హోమ్ / వార్తలు / ఏప్రిల్ 5, 6వ తేదీల్లో క‌ర్నూల్ లో పాస్ పోర్టు సేవా క్యాంప్‌
పంచుకోండి

ఏప్రిల్ 5, 6వ తేదీల్లో క‌ర్నూల్ లో పాస్ పోర్టు సేవా క్యాంప్‌

ఏప్రిల్ 5, 6వ తేదీల్లో క‌ర్నూల్ లో పాస్ పోర్టు సేవా క్యాంప్‌

హైద‌రాబాద్   ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాల‌యం ఏప్రిల్ 5, 6వ తేదీల్లో క‌ర్నూల్  క‌లెక్ట‌రేట్ లోని సునయ‌నా ఆడిటోరియం లో పాస్ పోర్టు సేవా క్యాంప్ ను నిర్వ‌హిస్తోంది. క‌ర్నూల్ జిల్లా వాసుల కోసం ఈ క్యాంప్ ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ఉప పాస్ పోర్టు అధికారి ఎల్‌.మ‌ద‌న్ కుమార్ రెడ్డి బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీన 200 ఆన్ లైన్ అపాయింట్‌మెంట్లు, ఏప్రిల్ 3వ తేదీన మ‌రో 200 ఆన్ లైన్ అపాయింట్‌మెంట్ల‌ను అందుబాటులో ఉంచుతున్న‌ట్లు చెప్పారు. ద‌ర‌ఖాస్తు దారులు  www.passportindla.gov.in వెబ్ సైట్ లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాల‌ని సూచించారు.  సాధార‌ణ‌, రీ ఇష్యూ ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తామ‌ని పేర్కొన్నారు. ఆన్ హోల్డ్‌, వాక్ ఇన్‌, పీసీసీ ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు.

ఆధారము: ప‌త్రికా స‌మాచార కార్యాల‌యం, భార‌త ప్ర‌భుత్వం, హైద‌రాబాద్‌

పైకి వెళ్ళుటకు