హోమ్ / వార్తలు / 1969 నెంబర్‌కు మిస్డ్‌ కాల్‌..!
పంచుకోండి

1969 నెంబర్‌కు మిస్డ్‌ కాల్‌..!

1969 నెంబర్‌కు మిస్డ్‌ కాల్‌..!

పరిశుభ్రత, పారి శుధ్య నిర్వహణలో నగరాల స్థాయిని నిర్ణయించే స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వే ప్రారంభమైంది. ఈ నెల 4వ తేదీ నుంచి ఫిబ్రవరి 4 వరకు జరిగే సర్వేలో భాగంగా క్వాలిటీ కంట్రో ల్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధి బృందం దేశంలోని ఎంపిక చే సిన నగరాల్లో పర్యటించనుంది. ఈ క్రమంలో అక్కడి ప్రజ లను నేరుగా, ఫోన్‌లో, వెబ్‌సె ౖట్‌ ద్వారా పౌరుల అభిప్రాయాలు సేకరిస్తారు. వచ్చే నెల 2, 3, 4 తేదీల్లో నగరంలో స్వచ్ఛ బృందం పర్యటించనుంది. సర్వేలో మొత్తం 2వేల మార్కులకుగాను 900.. కేంద్ర ము న్సిపల్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు సాంకేతి క విధానాలను పరిశీలించి కేటాయిస్తారు. 500 మార్కుల ను ప్రత్యక్షంగా గమనించిన అంశాలకు, 450 మార్కులను ఫోన్‌లో సేకరించిన అభిప్రాయాలకు, 150 మార్కులు యా ప్‌ల ద్వారా వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి కేటాయిస్తారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరాన్ని ముందుంచేందుకు సర్వేలో పా ల్గొనాలని కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ఇలా చేయండి
1969టోల్‌ ఫ్రీ నెంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇవ్వాలి. వెంటనే స్వచ్ఛ సర్వేక్షణ్‌ నుంచి కాల్‌ వస్తుంది. స్వచ్ఛ భారతపై ప్రముఖ నటుడు అమితాబ్‌బచ్చన్‌ సందేశం ఉంటుంది. తెలుగు భాషకు 1, ఇంగ్లీష్‌ కోసం 2ను ప్రెస్‌ చేయాలి. మీ నగరం పిన్‌ కోడ్‌ అడుగుతారు. హై దరాబాద్‌కు 500001 నెంబర్‌ ఎంటర్‌ చేయాలి.
ఆ ఆరు ప్రశ్నలు
  • మీ నగరం స్వచ్ఛ సర్వేక్షణ్‌-2017లో పాల్గొంటున్న విషయం మీకు తెలుసా...?
  • గత సంవత్సరంతో పోలిస్తే మీ ప్రాంతం పరిశుభ్రంగా ఉందా..?
  • మార్కెట్‌ ప్రాంతాల్లో మీరు డస్ట్‌బిన్లు గుర్తించారా..?
  • ఈ సంవత్సరం ఇంటింటి నుంచి చెత్త సేకరణ మెరుగయ్యిందా..?
  • ప్రస్తుతం పబ్లిక్‌/కమ్యూనిటీ టాయిలెట్లు నగరవా సులకు అందుబాటులో ఉన్నాయా..?
  • పబ్లిక్‌/కమ్యూనిటీ టాయిలెట్లలో నీరు, ఫ్లషింగ్‌, లైటింగ్‌, వాషింగ్‌ సౌకర్యాలున్నట్టు గమనించారా..?

ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు