హోమ్ / వార్తలు / ఆంధ్రప్రదేశ్ లో మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులకు ఆహ్వానం
పంచుకోండి

ఆంధ్రప్రదేశ్ లో మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులకు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ లో మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులకు ఆహ్వానం

పాత గుంటూరు, మారుతీ నగర్‌లోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో 5 నుంచి 9 వరకు తరగతుల్లో ప్రవేశానికి మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరారు. విద్యార్థినులు టీసీ తీసుకొచ్చిన వెంటనే ప్రవేశం పొందవచ్చని చెప్పారు. దూదే కుల, పింజారి, లడాఫ్‌, నూర్‌బాషా కులాలకు చెందిన విద్యార్థినులు కూడా ప్రవేశానికి అర్హులేనని తెలిపారు. ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ పేర్కొన్నారు. ఇతర వివరాలకు 0863-2264730, 7702774387 నంబర్లలో సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ కోరారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి


పైకి వెళ్ళుటకు