హోమ్ / వార్తలు / 8వేల గ్రామాల విద్యుదీకరణ లక్ష్యం
పంచుకోండి

8వేల గ్రామాల విద్యుదీకరణ లక్ష్యం

8వేల గ్రామాల విద్యుదీకరణ లక్ష్యం

ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలో 8,000లకు పైగా గ్రామాలకు విద్యుత్‌వెలుగులు రానున్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 8,360 గ్రామాల్లో విద్యుదీకరణ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. గురువారం లోక్‌సభలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రాల నివేదికల ప్రకారం.. 2015, ఏప్రిల్‌1 నాటికి దేశంలోని 18,452 గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం లేదని, గత జులై 31 నాటికి వాటిలో 9,126 గ్రామాలు ఇంకా విద్యుత్‌ సౌకర్యానికి నోచుకోలేదని ఆయన తెలిపారు.

ఆధారం : ఈనాడు

పైకి వెళ్ళుటకు