హోమ్ / వార్తలు / డెల్టాలో సాగు కష్టాలకు చెక్‌... రూ.15 కోట్లతో ఎత్తిపోతల పథకం
పంచుకోండి

డెల్టాలో సాగు కష్టాలకు చెక్‌... రూ.15 కోట్లతో ఎత్తిపోతల పథకం

డెల్టాలో సాగు కష్టాలకు చెక్‌... రూ.15 కోట్లతో ఎత్తిపోతల పథకం

కృష్ణా పశ్చిమ డెల్టాలో సాగు కష్టాలకు చెక్‌ పడనుంది. హైలెవల్‌ చానల్‌పై రూ.15 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మించి సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. కొద్ది రోజుల క్రితం తెనాలి వచ్చిన రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ పథకం పై ప్రకటన కూడా చేశారు. కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాల్వ నుంచి పెదవడ్లపూడి నుంచి ప్రవహించే హైలెవల్‌ చానల్‌ కింద దుగ్గిరాల, పెదకాకాని, తెనాలి, మంగళగిరి, తాడేపల్లి మం డలాలకు చెందిన 25 వేల ఎకరాల ఆ యకట్టు ఉంది.కృష్ణా పశ్చిమ ప్రధాన కాల్వ కంటే నాలుగు అడుగుల ఎత్తు లో ఉన్న హైలెవల్‌ చానల్‌కు ప్రధాన కాల్వలో నీటి మట్టం తక్కువగా ఉన్న సమయంలో నీరందని పరిస్థితి ఏర్పడుతోంది. గత ఖరీఫ్‌లో ఈ కాల్వ కింద సాగు నీరందక సుమారు పది వేల ఎకరాలలో వరి పైరు ఎండి పోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. హైలెవల్‌ చానల్‌ ప్రవాహ సామ ర్థ్యం 377 క్యూసెక్కులు కాగా, 250 క్యూసెక్కు ల సామర్థ్యంతో ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల ప్రధాన కాల్వలో నీటి ప్రవాహం తక్కువగా ఉన్న సమయంలో ఈ పథకం ద్వారా నీటిని మళ్లించడానికి వీలవుతుందని భావిస్తున్నారు.

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు