హోమ్ / వార్తలు / ఒంటరి మహిళలకు ఏప్రిల్‌ నుంచి పింఛన్లు!
పంచుకోండి

ఒంటరి మహిళలకు ఏప్రిల్‌ నుంచి పింఛన్లు!

ఒంటరి మహిళలకు ఏప్రిల్‌ నుంచి పింఛన్లు!

తెలంగాణలోని ఒంటరి మహిళలకు ఏప్రిల్‌ 1 నుంచి ఆసరా పింఛన్లు అందే సూచనలు కనిపిస్తున్నాయి. రానున్న 2017-18 బడ్జెట్‌లో ఆసరా పింఛన్లతో పాటు స్వచ్ఛభారత్‌, ఉపాది హామీ, గ్రామీణ రహదారులు తదితర పథకాలకు పెద్దపీట వేయాలని సర్కారు భావిస్తోంది. వీటన్నింటికి బడ్జెట్‌లో అవసరమయ్యే నిధులపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు ప్రతిపాదనలు తయారు చేశాయి. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ పథకాల ద్వారా ఎక్కువ నిధులు వచ్చేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్‌లో అవసరమయ్యే నిధులపై తయారు చేసిన ప్రతిపాదనలను సోమవారం సర్కారు ప్రాథమికంగా చర్చించింది. మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎస్‌పీ సింగ్‌, కమిషనర్‌ నీతూ ప్రసాద్‌ ఇతర అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ ప్రతిపాదనల ప్రకారం.. రాష్ట్రంలోని ఒంటరి మహిళలకు కొత్త బడ్జెట్‌ తర్వాత నెలకు రూ.1,000 చొప్పున పింఛను అందే అవకాశముంది. బడ్జెట్‌లో ఆయా పథకాలకు అవసరమయ్యే నిధులపై సమావేశం చర్చించింది. మిషన్‌ భగీరథకు బడ్జెట్‌ ప్రమేయం లేకుండా ఆర్థిక సంస్థలు ఇచ్చే నిధులను పొందుపరుస్తారు.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు