హోమ్ / వార్తలు / నవంబరు 30లోగా పన్ను చెల్లించండి
పంచుకోండి

నవంబరు 30లోగా పన్ను చెల్లించండి

నవంబరు 30లోగా పన్ను చెల్లించండి

బ్లాక్‌మనీ డిక్లరెంట్స్‌కు ఆదాయ పన్ను శాఖ ఆదివారం హెచ్చరిక జారీచేసింది. ఆదాయ వెల్లడి పథకం(ఐడీఎస్‌) కింద తొలి వాయిదాను నవంబరు 30లోగా చెల్లించాలని, లేదంటే ఆ తర్వాత డిక్లరేషన్‌ ఇచ్చినా చెల్లుబాటుకాదని ప్రకటించింది. లెక్కలోకి రాని ఆస్తులు, ఆదాయంపై 45శాతం జరిమానాతో ‘నల్ల’కుబేరులకోసం కేంద్రం ఐడీఎస్‌ ను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఇప్పటిదాకా 64, 275 దరఖాస్తుదారులు 65,250కోట్ల మొత్తాన్ని వెల్లడించారు. ఇందులో 29,362కోట్లు ప్రభుత్వానికి పన్ను రూపేణా వచ్చాయి.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు