హోమ్ / వార్తలు / ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2014 లోని నిబంధనల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ. 450 కోట్ల కేంద్ర సహాయం విడుదల
పంచుకోండి

ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2014 లోని నిబంధనల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ. 450 కోట్ల కేంద్ర సహాయం విడుదల

ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2014 లోని నిబంధనల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ. 450 కోట్ల కేంద్ర సహాయం విడుదల

తెలంగాణాలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడతామని ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా 2016-17సంవత్సరానికిగాను మరో రూ. 450 కోట్ల ప్రత్యేక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం సమకూర్చింది. విభజన అనంతరం ఏర్పడిన రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, అక్కడి భౌతిక మరియు సామాజిక మౌలిక సదుపాయాల విస్తరణ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2014 చెబుతోంది.తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణాలోని 9 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 2015-16 సంవత్సరంలో రూ. 450కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధుల తోడ్పాటును అందుకొంటున్న వెనుకబడిన జిల్లాలలో ఆదిలాబాద్,నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ మరియు ఖమ్మం జిల్లాలు ఉన్నాయి.ఈ ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు మొత్తం మీద రూ. 900 కోట్ల ను విడుదల చేసినట్లు అవుతుంది.

కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఈ అదనపు నిధులు రాష్ట్రంలో వెనుకబడినతనాన్ని తగ్గించేందుకు మరియు పేదరికాన్ని నివారించేందుకు ఉద్దేశించిన పథకాలను రూపొందించడానికి, వాటిని అమలుచేయడానికి రాష్ట్రానికి వీలు కల్పిస్తాయి. ఇందులో భాగంగా చేపట్టే ప్రగతిశీల కార్యకలాపాలు రాష్ట్రంలోని ఆయా జిల్లాలను మరింతగా అభివృద్ధి చెందిన జిల్లాలతో సమానంగా నిలుపగలుగుతాయి.

ఆధారం: పత్రికా సమాచార కార్యాలయం

పైకి వెళ్ళుటకు