హోమ్ / వార్తలు / నవ్యాంధ్రలో కొలువుల జాతర!
పంచుకోండి

నవ్యాంధ్రలో కొలువుల జాతర!

నవ్యాంధ్రలో కొలువుల జాతరకు తెరలేచింది. ఆరు ఇంజనీరింగ్‌ విభాగాల్లోని మొత్తం 748 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ) పోస్టులను నేరుగా భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్ సీ) గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది

నవ్యాంధ్రలో కొలువుల జాతరకు తెరలేచింది. ఆరు ఇంజనీరింగ్‌ విభాగాల్లోని మొత్తం 748 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ) పోస్టులను నేరుగా భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్ సీ) గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 21 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే ముందుగా అభ్యర్థులు తమ బయోడేటాను వన్‌టైమ్‌ ప్రొఫైల్‌ రిజిసే్ట్రషన్‌ (ఓటీపీఆర్‌)లో రిజిసే్ట్రషన్‌ చేసుకోవాలి. అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు రూ.250, పరీక్ష ఫీజు రూ.120 చొప్పున అభ్యర్థులు చెల్లించాలి. అయితే పలు రిజర్వుడ్‌ కేటగిరీ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (సిబిఆర్‌టి) ప్రాతిపదికగా సెలెక్షన్స్‌ చేపడతారు. ఆబ్జెక్టివ్‌ టైప్‌లో 3 పేపర్లలో పరీక్షను మొత్తం 450 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌ 150 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూలు ఉండవు. ఓసీ అభ్యర్థులకు 40శాతం, బీసీ అభ్యర్థులకు 35శాతం, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌ అభ్యర్థులకు 30శాతం క్వాలిఫైయింగ్‌ మార్కులుగా నిర్ణయించారు. ఈ ఏడాది జూలై ఒకటో తేదీకి 18-40 ఏళ్ల వయస్కులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వివిధ రిజర్వుడ్‌ కేటగిరీ అభ్యర్థులకు నిబంథనల ప్రకారం సడలింపులు ఉంటాయి. ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నవంబర్‌ 3-5 తేదీల మధ్య పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ www.psc.ap.gov.inలో చూసుకోవచ్చు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు