగా వివరించ బడినవి:
సాధారణ సభ్యులు
ఒక సాధారణ సభ్యునిగా మీరు
పేజీ లో ఉన్న కంటెంట్ వీక్షించవచ్చు
పేజీ లో ఉన్న కంటెంట్ను శోధించవచ్చు
పేజీ లో ఉన్న కంటెంట్ను ఇ-మెయిల్ / సామాజిక మాధ్యమం ద్వారా చేర వేయడం
పేజీకి రేటింగ్
పేజీ చివరివరకు( కిందికి) వెళ్ళండి
రేటింగ్ చేయుటకు చూపించిన నక్షత్రముల పైన క్లిక్ చేయండి
పేజకి కావలసిన సూచనలు / వ్యాఖ్యానాలను అందజేయండి
పేజీ చివరివరకు( కిందికి) వెళ్ళండి
‘ మీ సూచనలు పేర్కొనండి’ విభాగంలో మీ పేరు మరియు సూచనలను ఎంటర్ చేయండి
“ సమర్పించండి” పై క్లిక్ చేయండి
అభిప్రాయ సేకరణ
హోమ్ పేజిలోని “అభిప్రాయ సేకరణ” పై క్లిక్ చేయండి.
మీకు ఇష్టమైన అభిప్రాయం పై క్లిక్ చేసి “అభిప్రాయ ప్రకటన” చేయండి
ఇంతకు ముందు నిర్వహించిన ఎన్నికలను చూచుటకు “మునుపటి పోల్స్ ” పై క్లిక్ చేయండి.
వార్తా పత్రికకు చందాదారులుగా చేరండి
హోమ్ పేజిలోని “వార్తా పత్రికకు చందాదారులుగా చేరండి” పై క్లిక్ చేయండి
మీ ఇ-మెయిల్ ఐడి ని ఎంటర్ చేసి ‘సమర్పించండి’
మీ అభిప్రాయాన్ని తెలియచేయండి
హోమ్ పేజిలోని “ మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ” పై క్లిక్ చేయండి
మీ ‘పేరు’, ఇ-మెయిల్ ఐడి మరియు సందేశం ని ఎంటర్ చేయండి.
‘సమర్పించండి’ పైన క్లిక్ చేయండి
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్ నకు చందాదారులుగా చేరండి
పేజీ చివరివరకు( కిందికి) వెళ్ళండి
ఐకాన్ పైన క్లిక్ చేయండి
తక్షణ తాజామార్పులకై ఏదైనా విభాగానికి చందాదారులుగా చేరండి
నమోదు సభ్యులు గా లేదా విషయ రచన భాగస్వామి గా వుండుటకు
కుడిచేతి పై మూలలో వున్న ‘నమోదు’ పై క్లిక్ చేయండి
నమోదు సభ్యులు లేదా విషయ రచన భాగస్వామి నండి కావలసిన ఒక దానిని ఎంపిక చేసుకోండి
వివరాలను నింపండి
‘నమోదు’పైక్లిక్చేయండి
నమోదైన సభ్యుడు
నమోదైన సభ్యుడుగా మీకు సాధారణ వినియోగదారుకు గల అన్ని అధికారాలు కలిగివుంటారు. దానికి అదనంగా మీరు,
మీ తాజా వివరాలను పొందుపరుచుకొనుటకు
పై కుడి చివరన చూపబడిన మీ వాడుక పేరు పైన క్లిక్ చేయండి
కిందికి విస్తరించబడిన పట్టిక నుండి ‘వివరములు’ పైన క్లిక్ చేయండి
చూపబడిన మీ వివరములలో కావలసిన మార్పులు చేయండి
మీ డాష్ బోర్డును అనుగుణంగా మార్చుకొండి
పై కుడి చివరన చూపబడిన మీ వాడుక పేరు పైన క్లిక్ చేయండి
కిందికి విస్తరించబడిన పట్టిక నుండి ‘డాష్ బోర్డు’ పైన క్లిక్ చేయండి
ఈ వీడియో లో కంటెంట్ కంట్రిబ్యూటర్ గా నమోదు చేసుకొనేందుకు దశల వారీగా అనుసరించు విధానం వివరించటం జరిగింది.
విషయ రచన భాగస్వామిగా మీకు నమోదైన సభ్యునకు గల అన్ని అధికారాలు కలిగివుంటారు. దానికి అదనంగా మీరు :
విషయ రచన పేజీలను జతచేయవచ్చు
మీరు విషయ సమకూర్పుదారుగా అంగీకరించబడిన క్షేత్రంలో ఒక కొత్త పేజీ ను జతచేయవచ్చు
మీరు జతచేయవలసిన కొత్త పేజీ కు సంబంధించిన సూచన పట్టికలో అందుబాటులోని ‘కొత్తగా జతచేయండి’ పై దయచేసి క్లిక్ చేయండి
పేజీ కు సంబంధించిన శీర్షిక, సారాంశాలను ఎంటర్ చేసి, ‘విషయ సంబంధ స్థలము’ లో విషయాన్ని ఎంటర్ చేయండి
‘భద్రపరచు’ పైన క్లిక్ చేయండి
విషయ పేజీలును సవరణ చేయండి
మీరు విషయ సమకూర్పుదారుగా అంగీకరించబడిన విభాగంంలోని పేజీలలో సవరణ చేయవచ్చు దయచేసి పేజ పై కుడివైపు మూలన వున్న “గ్రీన్ బ్యాండ్” లో పేజ స్థితిని సరిచూసుకొండి. మీరు ‘కూర్పుచేయుటకు కలదు’ లేదా ‘సమీక్ష జరుగుచున్నది’ అనే స్థితిలో వున్న పేజలను మాత్రమే సవరణ చేయగలరు
‘కూర్పు’ పైన క్లిక్ చేయండి, కూర్పు విండో చూపబడుతుంది.కావలసినమార్పులుచేయండి
‘భద్రపరచు’పైనక్లిక్చేయండి
విషయ రచన సమీక్షకుడు
విషయ రచన సమీక్షకుడుగా మీకు విషయ రచన భాగస్వామికి గల అన్ని అధికారాలు కలిగివుంటారు. దానికి అదనంగా మీకు ఈ క్రింది అధికారాలు కూడా కలిగివుంటారు : ఇటీవలి అంశాలను చూడడానికి
ఇటీవలి అంశాలను చూడడానికి
పై కుడి చివరన చూపబడిన మీ వాడుక పేరు పైన క్లిక్ చేయండి
కిందికి విస్తరించబడిన పట్టిక నుండి ‘ఇటీవలి అంశాలు’ పైన క్లిక్ చేయండి
మార్పు చెందబడిన అన్ని పేజీ పట్టిక వుంచబడింది.
సమీక్ష పట్టికను చూడటానికి
పై కుడి చివరన చూపబడిన మీ వాడుక పేరు పైన క్లిక్ చేయండి
కిందికి విస్తరించబడిన పట్టిక నుండి ‘సమీక్ష పట్టిక’ పైన క్లిక్ చేయండి
సమీక్షకు అవసరమున్న అన్ని మార్పు చెందబడిన పేజీలు వుంచబడ్డాయి.
విషయ సమీక్ష / సవరణ చేయవలసిన పేజీ
మీరు “విషయ సమీక్షకులు” గా అంగీకరించబడిన విభాగంలోని పేజీలను సమీక్షించవచ్చు
ఒక పేజీలో చేయబడిన మార్పుల చరిత్ర కొరకు ‘చరిత్ర (కూర్పు)’ పై క్లిక్ చేయండి
చేయబడిన మార్పులను సమీక్షించండి
‘సమీక్ష తేది’ పై క్లిక్ చేయండి
సమీక్ష తేదీని జతచేయండి
అన్ని మార్పులనూ సమీక్షించినట్లయితే, దాని స్థితిని ‘ప్రకటించు’ లేదా “ సమీక్షించండి మరియు ‘భద్రపరచు’ పై క్లిక్ చేయండి” కి మార్చండి