దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌తోపాటు మరో నాలుగు రాష్ట్రాలకు వచ్చే ఏడాది ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. యూపీతోపాటు పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల శాసనసభలకు ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. యూపీలో ఏడు విడతల్లో, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఒకే విడత పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో యూపీ అసెంబ్లీ పదవీకాలం ముగియకముందే.. ముందస్తు ఎన్నికలు నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రస్తుత అసెంబ్లీ 2017 మే 27న ముగియనుండగా.. పంజాబ్, గోవా, మణిపూర్‌ల శాసనసభల గడువు మార్చి 18తో ముగియనుంది.
ఆధారం: ఆంధ్ర జ్యోతి