హోమ్ / వార్తలు / ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్‌ ఉపసంహరణ
పంచుకోండి

ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్‌ ఉపసంహరణ

ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్‌ ఉపసంహరణ

ఉద్యోగుల భవిష్యనిధి ఉపసంహరణతో పాటు, పింఛను ఖరారు సేవలను ఆన్‌లైన్‌లో అందించేందుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు వచ్చే మే నుంచి ఆ సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చే వీలుంది. దీంతో ఉద్యోగులకు మరింత ప్రయోజనం కలగనుంది. భవిష్యనిధి ఉపసంహరణ, పింఛను ఖరారు, ఉద్యోగుల సామూహిక బీమా ప్రయోజనాల చెల్లింపులకు సంబంధించి ఈపీఎ్‌ఫఓకు ఏటా దాదాపు కోటి దరఖాస్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సేవలను ఆన్‌లైన్‌లో అందించేందుకు ఈపీఎఫ్‌ఓ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలోని అన్ని కార్యాలయాలను కేంద్ర సర్వర్‌కు అనుసంధానం చేస్తున్నామని, దీని వల్ల వచ్చే మే నుంచి అన్ని దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని ఈపీఎఫ్‌ఓ కేంద్ర ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ వి.పి.జాయ్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌ ఉపసంహరణకు దరఖాస్తు దాఖలైన తర్వాత 20రోజుల వ్యవధిలో చెల్లింపు జరుగుతోంది. అదే ఆన్‌లైన్‌ విధానంలో కొన్ని గంటల్లోనే చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయాలని సంస్థ భావిస్తోంది.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు