హోమ్ / వార్తలు / ఎస్సీ ఉప కులాలకు 1000 కోట్లతో కార్పొరేషన్
పంచుకోండి

ఎస్సీ ఉప కులాలకు 1000 కోట్లతో కార్పొరేషన్

ఎస్సీ ఉప కులాలకు 1000 కోట్లతో కార్పొరేషన్

ఎస్సీ ఉప కులాలకు ఉపాధి కల్పన లక్ష్యంగా రూ.1000కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ఎంఆర్‌పీఎస్‌ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. ఆ కార్పొరేషన్‌ ద్వారా 90శాతం సబ్సిడీతో రుణ సహాయం చేసి, నిరుపేదలకు చేయూతనివ్వాలని కోరారు. ఎంఆర్‌పీఎస్‌ కార్యాలయంలో ఆదివారం జరిగిన తెలుగు రాషా్ట్రల ఎస్సీ ఉపకులాల జాతీయ నాయకుల సమావేశానికి మందకృష్ణ అధ్యక్షత వహించారు. ఎస్సీ వర్గీకరణలో ఉప కులాలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం ప్రత్యేక కోటా వచ్చేలా చూడాలని, డబుల్‌ బెడ్‌రూం పథకం వర్తింపచేయాలని కోరారు. ఎస్సీ ఉప కులాలకు కుల ధ్రువీకరణ పత్రాలను ఆర్డీవో కాకుండా, తహసీల్దార్‌ జారీ చేసేలా జీవో ఇవ్వాలని, ఎస్సీలకు గ్రామస్థాయినుంచి పార్లమెంటు వరకు నామినేటెడ్‌ పదవులు ఇవ్వాలని మందకృష్ణ డిమాండ్‌ చేశారు. మార్చి 18న నిర్వహించే ఎస్సీ ఉప కులాల సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు