హోమ్ / వార్తలు / కానిస్టేబుల్ అభ్యర్థులకు 1న ఫిజికల్ టెస్ట్
పంచుకోండి

కానిస్టేబుల్ అభ్యర్థులకు 1న ఫిజికల్ టెస్ట్

కానిస్టేబుల్ అభ్యర్థులకు 1న ఫిజికల్ టెస్ట్

రాష్ట్రంలో 4,283 సివిల్, రిజర్వ్ పోలీస్ కానిస్టేబుళ్లు, జైళ్ల శాఖలోని 265 వార్డెన్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో ఓఎంఆర్ షీట్ల రీవెరిఫికేషన్ కోసం ఈ నెల 19 నుంచి 23 వ తేదీ ఐదు గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ అతుల్‌సింగ్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 6న నిర్వహించిన పరీక్ష ఫలితాలు 15న విడుదలైనట్లు తెలిపారు. రాతపరీక్షకు సంబంధించి అనుమానాలు ఉంటే ఏపీఆన్‌లైన్ (మీసేవ కాదు) ద్వారా రూ. 1,000 ఫీజుతో కలిపి ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. www.appolice.gov.in వెబ్‌సైట్‌లో హాల్ టికెట్, అభ్యర్థి పేరు, తండ్రి పేరు, ఓఎంఆర్ షీటు రీవెరిఫికేషన్ కోరడానికి కారణం తెలియజేస్తూ ధరఖాస్తు చేసుకోవాలని వివరించారు.

ఆధారం: సాక్షి

పైకి వెళ్ళుటకు