హోమ్ / వార్తలు / జాతీయ సైన్స్ దినోత్సవం
పంచుకోండి

జాతీయ సైన్స్ దినోత్సవం

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలను అందజేశారు; సైన్స్ రంగంలో సర్ సి. వి. రామన్ చేసిన కృషికి వందనాలను సమర్పించారు

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు, సైన్స్ రంగంలో శ్రీ రామన్ చేసిన కృషికి ప్రధాన మంత్రి ప్రణామాలు అర్పించారు.

“జాతీయ సైన్స్ దినోత్సవం నాడు, మన శాస్త్ర విజ్ఞ‌ాన రంగంలోని వారందరికీ ఇవే నా శుభాభినందనలు, శుభాకాంక్షలు. దేశ నిర్మాణంలోను, దేశ పురోగతిలోను వారు పోషిస్తున్నటువంటి పాత్ర అత్యంత ప్రధానమైనది.

శాస్త్ర విజ్ఞ‌ాన రంగానికి మార్గదర్శకత్వం వహించే తరహా సేవలను అందించినందుకుగాను సర్ సి. వి. రామన్ కు మనం వందనం చేద్దాం. సైన్స్ పట్ల ఉత్సాహాన్ని కనబరిచే నవ తరం ప్రతినిధులకు ఆయన కృషి ప్రేరణగా నిలుస్తుంది” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

Source : PIB

పైకి వెళ్ళుటకు