హోమ్ / వార్తలు / అమృత్‌ పథకానికి రూ.10.96 కోట్లు మంజూరు
పంచుకోండి

అమృత్‌ పథకానికి రూ.10.96 కోట్లు మంజూరు

అమృత్‌ పథకానికి రూ.10.96 కోట్లు మంజూరు

తెలంగాణలోని 11 పట్టణాల్లో అమృత్‌ పథకం కింద పచ్చదనం, ఉద్యాన వనాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.10.96 కోట్లకు పరిపాలనపరమైన అనుమతులిచ్చింది. ఇందులో వరంగల్‌కు రూ.1.33 కోట్లు, నల్గొండకు రూ.1.16 కోట్లు, మిర్యాలగూడకు రూ.64 లక్షలు, మహబూబ్‌నగర్‌, రామగుండం, సూర్యాపేటలకు రూ1.08 కోట్ల చొప్పున, ఖమ్మంకు రూ.91 లక్షలు, ఆదిలాబాద్‌కు రూ.1.10కోట్లు, నిజామాబాద్‌కు రూ.1.25 కోట్లు, కరీంనగర్‌కు రూ.69 లక్షలు, సిద్ధిపేటకు రూ.64 లక్షలు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు