హోమ్ / వార్తలు / ఎస్సీలకు సబ్సిడీపై పెయ్య దూడలు
పంచుకోండి

ఎస్సీలకు సబ్సిడీపై పెయ్య దూడలు

ఎస్సీలకు సబ్సిడీపై పెయ్య దూడలు

పాడి రైతులను ప్రోత్సహించేందుకు ఏపీ సర్కార్‌ పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే సబ్సిడీపై దాణా, పశుగ్రాస విత్తనాలను అందిస్తున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. షెడ్యూల్డ్‌ కులాలకు(ఎస్సీ) 75 శాతం రాయితీతో మేలు జాతి ముర్రా జాతి పెయ్యలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. పశు సంవర్థక శాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తాయి. మూడు, నాలుగు నెలల ముర్రా జాతి దూడ మార్కెట్‌లో రూ.60 వేలకు పైగా ధర పలుకుతోంది. దీనిలో 75 శాతం సబ్సిడీ అంటే... రూ.45 వేలు సబ్సిడీ కింద పోగా లబ్ధిదారు కేవలం రూ.15 వేలు కడితే సరిపోతుంది. అర్హులైన నిరుపేద మహిళా సంఘ సభ్యులకు సబ్సిడీపై వీటిని పంపిణీ చేస్తారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు