హోమ్ / వార్తలు / కోడి పిల్లల పెంపకానికి రుణాలు
పంచుకోండి

కోడి పిల్లల పెంపకానికి రుణాలు

కోడి పిల్లల పెంపకానికి రుణాలు

జిల్లాలో డీఆర్‌డీఏ ద్వారా కోడి పిల్లల పెంపకానికి సబ్సిడీపై రు ణాలు ఇస్తున్నట్లు పీడీ హబీబ్‌ బాషా తెలిపారు. పెరటి కోళ్ల ద్వారా నెలకు లబ్ధిదారునికి రూ. 2,500 ఆదాయం వచ్చేట్టు ప్రత్యేక పథకాన్ని ప్రతిపాదించారు. మాంసం, కోడిగుడ్లు డ్వాక్రా సంఘ సభ్యులు కుటుంబానికి ఆహార రూపంలో అందించేటట్టు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

సబ్సిడీ వివరాలు : ప్రతి మండలంలో 200 యూనిట్లను గ్రౌండింగ్‌ చేస్తున్నారు. యూనిట్‌ విలువ రూ.4,560. దీనిలో సబ్సిడీ రూ.3,750, లబ్ధిదారుడు రూ.810 చెల్లించాలి. ఈ పథకం కింద జిల్లాలో 880 మందికి రుణాలు ఇవ్వాలి.

నాన్‌ సబ్సిడీ : ప్రతి మండలంలో సబ్సి డీ లేకుండా 200 యూనిట్లను గ్రౌండింగ్‌ చేస్తున్నారు. ఒక్కొక్క యూనిట్‌ విలువ రూ. 1,050. దీని కింద 15 కోడి పిల్లలను సరఫరా చే స్తారు. అంటువ్యాధులు లేకుండా అ న్ని రకాల వ్యాధి నిరోధక టీకాలు వే యించి ఇస్తారు. ఈ పథకం కింద 11,470 మందికి కోడి పిల్లలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 1,011 మందికి సబ్సిడీ లేని పథకంలో కోడి పిల్లలను పంపిణీ చేశారు.

జిల్లాలో సబ్సిడీ, సబ్సిడీలేని పథకాలలో కోడి పిల్లలు కావాలనుకునే డ్వాక్రా సంఘాల మహిళలు తమ ప్రాంతంలోని గ్రామ, మండ ల సమాఖ్య, కమ్యూనిటీ కో ఆర్డినేటర్లను సం ప్రదించాలని పీడీ హబీబ్‌ బాషా తెలిపారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు