హోమ్ / వార్తలు / ఎఫ్ఐఆర్‌ను 24 గంటల్లో వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయాలి: సుప్రీం కోర్టు
పంచుకోండి

ఎఫ్ఐఆర్‌ను 24 గంటల్లో వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయాలి: సుప్రీం కోర్టు

ఎఫ్ఐఆర్‌ను 24 గంటల్లో వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయాలి: సుప్రీం కోర్టు

 

పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్‌లను 24 గంటల్లో స్థానిక పోలీస్ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీం కోర్టు బుధవారం ఆదేశించింది. అయితే ఇంటర్‌నెట్ సౌకర్యం సరిగాలేని, పరిస్థితులు అనుకూలంగా లేని రాష్ట్రాలకు ద్విసభ్య ధర్మాసనం 72 గంటల గడువు ఇచ్చింది. ఉద్రిక్తలకు దారితీసే కేసులతో పాటు మహిళలపై లైంగిక వేధింపులు వంటి వాటిని వెబ్‌సైట్లో అప్‌లోడ్ నుంచి మినహాయించింది.
కేవలం వెబ్‌సైట్లలో ఎఫ్ఐఆర్ అప్‌లోడ్ చేయలేదన్న కారణంతో నిందితులు చట్టం నుంచి తప్పించుకోలేరని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. గతంలో 48 గంటలు ఉండే ఈ సమయాన్ని ఢిల్లీ హైకోర్టు 24 గంటలకు కుదించింది. భారత యూత్ లాయర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీం కోర్టు, ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థిస్తూనే కొన్ని సూచనలు చేసింది.
ఆధారం: ఆంధ్ర జ్యోతి

 

 

పైకి వెళ్ళుటకు