హోమ్ / వార్తలు / ఐరాసలో తొలిసారిగా అంబేడ్కర్‌ జయంతి వేడుకలు
పంచుకోండి

ఐరాసలో తొలిసారిగా అంబేడ్కర్‌ జయంతి వేడుకలు

ఐరాసలో తొలిసారిగా అంబేడ్కర్‌ జయంతి వేడుకలు

భారత రాజ్యాంగ రూపశిల్పి, దళిత హక్కుల ఉద్యమనేత డా.బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతిని తొలిసారిగా ఐక్యరాజ్య సమితి(ఐరాస)లో నిర్వహించనున్నారు. ఐరాస భారత శాశ్వత ప్రతినిధి బృందం, కల్పనా సరోజ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఐరాస ప్రధాన కార్యాలయంలో ఒకరోజు ముందుగా ఈ నెల 13వ తేదీన అంబేడ్కర్‌ 125 జయంతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి అసమానతలపై జరపాల్సిన పోరుపై ఈకార్యక్రమంలో చర్చించనున్నట్లు ఐరాసలోని భారత శాశ్వతప్రతినిధి సయీద్‌అక్బరుద్దీన్‌ ట్విట్టర్‌లో తెలిపారు.

ఆధారము : ఈనాడు

పైకి వెళ్ళుటకు