హోమ్ / వార్తలు / కిరోసిన్‌పై నెలకు 50 పైసలు పెంపు
పంచుకోండి

కిరోసిన్‌పై నెలకు 50 పైసలు పెంపు

కిరోసిన్‌పై నెలకు 50 పైసలు పెంపు

కిరోసిన్, బొగ్గు, పిడకలతో వంట చేయడం వల్ల కాలుష్యంతోపాటు అనారోగ్యం కలుగుతున్న నేపథ్యంలో అందరూ గ్యాస్‌నే వినియోగించాలని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అందులో భాగంగానే రేషనషాపుల్లో ఇచ్చే కిరోసిన్‌ కోటా తగ్గించడంతోపాటు, ధరను కూడా పెంచింది. ఇక నుంచి నెలకు ప్రతి లీటర్‌పై 50 పైసల చొప్పున పెంచాలని నిర్ణయించింది. అలాగే, హోల్‌సేల్‌ డిపోల నుంచి రిటైలర్‌కు సరఫరా చేసే కిరోసిన రవాణా చార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రేషన షాపుల ద్వారా గ్యాస్‌ కనెక్షన ఉన్న వారికి లీటర్‌ కిరోసిన, లేని వారికి నాలుగు లీటర్లు పంపిణీ చేస్తున్నారు. రెండు నెలల క్రితం లీటర్‌ కిరోసిన రూ.14.75 కాగా దానిని రూ. 16.75కు పెంచారు. మరో 25 పైసలు డీలర్ల కమిషన కలిపి ప్రస్తుతం లీటర్‌కు రూ. 17 వసూలు చేస్తున్నారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు