హోమ్ / వార్తలు / జనరిక్‌ దుకాణాలు మహిళలకు
పంచుకోండి

జనరిక్‌ దుకాణాలు మహిళలకు

జనరిక్‌ దుకాణాలు మహిళలకు

మహిళలకు మరింత ఆర్థిక చేయూత నిచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలకు రూపొందిస్తోంది. ఇప్పటికే డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అమలు, కృష్ణా పుష్కరాల్లో డ్వాక్రా స్టాళ్లను ఏర్పాటు చేయించడం ద్వారా మహిళలకు చేయూతనిచ్చిన ప్రభుత్వం తాజాగా జనరిక్‌ ఔషధ దుకాణాల బాధ్యతలను కూడా అప్పగించనుంది. తద్వారా మహిళలను ఆర్థికంగా మరింత పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ మేరకు ‘అన్న సంజీవని’ షాపుల నిర్వహణ, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు ప్రభుత్వం అప్పగించింది. అధిక ధరలు కలిగిన మందులను తక్కువ ధరకు అందించేందుకు ‘అన్న సంజీవని’ ఔషధ దుకాణాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 249 జనరిక్‌ దుకాణాలున్నాయి.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు