హోమ్ / వార్తలు / తట్టు, రుబెల్లా రక్షణకు.. ఇకపై ఒకే టీకా
పంచుకోండి

తట్టు, రుబెల్లా రక్షణకు.. ఇకపై ఒకే టీకా

తట్టు, రుబెల్లా రక్షణకు.. ఇకపై ఒకే టీకా

 

చిన్నారులను తట్టు, రుబెల్లా నుంచి రక్షించే సింగిల్ టీకాను కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల చేసింది. కర్నాటకలోని బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు ఎంఆర్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించారు.
కర్నాటక, తమిళనాడు, పాండిచెరి, గోవా, లక్షదీప్‌లో సుమారు 3.6 కోట్ల పిల్లలకు దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు. అనంతరం ఈ సింగల్ టీకాను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తారు. ప్రస్తుతం తట్టు, రుబెల్లాకు 9-12 నెలలు, 16-24 నెలల వయసున్న చిన్నారులకు రెండు టీకాలుగా ఇస్తున్నారు.

 

ఆధారం: ఆంధ్ర జ్యోతి

 

పైకి వెళ్ళుటకు