హోమ్ / వార్తలు / ఒక్క ‘క్లిక్‌’ తో సమస్త సమాచారం
పంచుకోండి

ఒక్క ‘క్లిక్‌’ తో సమస్త సమాచారం

ఒక్క ‘క్లిక్‌’ తో సమస్త సమాచారం

ఇప్పుడు ఏదైనా ఓ పోటీ పరీక్షకు సిద్ధం కావడం ఒక ఎత్తు అయితే, పరీక్ష రోజు ఆ కేంద్రానికి చేరుకోవడం మరో ఎత్తు. అందుకే చాలా మంది ముం దుగానే ఓసారి తమ పరీక్షా కేంద్రం గురించి వాకబు చేసుకుంటారు. కాగా ఇప్పుడు ఎస్‌ఐ అర్హత పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు ఆ తిప్పలేవీ ఉండవు. జేఎనటీయూ-హెచ సహకారంతో టీ-హబ్‌ స్టార్టప్‌ కంపెనీ యాప్‌ స్పేస్‌ ఇన్నోవేషన సంస్థ రూపొందించిన కొత్త యాప్‌.. వారు శ్రమ పడాల్సిన అవసరం లేకుండా చేస్తోంది. ఈనెల 17న జరగనున్న ఎస్సై అర్హత పరీక్షకు అభ్యర్ధులు సులువుగా పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు వీలుగా ఈ యాప్‌ రూపొందించారు. హాల్‌ టిక్కెట్లు పొందిన అభ్యర్ధులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా యాప్‌కు సంబంధించిన లింక్‌ పంపిస్తారు. దాంతో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్ష కేంద్రం ఫోన నంబరు, గూగుల్‌ నావిగేషన ద్వారా లోకేషన వివరాలు యాప్‌లో పొందుపర్చారు. స్మార్ట్‌ ఫోన లేని వారు ఎస్‌ఎంఎస్‌, ఫీడ్‌బ్యాక్‌ ద్వారా ఆ వివరాలు పొందవచ్చు. ఈ యాప్‌ను డీజీపీ అనురాగ్‌ శర్మ బుధవారం ఆవిష్కరించనున్నారు.

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు