హోమ్ / వార్తలు / తెలుగు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ సీట్ల పెంపు
పంచుకోండి

తెలుగు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ సీట్ల పెంపు

తెలుగు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ సీట్ల పెంపు ,ఏపీలో 900, తెలంగాణలో 550 సీట్లకు పచ్చజెండా

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లో 900, తెలంగాణలో 550 ఎంబీబీఎస్‌ సీట్లు పెరిగాయి. అన్ని రకాల నియమ నిబంధనలు పాటించినప్పటికీ తమ దరఖాస్తుల్ని భారత వైద్య మండలి (ఎంసీఐ) పరిగణనలోకి తీసుకోలేదంటూ వివిధ వైద్య కళాశాలలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. 2016-17 విద్యా సంవత్సరానికిగాను వివిధ ఎంబీబీఎస్‌, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులకు ఆయా కళాశాలల దరఖాస్తులను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఒక ఓవర్‌సైట్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆయా కాలేజీల దరఖాస్తులను పరిశీలించి, నిర్ణయాలు తీసుకున్న మేరకు ఆయా కాలేజీలకు అనుమతులు ఇస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇదిలావుండగా, తెలంగాణలో మరిన్ని సూపర్‌ స్పెషాలిటీ వైద్య విద్య సీట్లను పెంచుకోవడానికి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను పంపించింది. మరో 61 సీట్లను పెంచాలని భారత వైద్య మండలి (ఎంసీఐ)ని కోరింది.

ఆధారం : ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు