హోమ్ / వార్తలు / 24 గంటల్లో తాగునీటి సమస్య పరిష్కారం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: Review in Process

24 గంటల్లో తాగునీటి సమస్య పరిష్కారం

24 గంటల్లో తాగునీటి సమస్య పరిష్కారం

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా తాగునీటి సమస్యలు వస్తే 24 గంటల్లోపు పరిష్కరిస్తామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పష్టంచేశారు. గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈలదేనని అన్నారు. అన్ని జిల్లాల పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్యూఎస్‌ అధికారులతో ఆయన శనివారం ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్న నేపథ్యంలో.. అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అవసరమైన చోట ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా బోర్లు పనిచేయకపోతే మరమ్మతులు చేయాలని సూచించారు. బోర్ల మరమ్మతులకు రూ.6 కోట్లు విడుదల చేశామన్నారు. ఎన్టీఆర్‌ సుజల పథకం ద్వారా గ్రామాల్లో ఏర్పాటుచేసిన ప్లాంట్లు అన్నీ పనిచేసేలా చూడాల్సిన బాధ్యత ఎస్‌ఈలదేనని స్పష్టంచేశారు. పశువుల కోసం తాగునీటి తొట్టెలను ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి సమస్యలు తీర్చేందుకు ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నెంబర్‌ 18004251899కు వచ్చే ఫిర్యాదులను 24 గంటల్లోగా పరిష్కరించేలా చూడాలని, రాబోయే మూడు నెలలు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు సమష్టిగా గ్రామస్థాయిలో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు. కర్నూలు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తానని అయ్యన్న పాత్రుడు తెలిపారు.

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు