హోమ్ / వార్తలు / ఉద్యోగావకాశాలు మెరుగుపరిచేందుకు కృషి
పంచుకోండి

ఉద్యోగావకాశాలు మెరుగుపరిచేందుకు కృషి

తెలంగాణలో ఉపాధి అవకాశాలు మరింత మెరుగు పరిచి నిరుగ్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు

తెలంగాణలో ఉపాధి అవకాశాలు మరింత మెరుగు పరిచి నిరుగ్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు. ఆ దిశగా సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. సోమవారం జీహెచ్‌ఏంసీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని హరిహరకళాభవన్‌లో జాబ్‌ మేళాను నిర్వహించారు. ఈ మేళా ప్రారంభోత్సవానికి హజరైన మేయర్‌ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగావకాశాలు మెరుగు పరిచేందుకు అనేక పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుకు స్వాగతిస్తూ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ మేళాలో 30 కంపెనీలు 2500 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ముందుకొచ్చాయన్నారు. భాషపై పట్టు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సబ్జెక్టుపై కమాండింగ్‌ ఉంటే ఉద్యోగం సాధించడం పెద్ద కష్టమేం కాదన్నారు. చాలా విద్యా సంస్థలు, యూనివర్శిటీలు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయని అక్కడ ఉద్యోగాలు రానివారి కోసం తాము 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఇక్కడ జాబ్‌ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. తాను రెండు డిగ్రీలు, 2 పీజీలు, పీహెచ్‌డీ చేసి అనేక ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించానని, కానీ ఇప్పుడు మేయర్‌గా మీముందు నిలబడ్డానన్నారు. 14 సంవత్సరాలు పాటు ఉద్యమంలో తెలంగాణకోసం, ఉద్యోగాల కోసం ఎంతో కష్టపడ్డామని నిరుద్యోగుల బాధ ఏమిటో తనకు తెలుసునన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆకుల రూప, అత్తెలి అరుణాగౌడ్‌, పీఎన్‌.భార్గవి, బైరగోని ధనంజనబాయిగౌడ్‌, సామల హేమ, శ్రీదేవి, జోనల్‌ కమిషనర్‌ హరిచందన, అదనపు కమిషనర్‌ భాస్కర్‌చారి, ఉపకమిషనర్‌ విజయరాజు పాల్గొన్నారు.

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు