టెలికాం శాఖ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ వారి 15వ త్రైమాసిక పింఛను అదాలత్, సెప్టెంబర్ 9, 2016 (శుక్రవారం), 10.30 నుండి13.00 గంటల వరకు, పై చిరునామా యందు జరుగును. కావున, టెలికాం శాఖ మరియు బి.ఎస్.ఎన్.ఎల్ పింఛనుదారులు తమ పింఛను మరియు తత్సంబంధిత సమస్యలను లిఖిత పూర్వకంగా 29-07-2016 (శుక్రవారం) లోపు డిప్యూటీ సి.సి.ఏ (పెన్షన్),ఆంధ్రప్రదేశ్ సర్కిల్, డిపార్టుమెంటు ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, కవాడిగూడ, హైదరాబాద్ 500080 కు పంపించవలెను. ఆ తరువాత అందిన సమస్యలను పింఛను అధాలత్ ముందు ఉంచబడవు. మరిన్ని వివరములకు 1800-4250-6000 (టోల్ ఫ్రీ నెం.) పై సంప్రదించాలని సి ఎం సంపర్, ప్రిన్సిపాల్ కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ తెలిపారు.
ఆధారం: పత్రికా సమాచార కార్యాలయం