హోమ్ / వార్తలు / ‘బీపీఎస్’ ఉత్తర్వుల సవరణ
పంచుకోండి

‘బీపీఎస్’ ఉత్తర్వుల సవరణ

‘బీపీఎస్’ ఉత్తర్వుల సవరణ

అక్రమ నిర్మాణాల క్రమబద్ధీరణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్) విషయంలో గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు మంగళవారం సవరించింది. బీపీఎస్ కింద వచ్చిన దరఖాస్తుల్లో క్రమబద్ధీకరణకు అర్హత లేని దరఖాస్తులను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని గ్రేటర్ హైదరాబాద్, ఇతర మునిసిపల్ కార్పొరేషన్లను ఆదేశించింది. దరఖాస్తుల తిరస్కరణ ఉత్తర్వులను ఆయా దరఖాస్తుదారులకు అందజే శాక, సదరు అక్రమ నిర్మాణాల విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది.
అర్హత ఉన్న ట్లు తేలిన దరఖాస్తుల విషయంలో ఈ వ్యాజ్యాలు తేలేంత వరకు ఎలాం టి ఉత్తర్వులూ జారీ చేయకుండా పక్కన పెట్టాలని అధికారులకు సూచించింది. దీనిపై పూర్తి వివరాల తో కౌంటర్లు దాఖలు చేయాలని గ్రేటర్, ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణల తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులి చ్చింది.

అక్రమ నిర్మాణాల క్రమబద్ధీరణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్) విషయంలో గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు మంగళవారం సవరించింది. బీపీఎస్ కింద వచ్చిన దరఖాస్తుల్లో క్రమబద్ధీకరణకు అర్హత లేని దరఖాస్తులను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని గ్రేటర్ హైదరాబాద్, ఇతర మునిసిపల్ కార్పొరేషన్లను ఆదేశించింది. దరఖాస్తుల తిరస్కరణ ఉత్తర్వులను ఆయా దరఖాస్తుదారులకు అందజే శాక, సదరు అక్రమ నిర్మాణాల విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది.అర్హత ఉన్న ట్లు తేలిన దరఖాస్తుల విషయంలో ఈ వ్యాజ్యాలు తేలేంత వరకు ఎలాం టి ఉత్తర్వులూ జారీ చేయకుండా పక్కన పెట్టాలని అధికారులకు సూచించింది. దీనిపై పూర్తి వివరాల తో కౌంటర్లు దాఖలు చేయాలని గ్రేటర్, ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణల తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులి చ్చింది.

ఆధారం: సాక్షి

పైకి వెళ్ళుటకు