హోమ్ / వార్తలు / కనీస మద్దతు ధర పెంపు
పంచుకోండి

కనీస మద్దతు ధర పెంపు

గోధుమలకు, పప్పు ధాన్యాలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయించింది.

గోధుమలకు, పప్పు ధాన్యాలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయించింది. గోధుమలకు క్వింటాలుకు రూ.100, పప్పు ధాన్యాలకు రూ.550 పెంచింది. దీంతో గోధుమల కనీస మద్దతు ధర క్వింటాలు రూ.1625కి చేరింది. ప్రధాన మంత్రి నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ వీటికి ఆమోదం తెలిపింది. గోధుమలకు 6.6శాతం, బార్లీకి 8.2శాతం, పప్పు ధాన్యాలకు 14.3శాతం మేర కనీస మద్ధతు ధరను పెంచారు. దీంతో పప్పు ధాన్యాల ధర క్వింటాలు రూ.3500 నుంచి రూ.4వేలకు చేరింది. వర్షాలు బాగా కురిసినందున ఈ ఏడాది పప్పు ధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని 20.75 మిలియన్‌ టన్నులగా నిర్ణయించింది. మరోవైపు కేంద్ర కేబినెట్‌ నదుల అనుసంధానంపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. నదుల అనుసంధానంపై కేంద్రం తగిన నిర్ణయాలు తీసుకొనేందుకు వీలుగా.. ఈ కమిటీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇస్తుంది.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు