హోమ్ / వార్తలు / తెలంగాణలో విద్యుత్ ఛార్జీల మోత...!
పంచుకోండి

తెలంగాణలో విద్యుత్ ఛార్జీల మోత...!

తెలంగాణలో విద్యుత్ ఛార్జీల మోత...!

తెలంగాణలో విద్యుత్ చార్జీల మోత మోగనుంది. ఒకసారో, రెండుసార్లో కాదు...ప్రతి మూడు నెలలకొకసారి విద్యుత్ ఛార్జీల మోత మోగించేందుకు డిస్కంలు సిద్ధమయ్యాయి. డిస్కంలను నష్టాల ఊబి నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఉదయ్ పథకంలోతెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం కాబోతోంది. దీనికి సంబంధించి బుధవారం ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోబోతోంది. ఉదయ్ పథకంలో చేరడంవల్ల విద్యుత్ సంస్థలకు ఊరట లభించనుంది. డిస్కంల అప్పులను తీర్చడం ద్వారా వాటిపై ఆర్థిక భారం తగ్గనుంది. డిస్కంలకు ఉన్న అప్పుల్లో 75 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఖాతాకు బదిలీ అవుతాయి. ఈ సొమ్ముకు బాండ్లు జారీ చేసి, నిధులు సేకరించి అప్పులు తీరుస్తారు. పథకంలో చేరినందుకు తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బొగ్గు సరఫరాలో రాయితీలు వస్తాయి. అయితే ఈ పథకానికి షరతులు వర్తిస్తాయి. ప్రతి మూడు నెలలకు డిస్కంల ఆదాయ, వ్యయాలను పరిశీలించి విద్యుత్ ఛార్జీలను సవరించాలి. అంటే సవరణ జరిగినప్పుడల్లా విద్యుత్ ఛార్జీల వడ్డన తప్పనిసరి.

ఆదాం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు