హోమ్ / వార్తలు / గ్రూప్‌-2 నేడే , తెలంగాణ రాష్ట్రంలో మొదటి గ్రూప్‌-2 పరీక్ష
పంచుకోండి

గ్రూప్‌-2 నేడే , తెలంగాణ రాష్ట్రంలో మొదటి గ్రూప్‌-2 పరీక్ష

గ్రూప్‌-2 నేడే , తెలంగాణ రాష్ట్రంలో మొదటి గ్రూప్‌-2 పరీక్ష

తెలంగాణ రాష్ట్రంలో తొలి ‘గ్రూప్‌’ పరీక్షకు శుక్రవారం తెరలేస్తోంది. దాదాపు 8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న గ్రూప్‌-2 పరీక్ష తొలి రెండు పేపర్లు శుక్రవారం జరగబోతున్నాయి. మిగిలిన రెండు పేపర్లు ఆదివారం జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలతోపాటు 73 చోట్ల మొత్తం 1,916 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) పర్యవేక్షణలో ఈ పరీక్షను రెవెన్యూ, పోలీసు యంత్రాంగం నిర్వహిస్తోంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలు, పోలీసు ఉన్నతాధికారులు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఈ విషయమై అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించారు.

ఆధారం : ఈనాడు

పైకి వెళ్ళుటకు