హోమ్ / వార్తలు / జనవరి 18 న హైదరాబాద్ లో ‘డిజి ధన్ మేళా ’
పంచుకోండి

జనవరి 18 న హైదరాబాద్ లో ‘డిజి ధన్ మేళా ’

జనవరి 18 న హైదరాబాద్ లో ‘డిజి ధన్ మేళా ’: కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ బండారు దత్తాత్రేయ

నగదు రహిత లావాదేవీలను గురించి ప్రజలలో జాగృతి కలిగించడం కోసం ఈ నెల 18 వతేదీన హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో “డిజి ధన్ మేళా’’ను నిర్వహించనున్నట్లు కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ బండారు దత్తాత్రేయ ఈ రోజు హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ ఎమ్.జె. అక్బర్, రాష్ట్ర మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారని శ్రీ దత్తాత్రేయ అన్నారు. యుఐడిఎఐ, ప్రభుత్వరంగ సంస్థలు సహా మొత్తం 80 సంస్థలు ఈ మేళాలో స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నాయని ఆయన వివరించారు. వీటిలో ఇ-వ్యాలెట్ సంస్థలు, వ్యవసాయ అనుబంధ సంస్థల స్టాల్స్ 35 వరకు ఉంటాయని పేర్కొన్నారు.  డిజిటల్ ఆధారిత నగదు లావాదేవీలను ఎలా నిర్వహించుకోవాలో అక్కడికక్కడ చేసి చూపించడం ఈ మేళాలోని ప్రత్యేకత అని ఆయన అన్నారు.

డిజిటల్ లావాదేవీలను బహుళ ప్రచారంలోకి తీసుకురావడం కోసం ఇప్పటికే ప్రకటించిన బహుమతుల పథకానికి సంబంధించి లకీ డ్రాలో భాగంగా ఐదుగురు విజేతలకు మేళాలో బహుమతులను ప్రదానం చేయనున్నట్లు శ్రీ దత్తాత్రేయ వెల్లడించారు. డిజి ధన్ మేళా లో  ‘ఆధార్’ రిజిస్ట్రేషన్ ల సదుపాయం కూడా ఒక భాగంగా ఉంటుందన్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో క్షేమకరమైన,పారదర్శకమైన పద్ధతిలో పాయింట్స్ ఆఫ్ సేల్ (పిఒఎస్) స్వైపింగ్ మెషిన్ల ద్వారా లావాదేవీలను ఎలా జరుపుకోవాలో అనే అంశంపై ఈ కార్యక్రమంలో ప్రత్యక్ష అవగాహన కలిగిస్తారని ఆయన వివరించారు.

ఆధారం: పత్రికా సమాచార కార్యాలయం

పైకి వెళ్ళుటకు