హోమ్ / వార్తలు / ఆర్టీఏలో ఆన్‌లైన్‌ విధానం.. స్లాట్‌ బుకింగ్‌తో వస్తేనే లోపలికి
పంచుకోండి

ఆర్టీఏలో ఆన్‌లైన్‌ విధానం.. స్లాట్‌ బుకింగ్‌తో వస్తేనే లోపలికి

ఆర్టీఏలో ఆన్‌లైన్‌ విధానం.. స్లాట్‌ బుకింగ్‌తో వస్తేనే లోపలికి

రవాణాశాఖలో కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు రెం డు మూడు సేవలు ఆన్‌లైన్‌లో అందించిన రవాణా శాఖ.. ఇక నుంచి పూర్తి స్థాయిలో 59 రకాల సేవలు ఆన్‌లైన్‌ ద్వారానే అందించాలనే నిర్ణయించింది. ఆగస్టు 2 నుంచి ఈ విధానాన్ని అధికారికంగా అమలు చేస్తు న్నారు. జూలై 15న రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ రవాణా శాఖలో ఆటోమే టెడ్‌ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ (ఏఓఎస్‌)ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు ఈ-సేవ, మీ-సేవ కేంద్రాల సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణఇచ్చారు. గ్రేటర్‌ పరిధిలోని ఆర్టీఏ కార్యాలయాల్లో జరుగుతున్న లావాదేవీల సంఖ్యను అధ్యయనం చేసి, ప్రతిరోజూ ఎంత మందికి స్లాట్‌ బుకింగ్‌ ద్వారా అవకా శం ఇవ్వాలనే దానిపై అధికారులు చర్చించారు. ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలకు అదనంగా 10 శాతం ఎక్కువ లావాదేవీలు జరిపేందుకు అవకాశం కల్పించా లని నిర్ణయించారు. ప్రభుత్వ శాఖల్లో పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ విధాన్ని అమలు చేస్తున్నది రవాణా శాఖే మొదటిది కావడంతో దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ఎం-వ్యాలెట్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తం గా ఎంతో గుర్తింపు వచ్చింది. ఈ మొబైల్‌ యాప్‌ను సుమారు 10 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి


పైకి వెళ్ళుటకు