హోమ్ / వార్తలు / కేంద్రంలోని ఎన్ డిఎ ప్రభుత్వం 2017-18లో ఒక కోటి ఉద్యోగాలు కల్పిస్తుంది
పంచుకోండి

కేంద్రంలోని ఎన్ డిఎ ప్రభుత్వం 2017-18లో ఒక కోటి ఉద్యోగాలు కల్పిస్తుంది

కేంద్రంలోని ఎన్ డిఎ ప్రభుత్వం 2017-18లో ఒక కోటి ఉద్యోగాలు కల్పిస్తుంది

మహిళల కోసమే ప్రత్యేకంగా హైదరాబాద్ లో శనివారం నిర్వహించిన అతి పెద్దఉద్యోగ మేళా & రుణ మేళా విజయవంతం అయింది. కేంద్ర కార్మిక మరియు ఉపాధికల్పన శాఖ సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ బండారు దత్తాత్రేయ ఈ రోజు హైదరాబాద్ లోని కేశవ్నారాయణగూడ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటైన మహిళల ఉద్యోగ మేళా & రుణ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, సమాచార సాంకేతిక విజ్ఞాన రంగంలో మరీ ముఖ్యంగా మహిళా ఇంజినీరింగ్పట్టభద్రులకు అపార ఉపాధి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కేంద్రంలోని ఎన్ డిఎప్రభుత్వం దివ్యాంగులైన షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల వారిలో నైపుణ్యాలకు పదును పెట్టేందుకు జాతీయవృత్తిసంబంధ శిక్షణ కేంద్రాలను నెలకొల్పడానికి అత్యంత ప్రాధాన్యాన్నికట్టబెడుతోందని తెలిపారు. నైపుణ్యాల అభివృద్ధి పథకాలకు రూ.1804 కోట్లను బడ్జెటులో కేటాయించడంజరిగిందన్నారు. నేషనల్ కెరియర్ సర్వీస్ లో భాగంగా 100 నమూనా కెరియర్ కేంద్రాలను పనిచేయించడం ప్రారంభిస్తామని తెలిపారు.ప్రధాన మంత్రి రోజ్ గార్ యోజన (పిఎమ్ఆర్ వై) లో భాగంగా సూక్ష్మ, చిన్న,మధ్యతరహా సంస్థల (ఎమ్ఎస్ఎమ్ఇ), జౌళి రంగాలలో రూ.6,000 కోట్ల తో ఒక కోటి ఉద్యోగాలను కల్పించడం జరుగుతుందని వివరించారు. 2017-18 లో 37,000 మంది అభ్యర్థులకు నైపుణ్య అభివృద్ధి కల్పనకు రూ.330 కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు.అంతే కాకుండా పారిశ్రామిక శిక్షణ సంస్థలను ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్య పద్ధతిలో ప్రోత్సహిస్తున్నామని ఆయన చెప్పారు.రూ.14,000 కోట్ల నిధులతో నైపుణ్యాల అభివృద్ధికోసం జాతీయ నైపుణ్యాల అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్ఎస్ డిసి) కృషి చేస్తోందని మంత్రివెల్లడించారు.

మౌలిక సదుపాయాల కల్పన రంగంపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమ దృష్టినికేంద్రీకరిస్తున్నారని శ్రీ దత్తాత్రేయ చెప్పారు. కేంద్ర బడ్జెటులో ఈ రంగానికి రూ.2,21,246 కోట్లను ప్రతిపాదించినట్లు మంత్రివివరించారు. అసంఘటిత రంగంలోని వ్యవసాయ శ్రామికులకు ఉపాధి అవకాశాలను పెద్ద ఎత్తునకల్పించడం దీని వెనుక ఉన్న పరమార్థమని చెప్పారు. విద్యారంగంలో సంస్కరణలుతీసుకురావలసిన ఆవశ్యకత ఉందని మంత్రి అన్నారు. నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ స్కీమ్అనే ఒక కొత్త విద్యా సంబంధ పథకంలో భాగంగా మహిళలు మరిన్ని ఉద్యోగ అవకాశాలనుపొందగలరని శ్రీ దత్తాత్రేయ అన్నారు. ఉద్యోగ భద్రత, వేతన భద్రత, సాంఘిక భద్రతకుతాము ప్రాముఖ్యం ఇస్తున్నామని మంత్రి అన్నారు. హైదరాబాద్ లోని ఉస్మానియావిశ్వవిద్యాలయంలోను, మల్లేపల్లి లోను, అలాగే వరంగల్, కరీంనగర్ లలోను ‘మోడల్  కెరియర్ సర్వీస్సెంటర్ల’ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.తెలంగాణ లోని వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలలో ఉద్యోగ మేళా లను నిర్వహించనున్నట్లు చెప్పారు.ఇ-కామర్స్, ఫూడ్ప్రాసెసింగ్ రంగాలలో మరింత మందికి ఉపాధి లభించేందుకు అవకాశం ఉందని శ్రీ దత్తాత్రేయఅన్నారు. పాత పెద్ద నోట్ల చట్టబద్ధత రద్దు అనంతరం ‘స్టార్ట్- అప్ అండ్ స్టాండ్- అప్’, ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్కిల్ ఇండియా’ కార్యక్రమాలకు ఊతం అందించడం జరిగిందని మంత్రి చెప్పారు.

‘ముద్ర’, ‘స్టార్ట్- అప్ అండ్ స్టాండ్- అప్’ పథకాల లో భాగంగా మహిళా లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలను మంత్రిప్రదానం చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీయ మహిళా బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తదితర ఏడు జాతీయ బ్యాంకులు ఈ రుణాలనుమంజూరు చేసేందుకు చొరవ తీసుకున్నాయి. అలాగే, ఉద్యోగ మేళాలో భాగంగా ఎంపిక అయిన మహిళా అభ్యర్థులకు ఉపాధి అవకాశాలకుసంబంధించిన లేఖలను కూడా మంత్రి ప్రదానం చేశారు. ప్రయివేటు రంగంలోని ప్రముఖకంపెనీలు ఈ ఉద్యోగ మేళాలో పాలుపంచుకొన్నాయి. మహిళలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలోఉత్సాహంగా పాల్గొన్నారు.

***

ఆధారం: పత్రికా సమాచార కార్యాలయము

పైకి వెళ్ళుటకు