2016-17 సంవత్సరానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రాచ్య కళాశాలల్లో తెలుగు, హిందీ, అరబిక్, ఉర్దూల్లో ఎంఏ(ఎల్) పీజీ ఎంట్రన్స్‌కు దరఖాస్తులు పంపొచ్చు. ఈ కోర్సులకు ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 10గంటల నుంచి 11గంటల వరకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష తెలంగాణ సారస్వత పరిష్యత్తు ప్రాచ్య కళాశాలలో జరగనుంది. అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ లోగా దరఖాస్తుల ఓరియంటల్ ఎం.ఏ.(లాంగ్వేజ్) ప్రవేశ పరీక్ష కన్వీనర్‌కు పంపాలి. తిలక్‌రోడ్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల, నల్లకుంటలోని ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం ప్రభుత్వ ప్రా చ్య కళాశాలల్లో తెలుగు,పండిట్ నరేంద్ర ఓరియంటల్ కళాశాలలో హిందీ, హిమాయత్‌నగర్‌లోని ఉర్దూ ఓరియంటల్ కళాశాలలో ఉర్దూ, ఏకేఎం కళాశాల, మల్లేపల్లి అరబిక్ ఓరియంటల్ కళాశాల, అరబిక్ ఓరియంటల్ కళాశాలలో అరబిక్ కోర్సులున్నాయి. పూర్తి వివరాల కోసం 9441085114 నెం బర్ ఫోన్లో ఓరియంటల్ ఎం.ఏ.(లాంగ్వేజ్) ఎంట్రన్స్ కన్వీనర్ డా.ఎ.సిల్మానాయక్ను సంప్రదించాలి.
ఆధారం : ఆంధ్ర జ్యోతి