హోమ్ / వార్తలు / జులై 27, 28 లలో లో బ్రిక్స్ ఎంప్లాయిమెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం మొదటిసారిగా వేదికగా హైదరాబాద్ నగరం
పంచుకోండి

జులై 27, 28 లలో లో బ్రిక్స్ ఎంప్లాయిమెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం మొదటిసారిగా వేదికగా హైదరాబాద్ నగరం

జులై 27, 28 లలో లో బ్రిక్స్ ఎంప్లాయిమెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం మొదటిసారిగా వేదికగా హైదరాబాద్ నగరం

మొట్టమొదటిసారిగా జరగనున్న బ్రిక్స్ ఎంప్లాయిమెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశానికి హైదరాబాద్ నగరం వేదిక కానున్నది. జులై 27, 28 తేదీల్లో జరిగే ఈ సమావేశంలో బ్రిక్స్ గ్రూప్ కు చెందిన 5 దేశాల ప్రతినిధులతో పాటు వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొని కార్మిక సంబంధిత అంశాల పై చర్చిస్తారు. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సమావేశం ఏర్పాట్ల గురించి బుధవారం బర్కత్ పురాలోని ఉద్యోగ భవిష్యనిధి సంస్థ కార్యాలయంలో సమీక్షా జరిగింది.

కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ మనేశ్ కుమార్ గుప్త అధ్యక్షతన జరిగిన  ఈ సమీక్షా సమావేశంలో నగరానికి వచ్చే అంతర్జాతీయ ప్రతినిధుల కోసం చేయవలసిన ఏర్పాట్ల గురించి వివిధ శాఖల ప్రతినిధులతో చర్చించారు. పోలీస్, రెవెన్యూ,పత్రికా సమాచార కార్యాలయం, కార్మిక శాఖల నుండి అధికారులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ  ప్రతినిధులకు భారతదేశ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల విజయాల గురించి కనీస అవగాహన కల్పించేటట్లు కార్యక్రమాలు రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే ప్రతినిధుల భద్రతా గురించి పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్థానికంగా ఉన్న సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్ కు ప్రతినిధుల పర్యటన కూడా ఉంటుందని శ్రీ మనేష్ కుమారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ డైరెక్టర్ శ్రీమతి అణుజా బాపత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఆధారం :పత్రికా సమాచార కార్యాలయం

పైకి వెళ్ళుటకు